For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొన్ని జాగ్రత్తలతో ప్రెగ్నెన్సీ సమయంలో వెన్నునొప్పికి గుడ్ బై

By Swathi
|

ప్రెగ్నెన్సీ సమయంలో వెన్ను నొప్పి చాలా సాధారణం. కానీ ఓర్చుకోవాల్సిన అవసరం లేదు. కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. పొట్ట ముందుకు సాగడం, హార్మోల్స్ లో మార్పుల కారణంగా.. వెన్నుపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల వెన్నునొప్పి సమస్య గర్భిణీగా ఉన్నప్పుడు ఎక్కువగా ఉంటుంది. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్కువగా ఇబ్బందికి గురిచేసే ఈ వెన్ను నొప్పి నివారించడానికి కొన్ని పద్ధతులున్నాయి. వెన్నునొప్పిని కూల్ గా ఎలా డీల్ చేయాలో ఇప్పుడు చూద్దాం..

గర్భిణీ స్త్రీలు తక్షణ ఎనర్జీ పొందడానికి కొన్ని నేచురల్ మార్గాలు

backache during pregnancy

ప్రెగ్నెన్సీ సమయంలో బ్యాక్ పెయిన్ నివారించడానికి మీరు ఎంచుకునే భంగిమ చాలా ముఖ్యమైనది. ఏ సమయంలో ఎలా ఉండాలో జాగ్రత్తపడితే.. వెన్నునొప్పి రాకుండా నివారించడం సాధ్యమవుతుంది. కూర్చున్నప్పుడు పాదాలు నేలపై మోపాలి. అవసరమైతే స్టూల్ పెట్టుకోవాలి. హిప్స్, నడుము మీ చెయిర్ వెనక భాగానికి ఆనుకోవాలి. అయితే ఎక్కువ సేపు కూర్చోకపోవడం మంచిది.
లేదా గంటకొకసారి లేచి తిరుగుతూ ఉండాలి.

పొట్టలో బేబీ గురించి ఎట్రాక్టివ్ ఫ్యాక్ట్స్ ?

నిలబడినప్పుడు వెన్నుభాగం, భుజాలు స్ర్టెయిట్ గా ఉండాలి. ఎక్కువ సమయం నిలబడకూడదు. 30 నుంచి 40 నిమిషాల కొకసారి రెస్ట్ తీసుకోవాలి. నడిచేటప్పుడు కూడా ఈ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
అలాగే నడిచేటప్పుడు నెమ్మదిగా అడుగులు వేయాలి. నిద్రపోయేటప్పుడు మీ బెల్లీ సాగడం మొదలుపెట్టాక ఎడమ వైపు తిరిగి పడుకోవడం మంచిది. దీనివల్ల రక్తప్రసరణ సజావుగా సాగుతుంది. బెల్లీ కింద పిల్లో పెట్టుకున్నా మంచిది.
అలాగే చెప్పుల విషయంలో కూడా జాగ్రత్త వహించకపోతే.. ప్రెగ్నెన్సీ సమయంలో వెన్నునొప్పికి దారితీస్తుంది. హీల్స్ కి దూరంగా ఉండాలి. షూస్ కంటే.. ఫ్లాట్ చెప్పులు ఎంచుకోవడం మంచిది.

backache during pregnancy

ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్కువ బరువు ఎత్తకూడదు. దీనివల్ల వెన్నుపై ఒత్తిడి పెరిగి నొప్పి వస్తుంది. నేలపై నుంచి ఏదైనా వస్తువులు పైకి తీసుకోవాల్సి వచ్చినప్పుడు నడుముపై బరువు పడకుండా జాగ్రత్తపడాలి. ఒక వేళ వెన్ను నొప్పి తీవ్రంగా వేధిస్తుంటే.. ఎవరితోనైనా వెన్నుభాగంలో మసాజ్ చేయించుకుంటే ఫలితం ఉంటుంది. అలా కూడా తగ్గకపోతే.. వేడినీళ్ల కాపడం పెట్టుకోవడం మంచిది. దీనివల్ల త్వరగా ఉపశమనం లభిస్తుంది. ఇలా ప్రెగ్నెన్సీ సమయంలో ప్రతి పనిలోనూ జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే కూర్చున్నా, నిలబడినా.. నడిచినా సరైన భంగిమ ఎంచుకుంటేనే.. బ్యాక్ పెయిన్ నివారించడం సాధ్యమవుతుంది.

English summary

5 ways to deal with back ache during pregnancy

5 ways to deal with back ache during pregnancy. Back pain during pregnancy is common. But you don’t have to endure it if you are a bit careful about yourself.
Desktop Bottom Promotion