For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీలు సురక్షితంగా నిద్రించడానికి 7 మార్గాలు..

|

సాధారణంగా మహిళలు గర్భం పొందిన తర్వాత హెల్తీ డైట్ మరియు గర్భధారణ సమయంలో వ్యాయామం కోసం ఎక్కువ ప్రాధాన్యత గురించి మీకు చాలా మంది చెబుతుంటారు. అయితే ఎలా నిద్రపోవాలనేది మాత్రం చెప్పరు. 9నెలలు గడిచే వరకూ ఒక్కో త్రైమాసికంలో శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటుంది. గర్భాధారణ సమయంలో మహిళలు తీసుకొనే ఆహారం, వ్యాయమంతో పాటు నిద్రపోవడం కూడా ఒక ముక్యమైన అవసరంగా తెలుసుకోవాలి. గర్భధారణ సమయంలో పొట్ట పెరిగే కొద్ది పడుకొనే భంగిమలో మార్పులు చేసుకోవల్సి ఉంటుంది.

చాలా మంది గర్భిణీ స్త్రీలు గర్భాధారణ సమయంలో సరిగా నిద్రపట్టడం లేదని, ఆందోళనగా ఉందని, నిద్రలేమితో బాధపడుతున్నట్లు ఫిర్యాదు చేస్తుంటారు. అయితే మరికొంత మంది మాత్రం చాలా త్వరగా నిద్రపడుతుందని చెబుతుంటారు. అయితే ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవల్సిన విషయం ఏంటంటే, అతిగా నిద్రపోవడం లేదా నిద్రలేమితో ఉండటం వల్ల గర్భిణీ స్త్రీకి మాత్రమే కాదు, కడుపులో పెరిగే బిడ్డ మీద కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి, మీ శరీరం సౌకర్యంగా ఉంచుకోవడానికి, మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవడానికి తగినంత నిద్రను పొందాలి.

గర్భధారణ సమయంలో మహిళలో మంచిగా సరిపడా నిద్రపొందడాినిక ఇక్కడ కొన్ని మార్గాలున్నాయి...

కాఫీ త్రాగడం తగ్గించాలి:

కాఫీ త్రాగడం తగ్గించాలి:

గర్భధారణ సమయంలో ఎక్కువగా కాఫీని తీసుకోవడం వల్ల నిద్రలేమికి దారితీస్తుంది. అంతే కాకుండా, గర్భధారణ సమయంలో ఎక్కువగా కాఫీని తీసుకోవడం వల్ల కాఫీలో ఉండే కెఫిన్ వల్ల బిడ్డ పుట్టుకలో లోపాలు లేదా గర్భస్రావం జరిగే ప్రమాదం ఉందని కొన్ని పరిశోధనల ద్వారా నిరూపించబడినది. అందువల్ల మీరు కాఫీ త్రాగలేకుండా ఉండలేకపోతున్నట్లైతే, ఒక రోజుకు రెండు కప్పులకు మించి తీసుకోకుండా జాగ్రత్త పడాలి. ఇదే విషయం టీ తీసుకొనే వారికి కూడా వర్థిస్తుంది.

 రోజులో వీలు దొరికనప్పుడల్లా చిన్న పాటి కునుకు తీయాలి:

రోజులో వీలు దొరికనప్పుడల్లా చిన్న పాటి కునుకు తీయాలి:

గర్భధారణ సమయంలో అలసటనేది సహజం. గర్భంలో పిండం పెరగడానికి జీవక్రియలు క్రమంగా పనిచేయడానికి తగినంత విశ్రాంతి పొందడం చాలా అవసరం. అలసట ఎక్కువైనప్పుడు, మీరు నిద్రపొందడానికి మరింత అసౌకర్యంగా మార్చతుంది. ఈ సమస్య నుండి బయపడాలంటే, రోజులో అప్పుడప్పుడు, చిన్న కునుకు తీయాలి.దీని వల్ల రెండు ప్రయోజనాలున్నాయి, ఎఫెక్టివ్ గా అలసటను తగ్గిస్తుంది మరియు మీ శరీరానికి అవసరమైన నిద్రను పొందడానికి తగిన విధంగా శరీరంను సిద్దం చేస్తుంది. బోభజనం తర్వాత కనీసం 15నిముషాల కునుకు తీసుకోవడం వల్ల గొప్పగా సహాయపడుతుంది. గర్భధారణ సమయంలో సరిగా నిద్రపొందడానికి మరియు ప్రతి రోజూ సమయానికి నిద్రపోవాలి. కొంచెం లేటుగా లేచినా పర్వాలేదు అనుకోవాలి. మీ నిద్రకు భంగం కలగకుండా మీ ఇంట్లో వారి సహాయం తీసుకోండి.

నిద్రించే ముందు ఎక్కువగా బోజనం చేయకూడదు:

నిద్రించే ముందు ఎక్కువగా బోజనం చేయకూడదు:

గర్భధారణ సమయంలో మలబద్దకం, కడుపు ఉబ్బరం, గుండెలో మంట వంటి సమస్యలు ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీని బాధిస్తూ ఉంటుంది. రాత్రుల్లో నిద్రాభంగం కలిగిస్తుంటుంది. తిన్న ఆహారాలు సరిగా జీర్ణం కాకుండా అసౌకర్య కలిగిస్తూ నిద్రపట్టకుండా చేస్తుంది. కాబట్టి, హార్ట్ బర్న్ మరియు అజీర్ణ సమస్యను నివారించడానికి ఉత్తమం మార్గం రాత్రి నిద్రించడానికి ముందు ఎక్కువగా ఆహారాన్ని తీసుకోకుండా ఉండటమే. అలాగే నిద్రించడానికి కనీసం రెండు గంటల ముందుగానే భోజనం చేయాలి. ఇలా చేస్తే నిద్రకు ఎటువంటి అంతరాయం ఉండదు.

శరీరాన్ని ఎప్పుడూ తేమగా ఉంచుకోవాలి:

శరీరాన్ని ఎప్పుడూ తేమగా ఉంచుకోవాలి:

శరీరంలో జీవక్రియలు వేగంగా జరగాలన్నా, శరీరంలోని వ్యర్థాలను బయటకు నెట్టివేయాలన్నా తగినన్ని నీరు తీసుకోవడం చాలా అవసరం. నీళ్ళు శరీరానికి ప్రశాతంతను చేకూర్చుతుంది మరియు విశ్రాంతి పరుస్తుంది. గర్భధారణ సమయంలో నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల మరికొన్ని ముఖ్యమైన కారణాలు కూడా ఉన్నాయి.

నిద్రించేప్పుడు సరైన భంగిమలో పడుకోవాలి:

నిద్రించేప్పుడు సరైన భంగిమలో పడుకోవాలి:

గర్భధారణ సమయంలో నిద్రభంగం కావడానికి అనేక కారణాలు ఉండవచ్చు., అందులో శారీరక అసౌకర్యం కూడా ఒకటి కావచ్చు . గర్భధారణ కాలంలో పొట్ట ముందుకు పెరగడం, కాళ్ళు, పాదాలు వాపులు రావడం వల్ల అసౌకర్యం కలుగుతుంది . ఒక వేళ మీరు ఎడీమాతో బాధపుడుతున్నా, నీరు వల్ల పాదాల్లో వాపు వచ్చిని నిద్రించేప్పుడు, పాదాల క్రింద ఒక ఎత్తైన దిండును వేసుకోవాలి. ఇది సౌకర్యవంతంగా మరియు విశ్రాంతిగా ఉంటుంది. గర్భధారణ సమయంలో ఎడమవైపుకు తిరిగి పడుకోవాలి. అలాగే పొట్ట మరీ పెద్దగా ఉన్నప్పుడు కాళ్ళ మద్యన మరో దిండు అమర్చుకొని ఎడమవైపుకు తిరిగి పడుకోవాలి. ఇలా చేయడం వల్ల అసౌకర్యంగా ఉండదు. ఇలా చేయడం వల్ల శరీరానికి రక్తప్రసరణ బాగా జరగుతుంది.

 ఒత్తిడిని తగ్గించుకోవాలి:

ఒత్తిడిని తగ్గించుకోవాలి:

గర్భధారణ సమయంలో ఒత్తిడి వివిధ రకాలుగా ప్రభావాలను చూపుతుంది. మరియు నిద్రలేకుండా చేస్తుంది. నిద్రపోయవడానికి ముందు ఒత్తిడిని తగ్గించుకోవాలి. అందుకోసం ఒక మంచి గోరువెచ్చని స్నానం లేదా మసాజ్ వల్ల స్ట్రెస్ ను సాధ్యమైనంతవరకూ తగ్గించుకోవచ్చు . దీని వల్ల రాత్రుల్లో మంచి నిద్ర పొందుతారు. మరియు గర్భధారణ సమయంలో ఒత్తిడిని తగ్గించుకోకపోతే ఆ దుష్ప్రభావం కడుపులో పెరిగే శిశువు మీద కూడా పడుతుంది. కాబట్టి, గర్భిణీలు సాధ్యం అయినంత వరకూ ప్రశాంతంగా ఉండాలి.

రాత్రి పడుకొనే ముందు వ్యాయామం చేయకండి:

రాత్రి పడుకొనే ముందు వ్యాయామం చేయకండి:

గర్భధారణ సమయంలో వ్యాయామం చేయడం మంచిదే అయితే, బెడ్ టైమ్ లో వ్యాయామం చేయడం మంచిది కాదు, మీకు నిద్రపట్టకుండా చేస్తుంది. కాబట్టి, భోజనానికి ముందే లేదా నిద్రించడానికి మూడు నాలుగు గంటల ముందే వ్యాయామం చేయాల్సి ఉంటుంది. నిద్రించడానికి ముందు యోగ చేయడం వల్ల మీకు విశ్రాంతిగా ఉంటుంది మరియు నిద్రబాగా పడుతుంది. ఇది వైద్యనిపుణుల సలహా ప్రకారం చేయాల్సి ఉంటుంది.

English summary

7 ways to sleep well during pregnancy

7 ways to sleep well during pregnancy,While you learn a lot about a healthy diet and importance of exercise during pregnancy, nobody tells you about significance of sleep and its essence during those crucial nine months. However, sleep during pregnancy is as essential as eating right and exercising. Pregnancy
Story first published: Saturday, May 21, 2016, 17:32 [IST]
Desktop Bottom Promotion