For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎక్కువ సార్లు గర్భస్రావం జరిగితే ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు

By Super
|

నిరంతర గర్భస్రావానికి గురయ్యే కొంతమందికి ప్రాణహాని జరిగే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంది. తరచూ గర్భస్రావం జరిగితే ముందుముందు గర్భం ధరించడం కష్టమౌతుంది. నిరంతర గర్భస్రావాల వల్ల గర్భందాల్చే అవకాశాలు తక్కువవడం, స్టెన్ పెల్విక్ ఇంఫ్లేమేటరీ, గర్భస్రావాలు, అకాల జననాలు వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి. బహుళ గర్భస్రావాలు ప్రమాదం కావడానికి ఇవే కారణాలు.

నిర్దిష్ట మేరకు శస్త్రచికిత్స ద్వారా గర్భస్రావం జరిగిన స్త్రీలకూ నెలలు నిండకుండా పిల్లలు పుట్టడం లేదా తక్కువ బరువుతో పిల్లలు పుట్టడం వంటి సమస్యలు వస్తాయి. మూడు లేదా అంతకంటే ఎక్కువ గర్భస్రావం జరిగిన స్త్రీలకూ గర్భాశయ ప్రమాదాలు రావచ్చు. అంతేకాకుండా ఆ తరువాత కూడా ఎక్కువ గర్భస్రావాలు అయ్యే ప్రమాదం తీవ్రతరం కావచ్చు.

గర్భాస్రావంలో ఇలాంటి కొన్ని సమస్యల వల్ల సంతానోత్పత్తి పై ప్రభావం పడుతుంది, డెలివరీ ముందు కూడా సమస్యలు వస్తాయి. ఈ రోజుల్లో చాలామంది జంటలు వందత్వం, ఎక్టోపిక్ గర్భం లేదా పుటకలో లోపాలతో వేదన చెందవలసి వస్తుంది. వందత్వం అనేది 12 నెలల ప్రయత్నం తరువాత కూడా గర్భోత్పత్తిని విఫలం చేస్తుందని నిర్వచించారు. వందత్వానికి సాధారణంగా పెరిగే స్థాయిలకు అనేక విషయాలు కారణం కావచ్చు, కొన్ని సమస్యలకు కారణం శస్త్రచికిత్స గర్భస్రావాలు అని అనేకమంది వైద్య అభ్యాసకులు భయపడుతున్నారు. బహుళ గర్భస్రావాలు మీ ఆరోగ్యానికి ఎందుకు ప్రమాదమో ఇక్కడ కొన్ని సాధారణ కారణాలు ఇవ్వబడ్డాయి.

గర్భస్రావం

గర్భస్రావం

కొన్నిసార్లు వైద్యపరమైన గర్భస్రావానికి మందులు వాడినా గర్భస్రావం ఔతుంది. గర్భాశయ ముఖద్వారం దెబ్బతినే అవకాశం ఉంటే, భవిష్యత్తులో గర్భం దాల్చడానికి బలహీనమయ్యే అవకాశం ఎక్కువ ఉండి. మరోవైపు గర్భస్రావం జరిగే ప్రమాదం కూడా ఉండి. గర్భస్రావ సమయంలో గర్భసంచి పాడైపోతే, గర్భసంచి మీద మచ్చలు ఏర్పడతాయి.

పరిణతి చెందక ముందే డెలివరీ

పరిణతి చెందక ముందే డెలివరీ

బహుళ గర్భస్రావాలకు ఇది కూడా ఒక కారణం. ఇది చాలా ప్రమాదకరమైనది ఎందుకంటే ఇది పరిణతి చెందక ముందే డెలివరీ అయ్యే ప్రమాదాన్ని పెంచుతుంది, మాయ అసాధారణ రీతిలో అభివృద్ది చెందుతుంది.

గర్భసంచి వెలుపల గర్భం రావడం

గర్భసంచి వెలుపల గర్భం రావడం

నిరంతర గర్భస్రావాలు గర్భసంచి వెలుపల గర్భం రావడానికి ప్రమాదాన్ని సూచిస్తాయి. గర్భసంచి వెలుపల గర్భం రావడం అనేది ప్రాణాంతకమైనది, అంతేకాకుండా దీనివల్ల సంతానోత్పత్తి కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి.

పొత్తికడుపు వాపు వ్యాధి

పొత్తికడుపు వాపు వ్యాధి

పొత్తికడుపు వాపు వ్యాధి కూడా బహుళ గర్భస్రావానికి ఒక కారణం. ఈ PID వందత్వానికి కూడా దారితీసే ఈ వ్యాధి ప్రాణాంతకమైనది కూడా. దీనివల్ల ఫలోపియన్ ట్యూబ్స్ కణజాలానికి మచ్చల కారణ౦ ఔతుంది. దీనివల్ల అవి బలహీనపడి, చివరికి సంతానోత్పత్తి తగ్గిపోతుంది. అప్పుడప్పుడు PID మిస్-కారేజ్ అయినపుడు లేదా గర్భస్రావ౦ తరువాత సంభవిస్తుంది. PID ఉన్న స్త్రీలకూ గర్భసంచి వెలుపల గర్భం వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఈ సూక్ష్మాన్ని గ్రహించండి.

గర్భం దాల్చక పోవడం

గర్భం దాల్చక పోవడం

చాలామంది స్త్రీలు సంతనోత్పత్తే గర్భస్రావం జరగడానికి ప్రధాన కారణమని భావిస్తారు, వారు సిద్ధంగా లేకపోతే గర్భం దాల్చకూడదు అని భావిస్తారు, అయితే నిజానికి ముఖద్వారా వ్యాకోచం తరువాత, కణజాలాన్ని తొలగించే శస్త్ర చికిత్స విధానం (గర్భస్రావం కోసం) గర్భాశయంపై అసాధారణ మచ్చల ద్వారా వంధత్వ సమస్యలు ఏర్పడతాయి.

ఎండోమెట్రిటిస్

ఎండోమెట్రిటిస్

నిరంతర గర్భస్రావాలకు ఎండోమెట్రిటిస్ ఒక కారణం. అందరు మహిళలలో ఈ ప్రమాదం గర్భస్రావం తరువాత వస్తుంది. 20-29 మధ్య వయసున్న మహిళలకు గర్భస్రావం తరువాత ఎండోమెట్రిటిస్ వస్తుంది.

గర్భాశయానికి రంధ్రం పడడం

గర్భాశయానికి రంధ్రం పడడం

ఎక్కువగా 2 నుండి 3% గర్భస్రావం జరిగిన వారు గర్భాశయ రంద్రంతో బాధపడుతుంటారు. ఇంతకూ ముందు డెలివరీ అయిన మహిళలు గర్భాశయ రంధ్రం తో బాధపడవచ్చు. రోగికి ఈ సమస్య సాధ్యమైనదైనా వారు గర్భస్రావ సమయంలో సాధారణ అనెస్తీషియా తీసుకోవాలి.

అంటువ్యాధులు

అంటువ్యాధులు

బహుళ గర్భస్రావాల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు చాలా ప్రమాదకరం, అయితే స్టీలు అప్పటి నుండి అధిక రక్తస్రావం, సంక్రమణ, మూర్చలు, అనస్తీషియ సమస్యలు, రక్తం గడ్డకట్టుక పోవడం, గర్భాశయంలో నొప్పి, ఎండోటాగ్జిక్ షాక్, సీర్వికల్ గాయపడడం, రక్తస్రావం వంటి సాధారణ సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. రెండు కంటే ఎక్కువసార్లు గర్భస్రావం జరిగిన స్త్రీలు ఈ సమస్యలను ఎక్కువగా ఎదుర్కొనవలసి ఉంటుందని కొన్ని అధ్యయనాలు కనుగొన్నాయి. మరోవైపు బహుళ గర్భస్రావాల వల్ల విపరీతమైన పొత్తికడుపు నొప్పి, మంటలు, వాంతులు, జీర్ణ-ప్రేగుల ఇబ్బందులు వంటి ఇతర చిన్న సమస్యలు కూడా ఉంటాయి. బహుళ గర్భస్రావాల ప్రమాదాలకు ఇవి కూడా కొన్ని కారణాలు కావచ్చు.

English summary

Health Risks Of Multiple Abortions

Not many are aware that continual abortions do raise the risk of life threatening problems. And repeated abortions will make your future pregnancies problematic.
Desktop Bottom Promotion