For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భస్రావం తర్వాత తీసుకోవాల్సిన ఆరోగ్య సంరక్షణ చిట్కాలు

By Super
|

మాతృత్వం అనేది ఒక వరం, అలాగే మాతృత్వపు అభినందనలను తరచుగా కోరుకుంటారు. తల్లికావడం అనేది చాలామంది తల్లుల కోరిక. బిడ్డకు జన్మనివ్వడం అనేది ఒక అద్భుతమైన అనుభవం, ఆ ఆనందాన్ని పొందడానికి ప్రతి తల్లి ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తుంటుంది.

అయితే, ప్రమాదాలను తప్పించలేము. పీడకల గర్భం పోగొట్టుకోవడం కంటే మంచిది కాదు. ఇది స్త్రీలలో నిరాశ, నిస్పృహలను నింపుతుంది. గర్భస్రావం అనేది శాపం, నిజానికి ఈ శాపాన్ని చాలామంది ఎదుర్కునే ఉంటారు.

మీకు ఈ సమస్య ఎదురైతే, గర్భస్రావం తర్వాత మీరు మీ ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. గర్భస్రావం తర్వాత మీరు తెలుసుకోవాల్సిన, మరియు అర్ధం చేసుకోవాల్సిన ఆరోగ్య చిట్కాలు ఈ కింద ఇవ్వబడ్డాయి.

ఈ కింద కొన్ని చిట్కాలు ఇవ్వబడ్డాయి:

పరిస్థితిని ఎదుర్కోవడం:

పరిస్థితిని ఎదుర్కోవడం:

గర్భస్రావాన్ని ఎదుర్కోవడం అనేది చాలా కష్టమైనదని అందరికీ తెలుసు. వాటికి మార్పు ఉండదు, అందువల్ల, అలాంటి పరిస్థితి మళ్ళీ రాకూడదని కోరుకుంటారు. ఏడుస్తూ కూర్చోకుండా, మరలా మీరు గర్భం ధరించే విధంగా మీ శరీరాన్ని మీరు తయారుచేసుకోవాలి.

విశ్రాంతి తీసుకోవడం:

విశ్రాంతి తీసుకోవడం:

గర్భస్రావం తరువాత మీ శరీరానికి విశ్రాంతి అవసరం కనుక గర్భస్రావం జరిగిన తరువాత 24 గంటల వరకు పూర్తి విశ్రాంతి అవసరం. తరువాతి ఐదు రోజుల వరకు మీ శరీర ఉష్ణోగ్రతను గమనించి, రికార్డ్ చేసుకోండి. ఉష్ణోగ్రత 100 డిగ్రీల F ఉంటె ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించండి. రక్తస్రావం తగ్గేదాకా లేదా ఆగేదాకా మందులు, పాడ్స్ వాడండి. గర్భస్రావం తరువాత పరిశుభ్రతను పాటించడం చాలా ముఖ్యమైన విషయం.

శారీరకంగా కలవకండి:

శారీరకంగా కలవకండి:

కొన్ని వారాలపాటు: కనీసం రెండు వారాలపాటు దాంపత్యం గురించి ఆలోచించవద్దు. మీరు కోల్పోయిన బలం తిరిగి పొందక పోతే గర్భస్రావ సమస్యలు మరలా ఎదుర్కొనవలసి వస్తుంది.

మీ కుటుంబంతో సమయాన్ని గడపండి:

మీ కుటుంబంతో సమయాన్ని గడపండి:

గర్భస్రావం వల్ల మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. గర్భస్రావం తరువాత మంచి ఆరోగ్య చిట్కాలు పాటిస్తే, మీరు వంటరిగా ఏడుస్తూ, బాధపడుతూ సమయాన్ని గడపఖ్ఖరలేదు. మీరు మీ ఆనందాన్ని, బాధలను మీ కుటుంబంతో పంచుకోండి. దీనివల్ల మీరు మీ శారీరికపరమైన వత్తిడి నుండి ఉపశమనాన్ని పొందవచ్చు.

శారీరిక శ్రమను తగ్గించండి/మానుకోండి:

శారీరిక శ్రమను తగ్గించండి/మానుకోండి:

గర్భస్రావ౦ వల్ల శరీరం, మనసూ రెండు వత్తిడికి గురవుతాయి. ఎక్కువ పనితో మీ శరీరాన్ని మీరు అలసట చేసుకోకండి. దీనివల్ల అధిక రక్తస్రావం, అలాగే ఇతర శారీరిక సమస్యలు ఎదురవుతాయి. ఎక్కువ బరువులు మోయకండి. తరచుగా ముందుకు వంగడం మానేయండి.

మీ ఆలోచనలను మీ భర్తతో పంచుకోండి:

మీ ఆలోచనలను మీ భర్తతో పంచుకోండి:

గర్భస్రావం అనేది మీకేకాదు మీ భర్తకు కూడా మానసిక వేదనే. మీరు మీ ఆలోచనలను మీ భర్తతో పంచుకుని వత్తిడిని తగ్గించుకోండి. దీనివల్ల చివరగా మీరు మంచి భావనను పొందుతారు. ఎలాంటి పరిస్థితులలో అతనిని వంటరిగా వదలొద్దు. మనసులోని ఆలోచనలను పంచుకోవడం వల్ల మీకు మీ భర్తకు మధ్య మంచి అవగాహన అభివృద్ది చెందుతుంది.

మరో గర్భానికి ప్రణాళిక చేసుకోండి:

మరో గర్భానికి ప్రణాళిక చేసుకోండి:

గర్భస్రావం తరువాత అన్ని ఆరోగ్య సంరక్షణ చిట్కాలలో ఇది అత్యంత ప్రధానమైనది. మొదటి గర్భస్రావం వల్ల కలిగిన సమస్యలు మీ శరీరాన్ని మరింత మెరుగుపరుచుకోవడానికి సహాయపడతాయి.

ఈ విషయాలన్నీ మీ మనసులో ఉంచుకోని, మరో గర్భానికి ప్రణాళిక వేసుకోండి. మీరు మీ వద్యుని సలహా తీసుకోవడం మటుకు మర్చిపోకండి. మీరు మీ శారీరిక సమస్యలు అన్నిటినీ మీ వైద్యునికి వ్యక్తపరచండి.

ఆహరం:

ఆహరం:

గర్భస్రావం తరువాత మీరు ఆరోగ్యాన్ని రక్షించుకొవడంలో మీరు తీసుకునే ఆహారంపై శ్రద్ధ పెట్టడం కూడా చాలా అవసరం. మీరు ఒక నిపునుడిని, అన్ని విషయాలు తెలిసిన వైద్యుడిని, అలాగే ఆహార నిపుణుడి సలహా కూడా తీసుకోండి.

English summary

Health Care Tips After A Miscarriage

Motherhood is a bliss and people are often of the view that it complements womanhood as well. Most of the women dream of becoming a mother. Giving birth to a child is a divine experience that most of the would-be mothers wish to experience with great eagerness.
Story first published: Friday, May 8, 2015, 10:07 [IST]
Desktop Bottom Promotion