For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రెగ్నెన్సీ ప్రారంభంలో డయోరియా సమస్యకు కారణాలు

|

సాధారణంగా మహిళలు గర్భం పొందిన తర్వాత వివిధ రకాల ఆరోగ్య సమస్యలను, శారీరక, మానసిక సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. అందులో ముఖ్యంగా గర్భం ధరించిన కొద్ది రోజుల్లో లేదా ప్రారంభం సమయంలో తరచూ టాయిలెట్ కు వెళ్ళడం లేదా నీళ్ళ విరేచనాల అవ్వడం జరుగుతుంటే దాన్ని డయోరియా సమస్యగా గుర్తించాలి.

ఎర్లీ ప్రెగ్నెన్సీలో (గర్భం పొందిన ప్రారంభ సమయంలో)తరచూ లూజ్ మోషన్ అవుతుంటే, మీరు మరింత నీరంగా అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒక ప్రక్క వాంతులు మరియు వికారంతో శరీరంలో నీరు భయటకు వస్తుంటే, మరోప్రక్క విరేచనాలతో శరీరంలోని నీటి శాతం మొత్తం ఖాలీ అవ్వడం వల్ల వెంటనే డీహైడ్రేషన్ కు గురి అవుతారు.

READ MORE: గర్భధారణ సమయంలో వచ్చే ఆరోగ్య సమస్యలు

కొందరు గైనిక్ నిపుణుల అభిప్రాయం ప్రకారం గర్భధారణ ప్రారంభ సమయంలో లూజ్ మోషన్ అవ్వడం అనేది సహజం, ఇది శరీరంలో హార్మోనల్ అసమతుల్యత వల్ల జరుగుతుందని వారి అభిప్రాయం. అయితే డయోరియాకు ఎక్కువ భయపడాల్సి అవసరం లేదు. కానీ, మోషన్ లో బ్లడ్ లేదా, డయోరియాతో పాటు ఫీవర్ మరియు నొప్పి లక్షణాలు ఉన్నట్లైతే తప్పనిసరిగా గైనకాలజిస్ట్ ను సంప్రదించాలి.

READ MORE: గర్భిణీ నార్మల్ డెలివరీ కోసం కొన్ని ఎఫెక్టివ్ ప్రెగ్నెన్సీ టిప్స్

మహిళల గర్భధారణ ప్రారంభ సమయంలో విరేచనాలు అవ్వడానికి హార్మోన్ల హెచ్చుతగ్గులు మరియు ఆహారంలో అనేక అకస్మిక మార్పుల వల్ల కారణం కావచ్చు. డయోరియా చాలా తక్కువ సమయంలోనే తగ్గినా కూడా డీహైడ్రేషన్ మరియు వాంతులు అవ్వడంతో పరిస్థితి కష్టంగా ఉంటుంది. గర్భధారణలో మహిళల్లో డయోరియాకు గల కారణాలు మరికొన్ని ఈ క్రింది విధంగా...

డైట్ లో మార్పుల వల్ల

డైట్ లో మార్పుల వల్ల

గర్భధారణ నిర్ధాణ అయిన వెంటనే మీ తీసుకొనే ఆహారంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి . ఇవి కూడా డయోరియా కారణం కావచ్చు .

హార్మోన్ల మార్పులు:

హార్మోన్ల మార్పులు:

మహిళ గర్భం పొందిన తర్వాత, శరీరంలో అనేక హార్మోన్ల మార్పులు, హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల డయోరియాకు కారణం కావచ్చు. ఒక సారి శరీరంలో మార్పులు జరిగి క్రమబద్దం అయిన తర్వాత పరిస్థితి తిరిగి యాథాస్థితికి వస్తుంది.

 ఫుడ్ అలర్జీలు:

ఫుడ్ అలర్జీలు:

ప్రెగ్నెన్సీ ప్రారంభ దశలో ఫుడ్ అలర్జీ వల్ల కూడా డయోరియాకు కారణం కావచ్చు. ముఖ్యంగా మొదటి ప్రెగ్నెన్సీలో ఫుడ్ అలర్జీ చాలా సర్వ సాధారణంగా ఉంటుంది.

ఫుడ్ పాయిజనింగ్:

ఫుడ్ పాయిజనింగ్:

గర్భధారణ ప్రారంభ దశలో కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్య ఎదురవ్వవచ్చు. అలాంటి పరిస్థితే ఎదురైతే, వెంటనే డాక్టర్ ను సంప్రధించాలి.

నీళ్ళు :

నీళ్ళు :

కొన్ని సందర్భాల్లో ఎక్కువ నీళ్ళు త్రాగడం వల్ల కూడా డయోరియా లక్షణాలు కనబడుతాయి.

ఐరన్ కంటెంట్:

ఐరన్ కంటెంట్:

ప్రీనేటల్ విటమిన్స్ తీసుకొనే వారిలో కొన్ని సందర్భాల్లో డయోరియాకు కారణం అవుతుంది. అలాంటి సందర్భాల్లో డాక్టర్ ను తప్పనిసరిగా సంప్రదించాలి.

వ్యాయామాలు :

వ్యాయామాలు :

కొంత మంది మహిళల్లో ప్రెగ్నెన్సీ వ్యాయామాల వల్ల కూడా డయోరియాకు కారణం కావచ్చు. గర్భం ప్రారంభ దశలో ఫిజికల్ యాక్టివిటీస్ తో ప్రేగుల మీద ఎక్కువ ఒత్తిడి పెరగడం వల్ల విరేచనాలకు దారితీయవచ్చు.

 వైరల్ ఇన్ఫెక్షన్స్:

వైరల్ ఇన్ఫెక్షన్స్:

వైరల్ ఇన్ఫెక్షన్స్ లేదా వైరల్ అంటువ్యాధుల వల్ల కూడా మహిళల్లో డయోరియాకు కారణం కావచ్చు. ఇలా ఇన్ఫెక్షన్ కు గురి అయినప్పుడు డయోరియా చాలా సాధరణ సమస్యగా గుర్తించి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి.

English summary

Causes Of Diarrhea In Early Pregnancy: Pregnancy Tips in Telugu

When you experience loose motions during early pregnancy, you might panic more. Health experts say that loose motion in early pregnancy is common may be due to the hormonal actions.
Story first published: Tuesday, June 23, 2015, 18:16 [IST]
Desktop Bottom Promotion