గర్భిణీలు లైమ్ జ్యూస్ తాగడం వల్ల పొందే అద్భుత ప్రయోజనాలు..!!

నిమ్మకాయ, నిమ్మరసం ఆరోగ్యపరంగా ఎంతో ఉపయోగకారినో అందరికి తెలిసిన విషయమే. నిమ్మలో ఉండే రిఫ్రెషింగ్ టేస్ట్, ఆరోమా వాసన పొట్టను కూల్ గా మార్చేస్తుంది. ముఖ్యంగా గర్భిణీల్లో మార్నింగ్ సిక్నెస్, వికారం తగ్గి

Posted By:
Subscribe to Boldsky

నిమ్మకాయ, నిమ్మరసం ఆరోగ్యపరంగా ఎంతో ఉపయోగకారినో అందరికి తెలిసిన విషయమే. నిమ్మలో ఉండే రిఫ్రెషింగ్ టేస్ట్, ఆరోమా వాసన పొట్టను కూల్ గా మార్చేస్తుంది. ముఖ్యంగా గర్భిణీల్లో మార్నింగ్ సిక్నెస్, వికారం తగ్గిస్తుంది. లెమన్ హెల్త్ క్రిష్ షో బుక్ ప్రకారం, ఒక తొక్క తియ్యని నిమ్మకాయలో 17 క్యాలరీలు మరియు హైవిటిమన్స్ మరియు మినిరల్స్ నియాసిన్, మెగ్నీషియం, ఫొల్లెట్, విటమిన్ సి, బి6, మరియు రొబోఫ్లోవిన్ లు ఎక్కువగా ఉంటాయి. లైమ్ జ్యూస్ లో అమేజింగ్ న్యూట్రీషియన్ బెనిఫిట్స్ ఉన్నాయి . వీటిలో ఉండే పోషక విలువల వల్ల మార్నింగ్ సిక్నెస్ ను నివారిస్తుంది. గర్భిణీలు లైమ్ జ్యూస్ తాగడం సురక్షితమేనా?ఎంత పరిమానంలో తీసుకుంటే తల్లి బిడ్డకు క్షేమం తెలుసుకుందాం...

గర్భిణీలు లైమ్ జ్యూస్ ను మితంగా తీసుకోవడం వల్ల సురక్షితమైనది. మోడ్రేషన్ లెవల్స్లో దీన్ని తీసుకోవడం తల్లి బిడ్డకు సురక్షితం. క్యాన్డ్ లేదా నిల్వచేసిన వాటికంటే ఫ్రెష్ గా తయారుచేసిన లైమ్ జ్యూస్ తీసుకోవడం మంచిది. లైమ్ జ్యూస్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇది ఫాస్ట్ డిటాక్సిఫికేషన్ కు కారణమవుతుంది. ఇది గర్బిణిలకు అంత మంచిది కాదు. పరిమితంగా మాత్రమే తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలను పొందవచ్చు.

లైమ్ జ్యూస్ లో వివిధ రకాల విటమిన్స్, మినిరల్స్ అధికంగా ఉన్నాయి కాబట్టి, ఇది ప్రెగ్నెన్సీ డైట్ లో ఒక బాగం. ముఖ్యంగా గర్భిణీలు డీహైడ్రేషన్ తో బాధపడే వారు లైమ్ జ్యూస్ తీసుకోవడం వల్ల బాడీ డీహైడ్రేషన్ కు గురి కాకుండా ఉంటుంది. ఈ సిట్రస్ జ్యూస్ లో విటిమిన్ సి అధికంగా ఉంటుంది. విటమిన్ సి డిఫిషియన్స్ ఉన్న వారు కూడా లైమ్ జ్యూస్ తీసుకోవడం వల్ల సమస్యను తగ్గించుకోవచ్చు . అయితే రెగ్యులర్ డైట్ లో లైమ్ జ్యూస్ చేర్చుకోవాలని కోరుకునే వారు ముందుగా, డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది...

గర్భిణీలు లైమ్ జ్యూస్ తాగడం వల్ల పొందే అడిషినల్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం...

విటమిన్ సి పుష్కలంగా అందుతుంది:

విటమిన్ సి డిఫిషియన్సీ ఉన్నవారు లైమ్ జ్యూస్ తాగడం మంచిది. లైమ్ జ్యూస్ ను రెగ్యలర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల విటమిన్ సి అధనంగా అందుతుంది. విటమిన్ సి సప్లిమెంట్ తీసుకునే అవకాశం ఉండదు.

మలబద్దకం, అజీర్తి:

గర్భధారణ సమయంలో మలబద్దకం, జీర్ణ సమస్యలు సహజం . లైమ్ జ్యూస్ తాగడం వల్ల ఇర్రిటేబుల్ బౌల్ మూమెంట్ ను కంట్రోల్ చేస్తుంది. డయోరియా, మలబద్దక సమస్యలను తగ్గిస్తుంది. బౌల్ మూమెంట్ మెరుగుపరుస్తుంది. డయోరియా వల్ల శరీరంలో కోల్పోయిన నీటిని తిరిగి పునరుద్దరించి డీహైడ్రేషన్ సమస్యను తగ్గిస్తుంది.

గ్రేట్ యాంటీ ఆక్సిడెంట్స్ :

లైమ్ జ్యూస్ లో విటమిన్ సి మాత్రమే కాదు, గ్రేట్ యాంటీ ఆక్సిడెంట్. లైమ్ జ్యూస్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల శరీరంను డిటాక్సిఫై చేస్తుంది. టాక్సిన్స్ తొలగిస్తుంది. ఫ్రీరాడికల్స్ ను తొలగిస్తుంది. అలాగే గర్భధారణ సమయంలో వచ్చే జలుబు , ఇతర ఇన్ఫెక్షన్స్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

పుట్టబోయే బిడ్డకు ప్రయోజనాలు అందిస్తుంది:

అన్ బోర్న్ బేబీ కి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. లైమ్ జ్యూస్ లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది పుట్ట బోయే బిడ్డలో బోన్స్ ఏర్పడటకు సహాయపడుతుంది. ఇది బ్రెయిన్, నాడీవ్యవస్థను మెరుగుపరచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

హైబ్లడ్ ప్రెజర్:

ప్రెగ్నెన్సీలో హైబ్లడ్ ప్రెజర్ అంత మంచిది కాదు, క్రోనిక్ హైబిపి ప్రీక్లాప్సియాకు దారితీస్తుంది. బేబీ డెలివరీ సమయం కంటే ముందే పుట్టే అవకాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి, హైబ్లడ్ ప్రెజర్ తగ్గించుకుని, ప్రెగ్నెన్సీ సురక్షితంగా గడపాలంటే, లైమ్ జ్యూస్ ఉపయోగపడుతుంది.

కాళ్ళ వాపులను తగ్గిస్తుంది:

ఎడిమా ఆరోగ్యానికి మంచిది కాదు, సహజంగా కనిపించే కాళ్ళవాపులు, తిమ్మెర్లు, నొప్పితో బాధిస్తాయి. ఇటువంటి సమయంలో లైమ్ జ్యూస్ ఒక టీస్పూన్ ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో వేసి తాగడం వల్ల ఎడిమా నుండి ఉపశమనం కలుగుతుంది.

ప్రసవ నొప్పులను తగ్గిస్తుంది:

గర్భధారణ సమయం కంటే ప్రసవం అత్యంత ముఖ్యమైనది. ప్రసవంలో నొప్పులను, ఇతర సమస్యలను తగ్గించుకోవడానికి సురక్షితంగా ప్రసవం జరగడానికి ఒక గ్లాసు గోరువెచ్చని లైమ్ జ్యూస్ కు కొద్దిగా తేనె మిక్స్ చేసి తీసుకోవడం వల్ల సుఖ ప్రసవం జరగుతుంది.

ఇతర ప్రయోజనాలు :

లైమ్ జ్యూస్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల హార్ట్ బర్న్, బ్లోటింగ్ వంటి సమస్యలను నివారించుకోవచ్చు. లైమ్ జ్యూస్ లో విటమిన్ సి, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియంలు అధికంగా ఉంటాయి . ఇవి ఆస్త్మా, జలుబు, ఫీవర్ వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి . అనీమియా సమస్యను నివారిస్తాయి.

English summary

8 Proven Health Benefits Of Lime Juice For Pregnant Women

Drinking lime juice during pregnancy has been considered safe by medical practitioners and no side effects have been reported. In fact, this delicious juice can provide additional health benefits during pregnancy:
Story first published: Wednesday, November 9, 2016, 11:18 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter