For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా తినకూడని 10రకాల పండ్లు

గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా తినకూడని 10రకాల పండ్లు

By Lekhaka
|

సాధారణంగా పళ్లు తింటే ఆరోగ్యం ఆనందం రెండూ కలుగుతాయని చెప్తారు పెద్దలు అయితే కొన్ని రకాల ఫలాలు సమయానుకూలంఆ తీసుకోకుంటే కొత్త సమస్యలు తెచ్చి పెతాయని, అందునా గర్భవతులు కొన్ని పళ్లు తీసుకుస్త్రంటే అనేక దుష్పరిణామాలను చవి చూడాల్సి వస్తుందని కూడా చెప్పారు. ఇలా సమస్యలు తెచ్చి పెట్టే ఫలాలపై ఓ సారి దృష్టి పెడితే..

లోంగన్

లోంగన్

లోంగన్ చాలా రుచిగా, తియ్యగా, సువాసన కలిగి ఉండే పండు. చాలా మంది దీనిని ఇష్టపడతారు. అయితే గర్భిణీ స్త్రీలు దీనిని తినకూడదు ఎందుకంటే వారి కడుపులో కొంత వేడి వుంటుంది, దాని వల్ల త్వరగా మలబద్ధకం వస్తుంది. అందువల్ల లోంగన్ పళ్ళు తింటే శరీరం మరింత వేడెక్కి గర్భస్థ శిశువు పెరుగుదల కుంటుపడుతుంది. తత్ఫలితంగా దీని వల్ల రక్తస్రావం అవుతుంది. గర్భిణీ స్త్రీలు లోంగన్ పళ్ళు ఎక్కువగా తింటే గర్భస్థ పిండానికి హాని కలిగి గర్భస్రావానికి దారి తీస్తుంది.

పీచ్

పీచ్

పీచ్ పళ్ళలో ఇనుప ఖనిజం పాలు అధికంగా వుంటుంది. పైగా, ఇందులో మాంసకృత్తులు, చక్కర, జింక్, పెక్టిన్ లాంటివి పుష్కలంగా వుంటాయి. అయితే పీచ్ పండు కూడా వేడి కలిగిస్తుంది. గర్భిణీ స్త్రీలు దీనిని తింటే రక్తస్రావం అయ్యే ప్రమాదం వుంది. పైగా ఈ పండులో వుండే పీచు పదార్ధం గొంతుకు ఇబ్బంది కలిగిస్తుంది కనుక గర్భిణీ స్త్రీలకూ అలర్జీ, గొంతు నెప్పి కలుగవచ్చు. అందువల్ల వారు ఈ పండును ఎక్కువగా తినకూడదు, ఒకటి రెండు తిన్నా పై తోలు వలిచి పీచు అడ్డు పడకుండా చూసుకోవాలి.

లిచి

లిచి

పూర్వీకులు చెప్పే దాని ప్రకారం లిచీ చాలా తియ్యటి పండు, అందంగా కనపడడానికి దోహదం చేస్తు౦ది. అయితే గర్భిణీ స్త్రీలు దీన్ని ఎక్కువగా తినకూడదు - ఎందుకంటే ఇందులో చక్కర శాతం ఎక్కువ. అందువల్ల ఇది వారికి స్థూలకాయం, మధుమేహం రావడానికి దారి తీయవచ్చు. పైగా గర్భిణీ స్త్రీలు దీన్ని పరిమితంగానే తినాలి, ఎందుకంటే వేడి కలిగించే లక్షణం వల్ల ఇది శరీరానికి మేలు చేయదు.

రేగు పండ్లు

రేగు పండ్లు

రేగు జాతి పండ్లలో కెరోటిన్ పుష్కలంగా వుంటుంది - ఇందువల్ల ఇది శరీరం లోకి వెళ్ళినప్పుడు, ఇది విటమిన్ ఏ గా మారిపోతుంది - ఇది కళ్ళకు మంచిది. పై పెచ్చు రేగు పళ్ళ గుజ్జులో మాంస కృత్తులు, కొవ్వు, భాస్వరం, ఇనుము, పొటాషియం లాంటివి వుంటాయి - ఇవి మలినాలను శుద్ది చేయడానికి సహకరిస్తాయి.

అయితే రేగు పళ్ళు కూడా వేడి చేస్తాయి కనుక గర్భిణీ స్త్రీలు దీన్ని తినకూడదు. వీటిని ఎక్కువగా తింటే వేడి కలిగిస్తాయి, అది చర్మం మీద దద్దుర్లు గా మచ్చలుగా బయట పడుతుంది. అలాగే తల్లీ పిల్లల ఆరోగ్యానికి కూడా మంచిది కాదు.

సీతాఫలం

సీతాఫలం

సీతాఫలం చాలా తీయగా సుగంధ భరితంగా వుంటుంది. తగిన మోతాదులో తీయగా వుండే ఈ పండు తినేటప్పుడు జిగురుగా అనిపించదు, అందువల్ల చాలామంది, ముఖ్యంగా స్త్రీలు ఇది తినడానికి ఇష్టపడతారు.అయితే ఈ తీపి రుచి గుండ్రని ఆకారం ఇది తినే వారి శరీరాన్ని వేడిగా తయారు చేస్తుంది. అందువల్ల సీతాఫలం ఎక్కువగా తినే గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్త వహించాలి.

జామ పండు

జామ పండు

రుచిగా వుంటుంది కనుక జామపండు తినాలని చాలా మంది స్త్రీలు కోరుకుంటారు. అయితే జామ కాయ శీతోష్ణాలు కలిగించే లక్షణం వాటి రకం మీద ఆధారపడి వుంటుంది. కొన్ని రకాల జామ కాయల్లో చాలా నీరుండి, తక్కువ తియ్యగా వుంటాయి, చల్లగా కొంచెం పుల్లగా వుంటాయి. కానీ గర్భిణీ స్త్రీలు వీటిని తోలు తీయకుండా తింటే కొన్ని దుష్ప్రభావాలు వుంటాయి - మలబద్ధకం లాంటివి. మరి కొన్ని తీయగా వుంటాయి కానీ అవి మీ శరీరాన్ని లోపలినుంచి వేడిగా తయారు చేస్తాయి. అందువల్ల శరీరానికి తక్కువ వేడి కలిగించే రకాలు మాత్రమె గర్భిణీ స్త్రీలు కొనుక్కోవాలి, పైగా తప్పనిసరిగా తోలు తీసే తినాలి.

స్టార్ యాపిల్

స్టార్ యాపిల్

వాతావరం వేడిగా ఉడుకుగా వుంది. మీరు బయటకు వెళ్లి వచ్చాక ఐసు ముక్కతో కూడిన స్టార్ ఆపిల్ ముక్క చాలా బాగుంటుంది. అయితే స్టార్ ఆపిల్ వేడి కలిగించే లక్షణం కలిగి వుంటుంది కనుక గర్భిణీ స్త్రీలు దీనిని తినకూడదు. ఒకవేళ తినేటట్లయితే దాని తోలు తీసి తినాలి ఎందుకంటే దాంట్లో వుండే దాని ఘాటైన రుచి వల్ల మలబద్ధకం కలుగుతుంది.

 బొప్పాయి:

బొప్పాయి:

గర్భవతులు బొప్పాయి పండు తీసుకుంటే అందులోని సి విటమిన్‌ మేలు చేస్తుందని, వారిలో వచ్చే గుండె మంట, మలబద్దకం తగ్గేందు కుఉపయోగపడు తుందని పెద్ద లు చెప్పి నా.. బొప్పాయిలో గర్భ విఛ్చిన్న గుణాలుండటంతో సురక్షిత ప్రసవం కోరుకునే గర్భిణీలు దాన్ని తినవద్దనే చెప్తారు. అయితే ప్రసవానంతరం బొప్పాయికి కాసింత తేనె కలిపి తీసుకుంటే పిల్లలకు సరిపడ పాలు పడతాయి. పైగా ప్రసవంలో కోల్పోయిన సత్తువని బొప్పాయందించే విటమిన్‌ సి తో సరి చేసుకోవచ్చు.

పైనాపిల్‌:

పైనాపిల్‌:

గర్భవతిగా ఉన్నవారు ప్రసవం అయ్యే వరకు పైనాపిల్‌కి దూరంగా ఉండాల్సిందే. ఇందుకు ముఖ్య కారణం ఇందులో అధికంగా ఉండే బ్రొమెలైన్‌ అనే పదార్ధం గర్భాశయాన్ని శుభ్ర పరిచే గుణం కలది. దీంతో గర్భ విఛ్చినం కావటమో... నెలలు నిండక ముందే ప్రసవం జరిగి బిడ్డ అనారోగ్యంగా పుట్టడమో జరుగుతాయి. అందుకే గర్భవతులు తినే పళ్లలో ఇది పూర్తిగా నిషేధించిన పండు.

నల్ల ద్రాక్ష:

నల్ల ద్రాక్ష:

చాలా మంది గర్భిణీలుగా ఉన్నవారికి రక్తం ఎక్కువగా ఇచ్చే గుణ ముందని నమ్మి, తెలిసో తెలియకో మార్కెట్‌లో కనిపించే నల్ల ద్రాక్షని కొని ఇస్తుంటారు. అయితే నల్ల ద్రాక్షకు శరీరంలో వేడిని పుట్టించే గుణం ఉండటం వల్ల అది గర్భస్ధ శిశువులకు మంచిది కాక పోవటం, దాన్ని తట్టుకోలేని బిడ్డల ఆరోగ్య స్ధితి మారిపోయే ప్రమాదం కూడా ఉందని అందుకే ఈపళ్లని గర్భిణీలకు ఇవ్వవద్దని వైద్య నిపుణులు సూచిస్తారు.

English summary

10 Kinds Of Fruit That Pregnant Women Shouldn’t Eat

Pregnant Women need to be very careful in their diet. During pregnancy, the woman is surrounded with suggestions on what to eat and what not to eat. It is believed that fruits are good for every time but there are few fruits to avoid during pregnancy.
Desktop Bottom Promotion