For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీ స్త్రీలకు కుంకుమపువ్వు వలన కలిగే 6 ఆరోగ్య ప్రయోజనాలు

By Super
|

కుంకుమ పువ్వు మంచి ఔషధ విలువలను కలిగి,ప్రపంచంలో అత్యంత ఖరీదైన స్పైస్ లేదా హెర్బ్ గా ఉంది. దీనిని ఎక్కువగా ఒక వ్యక్తి యొక్క సౌందర్యము మరియు చర్మ టోన్ మెరుగుపర్చడానికి ఉపయోగిస్తారు.

READ MORE: కుంకుమ పువ్వులో మరికొన్ని గొప్పఆరోగ్యప్రయోజనాలు

దీనిలో థియామిన్ మరియు రిబోఫ్లావిన్ వంటి మంచి ఔషధ గుణాలు ఉన్నాయి.కుంకుమ పువ్వును గర్భవతి మహిళ తీసుకుంటే, కొత్తగా జన్మించిన శిశువు యొక్క సౌందర్యము బాగా పెరుగుతుందని చాలా మందికి నమ్మకం. కానీ పరిశోధనలలో అటువంటి లక్షణాలు ఏమి కనపడలేదు. ఇది ఒక అపోహ. అలాగే ఒక శిశువు యొక్క రంగు పూర్తిగా ఆమె/అతడు తల్లిదండ్రుల జన్యువుల ఆధారంగా వస్తుంది.

READ MORE: గర్భిణీ స్త్రీల చర్మ సమస్యలను నివారించే వంటింటి చిట్కాలు

ఇది శిశువు యొక్క సౌందర్యమును మెరుగుపరచడానికి కాకపోయినా,అనేక ప్రయోజనకరమైన లక్షణాలను కలిగి ఉన్నది. ఇక్కడ మేము గర్భిణీ స్త్రీల కోసం కుంకుమపువ్వు యొక్క టాప్ 6 అరోగ్య ప్రయోజనాల గురించి చెప్పుతున్నాం.

కంటి సమస్యలు

కంటి సమస్యలు

కేసరి అని పిలిచే కుంకుమ పువ్వు దృష్టి ఆరోగ్యానికి చాలా మంచిది. పరిశోధకులు గర్భధారణ సమయంలో కుంకుమ పువ్వును తీసుకుంటే దృష్టికి సంబందించిన క్యాటరాక్ట్ మరియు దృష్టి మెరుగుదలలకు సహాయపడుతుందని కనుగొన్నారు.

జీర్ణక్రియ

జీర్ణక్రియ

గర్భిణీ స్త్రీల కోసం ఇది మంచి జీర్ణం మరియు ఆకలి మెరుగుదలకు సహాయం, శరీరంలోని అన్ని భాగాలకు రక్త సరఫరా చేయటానికి సహాయపడుతుంది. ఇది ఒక పొర లేదా ఒక కోటు ఏర్పరుచుకొని జీర్ణశయాంతర ఆమ్లత్వం ఉపశమనానికి సహాయపడుతుంది.

కిడ్నీ మరియు కాలేయం సమస్యలు

కిడ్నీ మరియు కాలేయం సమస్యలు

కేసర్ ఆహ్లాదకరమైన వాసనతో ఆరోగ్యానికి మంచిది మరియు తెలుపు చర్మం టోన్ పొందడానికి సహాయపడుతుంది. ఈ రక్త శుద్ధి పౌడర్ కాలేయం పరిష్కరించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే మూత్రాశయం మరియు అనేక మూత్రపిండాల సమస్యలను పరిష్కరిస్తుంది.

కడుపు నొప్పి

కడుపు నొప్పి

ఇది గర్భిణీ స్త్రీలు పాల ఉత్పత్తి పెంచేందుకు మరియు కడుపు నొప్పి సమస్యల ఉపశమనంనకు సహాయపడుతుంది. దీనిలో ఉండే యాంటీ స్పాస్మోడిక్ ప్రభావం కడుపు నొప్పిని నివారించడంలో కీలక పాత్రను పోషిస్తుంది.

శిశువు యొక్క కదలికలు

శిశువు యొక్క కదలికలు

గర్భవతి అయిన మహిళలకు 5 నెలల తర్వాత మాత్రమే కడుపులో పిల్లల యొక్క కదలికల అనుభూతి కలుగుతుంది. అందువలన 5 నెలల తర్వాత పాలు లేదా ఆహారంలో కేసర్ లేదా కుంకుమ పువ్వు వేసుకుంటే మంచిది. ఇది శరీరంలో వేడిని పెంచుతుంది. గర్భిణి మహిళలు పెద్ద మొత్తంలో దీనిని వాడకూడదు. ఎందుకంటే దీని వలన అనేక దుష్ప్రభావాలు ఉంటాయి.

రక్తపోటు

రక్తపోటు

ఇది ఒక స్త్రీలో రక్త పోటు మరియు మానసిక కల్లోలంను తగ్గించేందుకు పాలలో కుంకుమ పువ్వును 3 లేదా 4 రేకలు మాత్రమే తీసుకోవాలని సలహా ఉంది. కండరాల ఉపశమనానికి ఇది చాలా మంచి వైద్యం. దీనిని పెద్ద మోతాదులో తీసుకుంటే గర్భాశయ ఉద్దీపనకు సహాయపడుతుంది.

English summary

Top 6 Health Benefits Of Saffron For Pregnant Women: Pregnancy tips in Telugu

Top 6 Health Benefits Of Saffron For Pregnant Women: Pregnancy tips in Telugu. A world’s most expensive spice or herb that has good medicinal values is saffron. This is most probably used to improve the fairness and skin tone of a person.
Desktop Bottom Promotion