గర్భిణీలు కోకనట్ వాటర్ తాగడం వల్ల పొందే 10 అద్భుతమైన ప్రయోజనాలు ..!

ఫ్రెష్ గా ఉండే కొబ్బరి నీళ్ళలో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అయితే దీనికి సైంటిఫిక్ కారణాలు లేకపోయినా, గర్భిణీలకు కోకనట్ వాటర్ చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. అయితే కోకనట్ వాటర్ వల్ల పుట్టే బేబీకి పరోక్ష

Posted By:
Subscribe to Boldsky

కొబ్బరి బోండాం సాధారణ వ్యక్తులకు మాత్రమేకాదు, గర్భిణీలకు కూడా ఉత్తమ ప్రయోజనాలను అందిస్తుందంటే మీరు ఆశ్చర్యపడక తప్పదు?అవును, ఎందుకంటే కోకనట్ వాటర్ లో పొటాసియం మరియు ఎలాక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉన్నాయి. మరియు ఇందులో విటమిన్స్, క్యాల్షియం, మరియు మెగ్నీషియం అధికంగా ఉన్నాయి. తాజా పరిశోధనల ప్రకారం ఫ్రెష్ గా ఉండే కొబ్బరినీళ్ళను ఏవిధంగా తీసుకొన్న ఆరోగ్యానికి చాలా లాభం. ముఖ్యంగా ఎముకలను బలోపేతం చేయడానికి, బరువు కంట్రోల్ చేయడానికి, హార్మోన్ ఉత్పత్తికి మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి కొబ్బరి బోండాలోని నీరు చాలా గ్రేట్ గా సహాయపడుతాయి.

కాబట్టి గ్రీన్ కలర్ లో ఉండే కొబ్బరి బోండాంను గర్భిణీలు తప్పని సరిగా తీసుకోవాలని కోరుకుంటున్నారు . ముఖ్యంగా మూడో నెలలో ఉండే గర్భిణీలు కొబ్బరి బోండాం తీసుకోవడం వల్ల ఇది గర్భిణీలోని టాక్సిన్స్ ను బయటకు నెట్టివేస్తుంది. పుట్టబోయే బేబీ క్లియర్ స్కిన్ మరియు జుట్టు మరియు కళ్ళతో పుడుతుంది.

ఫ్రెష్ గా ఉండే కొబ్బరి నీళ్ళలో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అయితే దీనికి సైంటిఫిక్ కారణాలు లేకపోయినా, గర్భిణీలకు కోకనట్ వాటర్ చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. అయితే కోకనట్ వాటర్ వల్ల పుట్టే బేబీకి పరోక్షంగా సహాయపడుతుందని కొన్ని ట్రెడిషినల్ అడ్వైజెస్ ద్వారా నిర్ధారించబడినది...మరి పరోక్షంగా గర్భిణీలకు ఏవిధంగా ఉపయోగపడుతుందో చూద్దాం...

ఆరోగ్యానికి మంచిది:

కోకనట్ వాటర్లో ఫ్యాట్ ఉండదు, క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల గర్భిణీలకు చాలా మేలు చేస్తుంది. గర్భిణీలు ఓవర్ వెయిట్ పెరగకుండా కంట్రోల్ చేస్తుంది. కోకనట్ వాటర్ తాగడం వల్ల తల్లి, బిడ్డ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. షుగర్ డ్రింక్స్ , జ్యూసులు ఫర్ఫెక్ట్ ఆల్టర్నేటివ్ డ్రింక్ .

ఎలక్ట్రోలైట్స్ ను అందిస్తుంది:

కొబ్బరి బోండాలంలో ఉండే ఎలక్ట్రోలైట్స్, క్యాల్షియం, క్లోరైడ్, పొటాషియం, మెగ్నీషియం, సోడియం మరియు రిబోఫ్లెవనాయిడ్స్ మరియు నేచురల్ ఐసోటోనిక్ మినిరల్ కలిగి ఉంటాయి. గర్బిణీలు చాలా త్వరగా డీహైడ్రేషన్ కు గురి అవుతుంటారు. మరియు చాలా తర్వగా బలహీనపడుతుంటారు. అలాంటి వారు కొబ్బరి బోండాం త్రాగితే తక్షణ ఎనర్జీ పొందవచ్చు. మరియు డీహైడ్రేషన్ వల్ల ఎదుర్కొనే సమస్యలు తలనొప్పి, క్రాంప్స్, ఎడిమా, మరియు కాంట్రాక్షన్ వంటివి నివారించి స్టామినా అందివ్వడానికి సహాయపడుతాయి.

నేచురల్ డ్యూరియాటిక్ :

ఈ విషయంలో ఎలాంటి నిర్ధారణలు లేవు. అయితే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ను నివారించే గుణాలు కోకోనట్ వాటర్ లో పుష్కలంగా ఉన్నాయని చాలా మంది నమ్ముతారు.కోకనట్ వాటర్ లో ఉండే న్యూట్రీషియన్స్ శరీరంలో టాక్సిన్స్ తొలగించడానికి సహాయపడుతుంది.

హార్ట్ బర్న్ మరియు కాన్స్టిపేషన్ తగ్గిస్తుంది:

గర్భధారణ సమయంలో హార్మోనుల్లో మార్పులు సహజం. హార్మోనుల మార్పుల వల్ల మలబద్దకం, హార్ట్ బర్న్ , అజీర్తి సమస్యలను నివారించుకోవచ్చు . కోకనట్ వాటర్లో ఉండే డైటరీ ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మలబ్దకం నివారిస్తుంది. మెటబాలిజం రేటును మెరుగుపరుస్తుంది, అసిడిక్ లెవల్స్ ను పెంచుతుంది, హార్ట్ బర్న్ నివారిస్తుంది.

ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తుంది:

కొబ్బరి నీళ్ళలో యాంటీ వైరల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . గర్భిణీ స్త్రీలు వివిధ రకాల ఇన్ఫెక్షన్స్ కు గురి అవుతుంటారు. ఈ ఇన్ఫెక్షన్స్ నివారించడంలో కోకొనట్ వాటర్ గ్రేట్ గా సమాయపడుతుంది.

హార్ట్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది:

కోకనట్ వాటర్లో పొటాషియం, మెగ్నీషియం, ల్యూరిక్ యాసిడ్స్ అధికంగా ఉండటం వల్ల శరీరంలో బ్లడ్ ప్రెజర్ లెవల్స్ క్రమబద్దం అవుతుంది, అలాగే మంచి కొలెస్ట్రాల్ ను మెరుగుపరుస్తుంది. చెడుకొలస్ట్రాల్ ను తగ్గిస్తుంది. కోకనట్ వాటర్లో ఉండే విటమిన్స్, ఎసెన్షియల్ ప్రోటీన్స్, శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ ను మెరుగుపరుస్తుంది, దాంతో హార్ట్ హెల్తీగా ఉంటుంది.

షుగర్ కంటెంట్ తగ్గిస్తుంది:

కోకనట్ వాటర్లో షుగర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. కాబట్టి, గర్భిణీ మహిళల్లో జస్టేషన్ డయాబెటిస్ సమస్య ఉండదు .

ఎనర్జీ అందిస్తుంది:

కోకనట్ వాటర్ తాగడం వల్ల గర్భిణీలో ఇన్ స్టాంట్ ఎనర్జీ పెరుగుతుంది. గర్భిణీలు తరచూ అలసట, నీరసంతో బాధపడుతుంటారు కాబట్టి, ఇన్ స్టాంట్ ఎనర్జీని అందించి, గర్భిణీల్లో అలసటను తగ్గిస్తుంది . కోకనట్ వాటర్ శరీరానికి అవసరమయ్యే హైడ్రేషన్ అందివ్వడంతో స్కిన్ ఎలాసిటి పెరుగుతుంది. దాంతో స్ట్రెచ్ మార్క్ నివారించబడుతాయి.

ఫీటస్ పెరుగుదలకు సహాయపడుతుంది:

కోకనట్ వాటర్లో ఎసెన్సియల్ న్యూట్రీషియన్స్ ఉండటం వల్ల ఇవి తల్లి బిడ్డకు సురక్షితం, బిడ్డకు తగిన పోషణ అందివ్వడంతో పీటస్ హెల్తీగా పెరుగుతుంది.

ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్స్ ను మెరుగుపరుస్తుంది:

కోకనట్ వాటర్ లో ఉండే ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్స్ ను మెరుగుపరచడంతో ఫీటస్ గ్రోత్ ను మెరుగుపరుస్తుంది. గర్భిణీ స్త్రీలు మూడవ థ్రైమాసికం నుండి కోకనట్ వాటర్ తాగడం సురక్షితం.

English summary

10 Benefits Of Coconut Water For Pregnant Women

Natural ingredients are generally considered good for human health. Coconut water is one such natural fluid which has several such benefits, and it is a far better alternative to sweetened drinks. But, is coconut water equally good for pregnant women as it is generally for normal people?
Please Wait while comments are loading...
Subscribe Newsletter