For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీ స్త్రీలు ఒక్క అరటిపండు తినడం వల్ల పొందే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్..!!

By Super Admin
|

స్త్రీ మొదటి సారి గర్బం పొందితే ఆమె ఆనందో అంతా ఇంతా కాదు. ఆమె జీవితంలో ఒది ఒక కొత్త అనుభూతిని తీసుకొస్తుంది. నేచర్ లో జరిగే అద్భుతమైన మార్పుల్లో మహిళ గర్భం పొందడం. గర్భం పొందిన తర్వాత గర్భిణీ శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. కడుపులో బిడ్డ పెరిగే కొద్ది హార్మోనుల ప్రభావం వల్ల అనేక మార్పులు జరగుతుంటాయి. హార్మోనుల మార్పుల వల్ల గర్భిణీ స్త్రీలలో మానసికంగా, శరీరకంగా కూడా మార్పులు జరగుతాయి. వీటిని ఎదుర్కోవాలంటే గర్భిణి సరైన పౌష్టికాహారంను తీసుకోవాలి. డైట్ తో పాటు రెగ్యులర్ వ్యాయామం కూడా చాలా అవసరం.

గర్భిణీ స్త్రీలు తీసుకునే డైట్ లో ఫ్రూట్ మరియు వెజిటేబుల్స్ కు ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే ఈ నేచురల్ ఫుడ్స్ బేబీ నేచురల్ గా పెరగడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. గర్బిణీ స్త్రీలో తీసుకునే హెల్తీ ఫ్రెడ్స్ లో అరటి పండు ఒకటి . అయితే గర్భధారణ సమయంలో అరటిపండ్లు తినడం సురక్షితమేనా అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. అరటి పండ్లు కడుపులో ఉన్న బేబీగ్రోత్ కు ఏవిధంగా సహాయపడుతుందో తెలుసుకుంటే ఆశ్చర్యం కలగకతప్పదు.

అరటి పండులో క్యాల్షియం, పొటాషియం, ఇతర న్యూట్రీషియన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎలాంటి భయాలు లేకుండా గర్భిణీలు అరటిపండ్లను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవచ్చు. డైట్ లో చేర్చుకోవడానికి ముందు గర్భిణీలు స్త్రీలు అరటి పండ్లు తినడం వల్ల తల్లి బిడ్డకు ఏవిధంగా సహాయపడుతుందో తెలుసుకుందాం..అద్భుతమైన రుచి కలిగిన ఫ్రూట్ లోని అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం...

1. ఫోలిక్ యాసిడ్ ఎక్కువ :

1. ఫోలిక్ యాసిడ్ ఎక్కువ :

కడుపులో పెరిగే బిడ్డకు బ్రెయిన్,, నాడీవ్యవస్థ, వెన్నెముక ఏర్పడటానికి ఫోలిక్ యాసిడ్ చాలా అవసరం. కాబట్టి, అరటిపండును రెగ్యులర్ గా తీసుకోవడం మంచిది, అలాగే పోలిక్ యాసిడ్ లోపిస్తే ప్రీమెచ్యుర్ బర్త్ లేదా పిల్లలు సార్థ్యం లేకుండా పుడుతారు. కాబట్టి, రెగ్యులర్ గా ఒక అరటి పండు తినడం వల్ల బేబి హెల్త్ కు చాలా మంచిది

2. అనీమియా తగ్గిస్తుంది :

2. అనీమియా తగ్గిస్తుంది :

మహిళ గర్భం పొందిన తర్వాత ఎదుర్కొనే సమస్యల్లో అనీమియా ఒకటి, రక్తహీనత వల్ల ప్రవసం సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. కాబట్టి, ఈ సమస్యను నివారించుకోవడానికి గర్భం పొందినప్పటి నుండే గర్భిణీల రెగ్యులర్ డైట్ లో అరటిపండ్లు తప్పనిసరిగా చేర్చుకోవాలి, అరటిపండ్లలో ఐరన్ ఎక్కువుగా ఉంటుంది. కాబట్టి, ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ అరటిపండు తినడం చాలా అవసరం. దీని వల్ల శరీరంలో హీమోగ్లోబిన్ పెరుగుతుంది, రక్తహీనత సమస్య ఉండదు.

3. మలబద్దకం నివారిస్తుంది :

3. మలబద్దకం నివారిస్తుంది :

గర్భధారణ సమయంలో ప్రతి స్త్రీ ఎదుర్కొనే సాధారణ సమస్య మలబద్దకం, గ్యాస్ట్రో ఇన్ టెన్సినల్ సమస్యలను ఎదుర్కొనే వారు అరటి పండుతినడం వల్ల మలబద్దకం, కడుపుబ్బరం నివారించి, బౌల్ మూమెంట్ స్మూత్ గా జరిగేందుకు సహాయపడుతుంది . ఎలాంటి సప్లిమెంట్ ఉపయోగించకుండా అరటిపండ్లను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం మంచిది. అరటిపండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది బౌల్ మూమెంట్ ను స్మూత్ గా చేస్తుంది.

4.క్యాల్షియం ఎక్కువ:

4.క్యాల్షియం ఎక్కువ:

పిల్లల్లోనే కాదు పెద్దవారిలో కూడా బోన్స్ మరియు స్కెలిటెన్ సిప్టమ్ ఆరోగ్యంగా ఏర్పడుటకు క్యాల్షియం చాలా అవసరమవుతుంది. అందుకు అరటిపండ్లు గ్రేట్ గా సహాయపడుతాయి. అరటి పండ్లలో క్యాల్షియం అధికంగా ఉంటుంది. పుట్టే బిడ్డలో హెల్తీ బోన్ అండ్ టీత్ డెవలప్ మెంట్ కు గ్రేట్ గా సహాయపడుతుంది.

5. బ్లడ్ సెల్స్ గ్రోత్ కు సహాయపడుతుంది:

5. బ్లడ్ సెల్స్ గ్రోత్ కు సహాయపడుతుంది:

గర్భధారణ సమయంలో అరటిపండ్లు తినడం వల్ల తల్లి బిడ్డకు అవసరమయ్యే విటమిన్ బి6 పుష్కలంగా అందుతుంది. విటమిన్ బి6 న్యూట్రో ట్రాన్స్ మీటర్ గా పనిచేస్తుంది, ఇది రెడ్ బ్లడ్ సెల్స్ ఏర్పడుటకు సహాయపడుతుంది .

6. గ్రేట్ యాంటీఆక్సిడెంట్:

6. గ్రేట్ యాంటీఆక్సిడెంట్:

అరటిపండ్లలో విటిమన్ సి కూడా పుష్కలంగా ఉంది. ఇది ఒక మంచి యాంటీఆక్సిడెంట్ . ఏజింగ్ ప్రొసెస్ తో పోరాడుతుంది. అదనంగా తల్లిబిడ్డలో వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది.

7. బాడీ బిల్డ్ కోసం ప్రోటీనులు :

7. బాడీ బిల్డ్ కోసం ప్రోటీనులు :

అరటిపండ్లలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. వెజిటేరియన్స్ రెగ్యులర్ డైట్ లో అరటిపండ్లు చేర్చుకోవడం వల్ల ప్రోటీనులను ఎక్కువగా పొందవచ్చు. వీటితోపాటు శెనగలు, త్రుణధాన్యాలు కూడా తీసుకోవచ్చు. అరటిపండ్లు ప్రీఎక్సర్ సైజ్ స్నాక్ గా తీసుకోవచ్చు .

8. వికారం తగ్గిస్తుంది :

8. వికారం తగ్గిస్తుంది :

ఉదయం నిద్రలేవగానే వాంతులు, వికారంగా అనిపించడం సహజం? చాలా మంది గర్భిణీ స్త్రీలలో ఇది సహజం. ఈ సమస్యను ఎక్కువగా మొదటి త్రైమాసికంలో చూస్తుంటారు. కాబట్టి, గర్భం పొందిన ప్రారంభ దశలో అరటిపండ్లు తినడం వల్ల మార్నింగ్ సిక్నెస్ లేదా వికారం తగ్గిస్తుంది.

9. బ్లడ్ ప్రెజర్ ను క్రమబద్దం చేస్తుంది:

9. బ్లడ్ ప్రెజర్ ను క్రమబద్దం చేస్తుంది:

గర్భినీలు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యల్లో బ్లడ్ ప్రెజ్ ఒకటి. బ్లడ్ ప్రెజర్ ను నార్మల్ గా మెయింటైన్ చేయడానికి హెల్తీ డైట్ లో తప్పనిసరిగా అరటిపండ్లు చేర్చుకోవాలి. దాంతో ఆందోళనలు, టెన్షన్స్ తగ్గించుకోవచ్చు. అరటిపండ్లలో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల ఇది బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్లో ఉంచుతుంది. అలాగే పొటాషియం మజిల్ క్రాంప్స్, లెగ్ పెయిన్స్ తగ్గిస్తుంది.

10. ఎనర్జీ బూస్టర్ :

10. ఎనర్జీ బూస్టర్ :

అరటిపండ్లు ఇన్ స్టాంట్ ఎనర్జీని అందిస్తాయి !అరటిపండును పాలతో మిక్స్ చేసి మిల్క్ షేక్ గా తీసుకోవడం వల్ల ఫుల్ మీల్ తిన్నంత అనుభూతి చెందుతారు. అందువల్ల గర్భిణీ స్త్రీలకు ఇది ఖచ్చితంగా అవసరం. తక్షణ ఎనర్జీని అందివ్వడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

11. ఆకలి, ఫుడ్స్ మీద కోరికలు తగ్గిస్తుంది:

11. ఆకలి, ఫుడ్స్ మీద కోరికలు తగ్గిస్తుంది:

అరటిపండ్లలో కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి! కాబట్టి, ఒక్క అరటిపండు తినగానే పొట్ట నిండిన అనుభూతి కలుగుతుంది. భోజనానికి మరో భోజనానికి మద్య తీసుకోవడం వల్ల ఆకలి ఎక్కువ అనిపించదు, హెల్తీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడానికి సహాయపడుతుంది.

12. బ్లడ్ షుగర్ మరియు కొలెస్ట్రాల్ లెవల్స్ ను మెయింటైన్ చేస్తుంది :

12. బ్లడ్ షుగర్ మరియు కొలెస్ట్రాల్ లెవల్స్ ను మెయింటైన్ చేస్తుంది :

గర్భధారణ సమయంలో బ్లడ్ షుగర్ మరియు కొలెస్ట్రాల్ లెవల్స్ ను మెయింటైన్ చేయడం చాలా అవసరం. ప్రెగ్నెన్సీ డయాబెటిస్ ను నివారించడంలో అరటిపండ్లు గ్రేట్ గా సహాయపడుతాయి.

13. నేచురల్ స్ట్రెస్ బూస్టర్ :

13. నేచురల్ స్ట్రెస్ బూస్టర్ :

అరటి పండు నేచురల్ స్ట్రెస్ బూస్టర్ అని చాలా మందికి తెలియదు. మీ రెగ్యులర్ డైట్ లో అరటిపండు చేర్చుకోవడం వల్ల ఆందోళన మరియు స్ట్రెస్ తగ్గించుకోవచ్చు . గర్భధారణ సమయంలో మూడ్ స్వింగ్స్ మరియు స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఒక్క అరటిపండును రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి!

14. బ్రెస్ట్ ఫీడిగ్ మదర్స్ కు చాలా మంచిది:

14. బ్రెస్ట్ ఫీడిగ్ మదర్స్ కు చాలా మంచిది:

బేబీ హెల్త్ కు మదర్స్ మిల్క్ చాలా అవసరం. తల్లిపాల వల్ల బేబీలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతంది. దాంతో బేబీ వివిధ రకాల ఇన్ఫెక్షన్స్ ఎదుర్కోగలుగుతారు. అంతే కాదు, మదర్స్ మిల్క్ లో వివిధ రకాల న్యూట్రీషియన్స్ ఉన్నాయి. ఇవి బిడ్డకు చాలా అవసరం. బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ అరటిపండ్లు తీసుకోవడం చాలా మంచిది. ఇది ఇన్ స్టాంట్ ఎనర్జీని అందిస్తుంది .

English summary

14 Health Benefits Of Banana During Pregnancy

Fruits and veggies naturally aid in the healthy growth of the fetus. Banana is one such fruit women should consider. You might still be doubtful about taking banana during pregnancy. You would be wondering if the fruit would really be good for your baby. Is banana good during pregnancy, you ask. Relax and read on, we say!
Desktop Bottom Promotion