For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భధారణ సమయంలో నోటి సంరక్షణ - 10 చేయకూడని,చేయవలసిన పనులు

By Super
|

మీరు గర్భవతిగా ఉన్నప్పుడు బ్రషింగ్ మరియు ఫ్లోస్సింగ్ మొత్తం చాలా ముఖ్యమైనవి. మీ నోటి ఆరోగ్యం నేరుగా పిండం ఆరోగ్యంతో ముడిపడి ఉంది. నోటిలో చెడు దంత విధానా లు లేదా అంటువ్యాధులు పిండం యొక్క అభివృద్ధి మీద ప్రభావితం చేయవచ్చు.అధ్యయనం ప్రకారం శరీరం ఒక సంక్రమణకు ప్రతిస్పందనగా విడుదల చేసే హార్మోన్లు డెలివరి సమయంలో విడుదల అయిన వాటితో పోలి ఉంటాయి. కనుక ఇవి ఒక మౌఖిక సంక్రమణం లేదా కావిటీస్,వాపు, చిగుళ్ళ రక్తస్రావం,నోటి పూతకు దారి తీస్తుందని ముంబై లో దెన్త్శ్ డెంటల్ కేర్ లో ఏస్తేటిక్ డెంటిస్ట్ అయిన డాక్టర్ శంతనుడు జరాది చెప్పారు. ఇక్కడ గర్భధారణ సమయంలో ప్రతి స్త్రీ దంత సంరక్షణ గురించి తెలుసుకోవాలసిన ఐదు విషయాలు ఉన్నాయి.

ఇక్కడ మీ పేలవమైన నోటి ఆరోగ్యం మీ బిడ్డ మీద ఎలా ప్రభావితం చేస్తుందో కొన్ని మార్గాలు ఉన్నాయి:

మీ పిల్లలకు దంత క్షయం రావచ్చు
నోటి అంటువ్యాధులు తల్లి నుండి పిల్లలకు వస్తాయి. పరిశోధకులు గర్భధారణ సమయంలో తల్లి నోటి ఆరోగ్యం మరియు ప్రారంభ శైశవ క్షయం అభివృద్ధి మధ్య లింక్ ఉందని సూచిస్తున్నారు. హెల్త్ స్టాటిస్టిక్స్ నేషనల్ సెంటర్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 6 సంవత్సరాల లోపు పిల్లలు పది మందిలో ఒకరు ప్రభావితం అవుతున్నారని డాక్టర్ జరాది చెప్పారు. గర్భధారణ సమయంలో చిగుళ్ళ ఆరోగ్యాన్ని ఏ విధంగా నిర్వహించాలో ఇక్కడ ఉంది.

మీకు మరియు బిడ్డకు వివిధ రకాల పరిస్థితుల్లో ప్రమాదం ఎక్కువగా ఉంటుంది
ముందుగా పుట్టిన పిల్లలు మరియు తక్కువ బరువుతో పుట్టిన పిల్లల జీవితకాల పరిస్థితుల్లో సెరిబ్రల్ పాల్సి, దీర్ఘకాల ఊపిరితిత్తుల వ్యాధి లేదా అకాల మరణం వంటి ప్రమాదాలు పెరుగుతాయి. నిజానికి, మీరు గర్భం సమయంలో చిగుళ్ళ వ్యాధితో బాధపడుతూ ఉంటే, ఆరోగ్యకరమైన చిగుళ్ళు కలిగిన మహిళలు కంటే మీ పిల్లలకు ఆరు రెట్లు ఎక్కువగా వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మీ చిగుళ్ళు గర్భధారణ సమయంలో ఎలా ప్రభావితం అవుతాయి? మీరు దాని గురించి ఎప్పుడు తెలుసుకోవాలి.

మీరు ఈ సమస్యలను నివారించడానికి ఏమి చేయవచ్చు?

ఇక్కడ మీ దంతాలు మెరుస్తూ మరియు ఆరోగ్యకరముగా ఉండటానికి డాక్టర్ జరాది సూచించిన కొన్ని చేయవలసినవి మరియు చేయకూడనివి ఉన్నాయి.

ప్రారంభ చెక్ అప్ కోసం వెళ్ళండి

ప్రారంభ చెక్ అప్ కోసం వెళ్ళండి

గర్భాదరణ సమయంలో దంత సంరక్షణకు ప్రాదాన్యత ఇవ్వాలి. మీ దంతవైద్యుడు తో అపాయింట్మెంట్ తీసుకోని మీ దంత ఆరోగ్య స్థితి గురించి తెలుసుకొండి. ఒక ప్రొఫెషనల్ తో పూర్తిగా శుభ్రం చేయించుకొనుట మరియు ప్రారంభంలో కావిటీస్ లేదా అంటువ్యాధులకు చికిత్స చేయించుకోవాలి.

 క్రమం తప్పకుండా బ్రష్ మరియు ఫ్లొస్

క్రమం తప్పకుండా బ్రష్ మరియు ఫ్లొస్

బ్రషింగ్ అనేది కేవలం ఉదయం మాత్రమే చేయటం కాదు. దానికి బదులుగా, ఫలకం మరియు పండ్లపాచి ఏర్పాటును నివారించడానికి అవకాశం ఉంటే ప్రతి భోజనం తర్వాత మీ పళ్ళ మీద రుద్దడం మరియు బ్రషింగ్ చేయాలి. అయితే, మీరు రోజు సమయంలో కేవలం ఒకసారి మీ పళ్ళను ఫ్లొస్ చేయవచ్చు. గర్భధారణ సమయంలో హార్మోన్లు మార్పుల కారణంగా చిగురువాపు (చిగుళ్ళు యొక్క వాపు) అభివృద్ధి సాధారణంగా ఉంటుందని గుర్తుంచుకొండి. కాబట్టి మీ నోటి కుహరంను శుభ్రంగా మరియు పరిశుభ్రముగా ఉంచండి. గర్భాదరణ సమయంలో బ్రషింగ్ మరియు ఫ్లోసింగ్ అనేవి మీరు అనుకున్నదాని కంటే మరింత ముఖ్యం ఎందుకో ఇక్కడ ఉంది.

 మధ్యలో గర్భధారణ చెక్-అప్ ప్లాన్

మధ్యలో గర్భధారణ చెక్-అప్ ప్లాన్

హార్మోన్ల మార్పులు నోటి సమస్యలను ప్రేరేపిస్తాయి. అది మొదటి త్రైమాసికం తర్వాత దంతవైద్యుడుని సందర్శించడం మరియు ఒక ప్రొఫెషనల్ తో క్లీన్ అప్ పొందడం ఉత్తమం.

తరచుగా మీ నోటిని శుభ్రం చేయాలి

తరచుగా మీ నోటిని శుభ్రం చేయాలి

మీరు ఉదయం అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే, వాంతుల తర్వాత మీ నోటిని పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. ఒకవేళ మీరు మరింత శుభ్రం చేయటానికి ఒక బ్రష్ ను ఉపయోగించడం అవసరం. నోటిలో అడ్డుపడే ఆహార అణువులు ఆమ్లత్వానికి దారి తీయుట మరియు దంతాలు క్షీణిస్తున్న ప్రభావాన్ని చూపుతాయి.

 మీరు ఏమి తింటున్నారో వాచ్ చేయండి

మీరు ఏమి తింటున్నారో వాచ్ చేయండి

తాజా పండ్లు, కూరగాయలు మరియు పాల ఉత్పత్తుల వంటి కొన్ని ఆహారాలు మీ పళ్ళకు మంచివి. తరచుగా పండ్లు కూరగాయలను ప్రతి భోజన సమయంలో మరియు అల్పాహారంలో చేర్చండి. అంతేకాక పైబర్ సమృద్దిగా ఉండే తృణధాన్యాలు మరియు ధాన్యాలను కూడా తీసుకోవాలి. నోటిలో అమ్లత్వం తగ్గించడానికి అల్పాహారంలో వోట్మీల్ లేదా సంపూర్ణ ధాన్యం బ్రెడ్ తీసుకోవాలి. ఇక్కడ ఆరోగ్యకరమైన దంతాల కోసం టాప్ 10 ఫుడ్స్ ఉన్నాయి.

ద్రవాలను ఎక్కువగా తీసుకోవాలి

ద్రవాలను ఎక్కువగా తీసుకోవాలి

గర్భధారణ సమయంలో నీటిని తగినంత మొత్తంలో త్రాగటం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే మీ నోటి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది నోటి కుహరం నుండి విషాన్ని బయటకు పంపి చిగుళ్ళను ఆరోగ్యకరముగా ఉంచుతుంది. ఒక గ్లాస్ పాలు కూడా మీ కాల్షియం స్థాయిలు పెంచడానికి మరియు మీ దంత ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయం చేస్తాయి.

గర్భాదరణ తర్వాత దంత ప్రక్రియ కోసం వెళ్ళకూడదు

గర్భాదరణ తర్వాత దంత ప్రక్రియ కోసం వెళ్ళకూడదు

దంత చికిత్స సమయంలో ఉపయోగించే మందులు మరియు X- కిరణాలు పిండం పెరుగుదల మీద ప్రభావం చూపవచ్చు. కనుక మొదటి త్రైమాసికం మరియు మూడవ నెలలో ఏటువంటి దంత పద్ధతులకు వెళ్ళడం మంచిది కాదు.

బ్రషింగ్ చేయటం మానకూడదు

బ్రషింగ్ చేయటం మానకూడదు

మీరు గర్భం సమయంలో చిగుళ్ళ నుండి రక్త స్రావం వచ్చినా, బ్రషింగ్ చేయటం మాత్రం మానకూడదు. మీకు సౌకర్యం కోసం ఒక మృదువైన బ్రష్ కి మారండి.

 స్వీట్స్ మరియు స్నాక్స్ మానివేయాలి

స్వీట్స్ మరియు స్నాక్స్ మానివేయాలి

రిఫైన్డ్ చక్కెరలు ఎక్కువగా ఉన్న తీపి మరియు జిగటగా ఉండే ఆహారాలు మానివేయాలి. మీ ఆరోగ్యకరమైన దంతాలు మరియు చిగుళ్ళ కోసం మీరు స్నాక్ తిన్నా తర్వాత షుగర్ ఫ్రీ గమ్ ను పది నిముషాలు నమలండి. ఇక్కడ మీకు మంచి దంత ఆరోగ్యానికి మానివేయాలసిన కొన్ని ఆహారాలు ఉన్నాయి.

సొంత వైద్యం చేయకండి

సొంత వైద్యం చేయకండి

ఏ సమయంలోనైనా పంటి నొప్పి లేదా రక్తస్రావం,చిగుళ్ళు చికిత్స చేయడానికి సొంత వైద్యాన్ని ఎప్పుడు ప్రయత్నించ కూడదు. మీ దంతవైద్యుడు సహాయం కోరడం మరియు దంత సమస్యల చికిత్స చేయించుకోనే సమయంలో మీ గైనకాలజిస్ట్ ను సంప్రదించాలి

English summary

Oral care during pregnancy — 10 do’ Don’t

Brushing and flossing are important for your overall well-being, more so when you are pregnant. Your oral health is directly linked to fetal health. Bad dental practises or infections in the mouth can impact fetal development.
Desktop Bottom Promotion