For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాన్పు తరువాత పొట్టకు బెల్ట్ ధరించడానికి కారణాలు

By Super
|

తల్లి కావడం అనేది చాలా గొప్ప భావన. కానీ తల్లి కాన్పు తరువాత కాన్పుకు ముందు ఉన్న ఆకృతిని తీసుకురాగలదా? కొంతమంది తల్లులు దీనిపై పని చేస్తారు, కొంతమంది దీన్ని తేలికగా తీసుకుంటారు. కంపు సమయంలో, పొత్తికడుపు విస్తరించడం వల్ల కండరాలు సాగడం వల్ల లో బాక్ పైన వస్తుంది. కాన్పు తరువాత, ఈ కండరాలు సాధారణ స్థితికి రావడానికి కొద్దిగా సమయం పడుతుంది.

కాబట్టి దీనికి పరిష్కారం ఏమిటి? మీ సాధారణ పొట్టను తిరిగి పొందడం ఎలా? పొట్టకు బెల్ట్ సరైన సమాధానం. కాన్పు తరువాత బెల్లీ బెల్తులను ఉపయోగించడానికి గల కారణం, ఇది టోర్సో కి అదనపు ఆధారంగా ఉంది, కండరాలు బాగా పనిచేయడానికి సహాయపడి, దానివల్ల బాక్ పెయిన్ కూడా గణనీయంగా తగ్గుతుంది.

బాడీ బెల్త్స్ తో శరీరాన్ని చుట్టడం, బంధించడం వంటివి సంస్కృతిలో కొత్తేమీ కాదు. కానీ నేడు, అధునాతనంగా, అందంగా ఉండే బెల్లీ బెల్ట్ లు కొత్తగా తల్లులైన వారికి ఇంట్లోనే కాకుండా బైటికి వెళ్ళేటప్పుడు కూడా ధరించడానికి వీలుగా సహాయపడుతున్నాయి.

బెల్లీ బెల్ట్ లు అన్నిరకాల శరీరాలకు వివిధ పరిమాణాలలో, శైలితో దొరుకుతున్నాయి. ఈ బెల్లీ బెల్ట్ లు తేలికపాటి నైలాన్ మెటీరియల్ తో తయారుచేయబడి, వేల్క్రో లతో తొలగించడానికి, సర్దుబాటుకు అనువుగా ఉంటున్నాయి. ఈమధ్య తల్లులైన కొంతమంది వారి పొత్తికడుపు మాత్రమే బంధించే బెల్లీ బెల్ట్ లను ధరిస్తున్నారు, మిగిలినవారు పొత్తికడుపు, తెర్సో రెండిటినీ కప్పి ఉంచే బెల్లీ బెల్ట్ లను ధరిస్తున్నారు.

కాన్పు తరువాత బెల్లీ బెల్ట్ ధరించడం వల్ల ప్రయోజనాలు:

ప్రసవం తర్వాత పొట్టకు బెల్ట్ వేసుకోవడానికి కారణాలు

బాక్ పైన నుండి ఉపశమనం

పొత్తికడుపు బెల్ట్ లు బాక్ పైన నుండి ఉపశమనాన్ని కలిగిస్తాయి. వైద్యులు కాన్పు తరువాత వ్యాయామాలు చేయమని సలహా ఇస్తారు, కానీ పొత్తికడుపు; నొప్పి వల్ల అది అన్ని వేళలా సౌకర్యవంతంగా, అనువుగా ఉండదు. అందువల్ల, బెల్లీ బెల్ట్ సరైన ఎంపిక.

ప్రసవం తర్వాత పొట్టకు బెల్ట్ వేసుకోవడానికి కారణాలు

పొట్టను తగ్గిస్తుంది

కాన్పు సమయంలో, శరీరం రిలాక్సిన్ అనే హార్మోన్ ను ఉత్పత్తి చేస్తుంది, ఇది స్త్రీల పక్కటేముకలలో అనుసంధానించబడి ఉన్న పొరను రిలాక్స్ చేయడానికి సహాయపడుతుంది, నడుము, పెల్విస్ శిశువుకు జన్మనివ్వడానికి సిద్ధ మౌతుంది. దీని ఫలితంగా, కొంతమంది స్త్రీల నడుము, పక్కటెముకలు వెడల్పుగా ఐ, వైద్య పరమైన శ్రద్ధ ఖచ్చితంగా అవసరమౌతుంది. గైనకాలజిస్ట్ సలహా మేరకు కొన్నిసార్లు ఎల్లపుడూ సరైన బెల్లీ బెల్ట్ ధరించవలసి ఉంటుంది. దీనితోపాటు సరైన ఆహరం, వ్యాయామం వల్ల సమస్యలను అధికమించడానికి సహాయకారిగా ఉంటుంది.

ప్రసవం తర్వాత పొట్టకు బెల్ట్ వేసుకోవడానికి కారణాలు

సి-సెక్షన్ నుండి త్వరగా కోలుకోవడం

పొత్తికడుపు బెల్ట్ లు పొత్తికడుపు కింది భాగంలో ఉండే కండరాలు సామర్ధ్యాన్ని కలిగి ఉండేట్లు చేస్తాయి. ఇది గాతుపడిన భాగం చుట్టూ ఆధారంగా సి-సెక్షన్ నుండి త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది, ప్రత్యేకంగా శరీరం దాదాపు నిస్సత్తువగా ఉండే కాన్పు తరువాత మొదటి ఆరు నుండి ఎనిమిది వారాల సమయంలో చాలా సహాయకారిగా ఉంటుంది.

ప్రసవం తర్వాత పొట్టకు బెల్ట్ వేసుకోవడానికి కారణాలు

పిల్లలకు పాలివ్వడానికి తేలికగా ఉంటుంది

చాలామంది కొత్తగా తల్లులైనవారు విపరీతమైన వెన్ను నొప్పి వల్ల పిల్లలకు పాలుకూడా సరిగా ఇవ్వలేకపోతున్నారని అధ్యయనాలు చెప్తున్నాయి. అంతేకాకుండా కాన్పు తరువాత సరిగా కూర్చోవడం కూడా కష్టంగా ఉంటుందని చెప్తున్నారు. అందువల్ల ఈ పొత్తికడుపు బెల్ట్ లు పొత్తికడుపుకు, వెన్నుకు ఆధారంగా ఉండి, పిల్లలకు పాలు ఇవ్వడానికి, సరైన రీతిలో కూర్చోవడానికి సహాయపడుతున్నాయి.

English summary

Reasons To Wear A Belly Belt After Pregnancy

Becoming a mother is a great feeling. But does a mother get back her pre-pregnancy figure after delivery? Some mothers work towards it and yet others take it lightly. During pregnancy, the expanding abdominal area causes the muscles to stretch that often leads to low back pain.
Desktop Bottom Promotion