For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీలు దగ్గు నివారణ మందులు తీసుకోవడం సురక్షితమేనా?

|

ప్రతి ఒక్కరు మందుల వాడకంపై శ్రద్ధ చూపాలి, ముఖ్యంగా గర్భ సమయంలో తప్పని సరి అని చెప్పవచ్చు. గర్భసమయంలో కొన్ని రకాల మందులను వాడటం వలన పిండాభివృద్ధిలో సమస్యలు కలుగుతాయని తాజా పరిశోధనలలో వెల్లడించబడింది.

ముఖ్యంగా గర్భధారణ సమయంలో దగ్గు నివారణ టానిక్ తప్పని సరిగా అవసరం అవుతుంది. గర్భ సమయంలో ఈ టానిక్ ను తీసుకోవటం వలన, గర్భాశయంలో ఉండే శిశువుకు హాని కలుగుతుందని ఇప్పటి వరకు నిరూపించబడలేదు. "ఫ్యామిలీ డాక్టర్ ఆర్గనైజేషన్" వారు తెలిపిన దాని ప్రకారం, అధిక గాడతలు గల దగ్గు నివారణ మందుల వాడకానికి కన్నా స్వల్ప గాడతలు మరియు వైద్యుడు తెలిపిన మేరకు మాత్రమే తీసుకోవటం మంచిది.

Is It Safe to Use Cough Medicine for Pregnant Women?

గర్భ సమయంలో మందుల వర్గీకరణ

"యూ ఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్" వారు గర్భ సమయంలో వాడే మందులని వివిధ వర్గాలుగా విభజించారు. వీటిలో వర్గం 'A' రకం మందులు గర్భ సమయంలో శ్రేయస్కరం వర్గం 'B' మరియు 'C' రకానికి చెందిన మందులు పిండాన్ని ప్రమాదానికి గురి చేసాయని కనుగొన్నారు. చాలా మేరకు దగ్గు నివారణ మందులు ఆల్కహల్ శాతం అధికం ఉండటం వలన వీటిని వర్గం 'B' మరియు 'C' కింద చేర్చారు.

దగ్గు అణచివేసే మందులు
గొంతు పొడిగా మారి, పొడి దగ్గు వస్తూ మరియు గొంతులో కలిగే దురదలను తగ్గించి వేస్తుంది. గర్భసమయంలో వాడే మందుల వర్గీకరణలో వీటిని వర్గం 'C' కింద చేర్చారు. 'జంతు అధ్యయన శాస్త్రం' వారు, ఈ దగ్గు మందులను గర్భంతో ఉన్న జంతువుల పై వాడటం వలన పిండాభివృద్ధిలో దుష్ప్రభావాలు కలిగాయని కనుగొన్నారు. కానీ ఇదే మందు గర్భంతో ఉన్న స్త్రీలలో ఎలాంటి దుష్ప్రభాలను చూపకపోవటం విశేషం.

డెకోన్జెస్టాంట్లు
"ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్" వారు తెలిపిన దాని ప్రకారం, గర్భిణీ స్త్రీలు మాత్రమే ఈ రకం దగ్గు నివారణ మందులను వాడాలి. ప్రథమ త్రైమాసిక దశలో ఈ రకం మందును వాడటం వలన దుష్ప్రభావాలు కలుగుతాయని కనుగొన్నారు.

ఎక్స్పేక్టోరెంట్స్
ఈ రకం మందులు, తీవ్ర దగ్గుతో పాటుగా, అధికంగా ఉమ్మి వచ్చే వారిలో త్వరగా తగ్గును తగ్గిస్తాయి. ఇవి కూడా వర్గం 'C' కింద చేర్చబడ్డాయి. కానీ, వీటిని మాత్రం వైద్యుడి సూచనల మేరకు మాత్రమె వాడాలి.

యాంటిహిస్టమైన్
"అమెరికన్ యాంటీ ఫ్యామిలి ఫిజిసియన్" వారి తెలిపిన దాని ప్రకారం, యాంటిహిస్టమైన్ లను దగ్గు కలిగించే కారకాలు శరీరంలో ప్రవేశించినపుడు మాత్రమె ఈ రకం దగ్గు నివారణ మందులను వాడాలి. ఈ రకం మందులను కూడా వర్గం 'B' కింద చేర్చారు. వైద్యుడి నిమిత్తం లేకుండా వీటిని వాడకూడదు.

గర్భధారణ సమయంలో హాని కలిగించని చాలా రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. కానీ, గర్భ సమయంలో వాడే ప్రతిమందుని వాడటానికి ముందు వైద్యుడిని కలవటం మరవకండి. ఎంత మొత్తంలో తీసుకోవాలో కూడా వైద్యుడు సూచిస్తాడు, వైద్యుడి సూచనల మేరకు మాత్రమే వాడాలి. ఒకవేళ గర్భ సమయానికి ముందు గానీ, గర్భ సమయంలో ఎవైన దగ్గు మందులను వాడితే మాత్రం వెంటనే వైద్యుడిని కలవండి.

Story first published: Wednesday, March 4, 2015, 18:16 [IST]
Desktop Bottom Promotion