For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేసవి కాలంలో గర్భిణీ స్త్రీలు తీసుకోవల్సిన అతి ముఖ్యమైన జాగ్రత్తలు

|

వేసవికాలంలో గర్భంతో ఉన్నవారికి కొంచెం ఇబ్బంది కరంగా ఉంటుంది. ఎందుకంటే శరీరంలో హార్మోనుల్లో అనేక మార్పులు మరియు ఈస్ట్రోజెన్ ఎక్కువగా పెరగడం వల్ల వేసవి కాలం మరింత ఇబ్బంది కరంగా ఉంటుంది . అదే సమయంలో మన ఇంట్లో ఉండే హెయిర్ కండీషనర్ ఎంత ఎక్కువ ఉంటుందో కూడా మనకు తెలియదు, అయినా కూడా వాతావరణం చాలా హాట్ గా ఉంటుంది. వేసవి కాలంలో కంటే శీతాకాలంలో గర్భం పొందడం చాలా ప్రశాతంగా ఉంటుంది. కాబట్టి, వేసవికాలంలో గర్బం పొందిన వారు తప్పనిసరిగా కొన్ని సమ్మర్ టిప్స్ ను తప్పనిసరిగా అనుసరించాల్సి ఉంటుంది.

వేసవి కాలంలో ఏపనిచేయాలన్నా చిరాకు పెడుతుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, తల్లి బరువుతో పాటు కడుపులో పెరిగే బిడ్డ బరువును కూడా తల్లి మోస్తుండటంతో కొంచెం ఇబ్బందికరంగా భావించడం, హార్మోనుల మార్పలతో శరీరంలో వేడి ఆవిర్లు, వంటివి మరింత ఇబ్బంది కలిగిస్తాయి. సాధారణంగా మహిళలు గర్బం పొందిన తర్వాత వారిలో సాధరణంగా కంటే బాసల్ టెంపరేచర్ మరింత ఎక్కువగా ఉంటుంది . కాబట్టి, ఈ బాల్ టెంపరేచర్ కు వాతవరణం వేడి కూడా జత అయితే ఇక ఆ పరిస్థితి వివరించడానికి కూడా వీలులేకున్నంత ఇబ్బంది కరంగా మరియు అసౌకర్యంగా ఉంటుంది.

అయితే వేసవికాలంలో ఎక్కువగా స్విమ్మింగ్ పూల్ లో గడపడం మరియు చలికాలంలో లాగా మందంగా ఉన్న దుస్తులు దరించడం మరియు స్వెటర్లు, స్కార్ఫుల్ వంటి వాటితో కూడా చాలా ఇబ్బంది కరంగా ఉంటుంది. ముఖ్యంగా వేసవి కాలంలో , గర్భిణీలు, సౌకర్యవంతమైన వదులుగా ఉండే దుస్తులను మాత్రమే ధరించాలి. అలాగే చాలా తేలికగా ఉండే ప్రింటెడ్ షిఫాన్ మరియు కాటన్ దుస్తులు మీ అందాన్ని మరింత రిఫ్రెష్ చేస్తుంది. అంతే కాదు వీటితో పాటు గర్భిణీలు స్త్రీలు తీసుకోవల్సిన మరికొన్ని సమ్మర్ టిప్స్ ఈ క్రింది విధంగా....

టీస్ అండ్ టాప్స్:

టీస్ అండ్ టాప్స్:

టీషర్ట్స్ అండ్ టాప్స్ వేసుకొనే వారు వేసవికాలానికి అనుగునంగా ఉండాలి. ముఖ్యంగా లైట్ గా మరియు వదులుగా బ్రీజీగా ఉండాలి . వేసుకొనే మెటీరియల్ కూడా సాఫ్ట్ గా మరియు సౌకర్యవంతంగా ఉండాలి.

లైట్ కలర్ ట్రిక్స్:

లైట్ కలర్ ట్రిక్స్:

ప్రెగ్నెంట్ మహిళ ధరించే దుస్తులు లైట్ కలర్ వై ఉండాలి మరియు ఎందుకంటే డార్క్ కలర్స్ దుస్తులు చాలా త్వరగా హీట్ ను గ్రహిస్తాయి కాబట్టి, లైట్ కలర్ దుస్తులు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి.

కాటన్ లేదా లెనిన్:

కాటన్ లేదా లెనిన్:

వేసవి సీజన్ లో కాటన్ లేదా లెనిన్ చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. ఎందుకంటే ఇవి చెమటను చాలా సులభంగా గ్రహించడమే కాదు, సమ్మర్ హీట్ ను ఎదుర్కోవడానికి సహాయడుతాయి.

ఇండోర్ లో ఉండటం ఉత్తమం:

ఇండోర్ లో ఉండటం ఉత్తమం:

గర్భంతో ఉన్నవారు సాధ్యమైనంత వరకూ ఇంట్లోనే ఉండటానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా వేసవి కాలంలో బయట ఎండలు బారి నుండి తప్పించుకోవాలంటే అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

 ద్రవాలు ఎక్కువగా తీసుకోవాలి:

ద్రవాలు ఎక్కువగా తీసుకోవాలి:

వేసవి కాలంలో శరీరంలో పట్టే చెమటల కారణంగా గర్భిణీ మహిళలు డీహైడ్రేషన్ తప్పించుకోవాలంటే, ఎక్కువగా ద్రవాలు, తాజా జ్యూసులు, నీరు ఎక్కువగా తీసుకోవాలి.

సలహా:

సలహా:

తలతిరిగినట్లు అనిపించడంలో , తేలికగా లేదా తలబరువుగా ఉన్నట్లు భావిస్తుంటే ఎండలో తిరగకుండా ఇంట్లో విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం.

స్విమ్మింగ్ :

స్విమ్మింగ్ :

చాలా ఎక్కువగా వేడిగా భావిస్తుంటే స్విమ్ చేయడం వల్ల శరీరంను కూల్ గా మార్చుకోవచ్చు.

షవర్ ట్రీట్:

షవర్ ట్రీట్:

వేసవి కాలంలో హీట్ ను బీట్ చేయాలంటే తరచూ గోరువెచ్చని నీటితో స్నానం చేయడం మంచి మార్గం. ఇలా చేయడం వల్ల శరీరానికి తగినంత విశ్రాంతి కూడా దొరుకుతుంది.

 ఉప్పు తగ్గించాలి:

ఉప్పు తగ్గించాలి:

గర్భిణీ స్త్రీలలో వాటర్ తగ్గడం వల్ల వచ్చే కాళ్ళ వాపులను తగ్గించుకోవాలంటే ఆహారంలో ఉప్పును తగ్గించాలి.

చిన్న కునుకు తియ్యడం:

చిన్న కునుకు తియ్యడం:

వేసవిలో తరచూ తగినంత విశ్రాంతి తీసుకోకపోతే మరింత అసౌకర్యంగా భావిస్తారు.

 కాళ్ళకు చల్లగా:

కాళ్ళకు చల్లగా:

కాళ్ళకు చల్లగా ఉండేలా సౌకర్యవంతమైన ఫ్లిప్ ఫ్లాప్స్ ధరించాలి. సాండిల్స్ మరియు షులు ధరించకూడదు.

వ్యాయమం:

వ్యాయమం:

వ్యాయామం చేసే సమయంను మార్చుకోవాలి. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వ్యాయామంను చేయాలి. ఎర్లీ మార్నింగ్ మరియు లేట్ ఈవెనింగ్ సమయాల్లో వ్యాయామంను ఎంపిక చేసుకోవాలి.

సన్ స్క్రీన్ :

సన్ స్క్రీన్ :

గర్భధారణ సమయంలో మహిళలు ఇంట్లో ఉన్నా, బయటకు వెళ్ళినా సన్ స్క్రీన్ అప్లై చేయడం ద్వారా సన్ రేస్ ను తప్పించుకోవచ్చు.

సినిమా సమయం:

సినిమా సమయం:

చాలా వేడిగా ఉన్నప్పుడు, విశ్రాంతి తీసుకోవడం మంచిది. ముఖ్యంగా చల్లగా ఎసి ఆన్ చేసి, బోరుకొట్టకుండా, సినిమాలు చూడవచ్చు.

Story first published: Monday, March 16, 2015, 18:17 [IST]
Desktop Bottom Promotion