గర్భిణీలు ప్లాంటైన్స్ (పచ్చి అరటి కాయ)తినడం సురక్షితమా...కాదా..?

గర్భిణీల పచ్చి అరటి కాయలను తినడం వల్ల వీటిలో ఉండే డైటరీ ఫైబర గ్రేట్ గా సహాయపడుతుంది. ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది. జీర్ణ సమస్యలను నివారిస్తుంది. గ్రీన్ వెజిటేబుల్స్ లో ఒకటైన పచ్చి అరటికాయలో ఫైబర్, ప

Posted By:
Subscribe to Boldsky

అరటిపండు అందరికీ అందుబాటులో ఉండే పండు. అనేక రకాల హెల్త్ బెన్ఫిట్స్ కలిగిన అద్భుతమైన పండు. పొటాషియం ఎక్కువ మోతాదులో న్యాచురల్ గా అరటిపండు ద్వారా పొందవచ్చు. దీనితినడం వల్ల చాలా ఎనర్జిటిక్ గా ఉండటమే కాదు.. ఇమ్యునిటీ పెరుగుతుంది. అయితే అరటిపండులోని ఆరోగ్య ప్రయోజనాలు అందరికీ తెలిసిందే. మరి అరటికాయ లేదా పచ్చి అరటిపండు సంగతేంటి ?

పచ్చి అరిటి కాయను గర్భిణీలు తినవచ్చా?పచ్చి అరిటిపండు తినడం వల్ల హెల్త్ రిస్క్ ఏమైనా ఉంటుందా అని ఆలోచించే వారి సంఖ్య ఎక్కువగానే ఉన్నారు?పచ్చి ఆరటికాయను ప్లాంటైన్ అనిపిలుస్తారు, గ్రీన్ వెజిటేబుల్స్ లో ఇది కూడా ఒకటి. పండిన అరిటి పండ్లలో కంటే పచ్చి అరటిలో న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి. ప్లాంటైన్ బానాన ఫ్యామిలికి సంబంధించినేదే అయినా, కాస్త డిఫరెంట్ గా ఉంటాయి. వీటిని ఉడికించి తీసుకోవాలి. వీటిలో న్యూట్రీషియన్స్ తో పాటు స్టార్చ్ కూడా అధికంగా ఉంటుంది, అందుకే అనేక ప్రయోజనాలను అందిస్తుంది..

అరటి దూట జ్యూస్ లోని ఆశ్చర్యం కలిగించే ఆరోగ్య ప్రయోజనాలు

గర్భిణీల పచ్చి అరటి కాయలను తినడం వల్ల వీటిలో ఉండే డైటరీ ఫైబర గ్రేట్ గా సహాయపడుతుంది. ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది. జీర్ణ సమస్యలను నివారిస్తుంది. గ్రీన్ వెజిటేబుల్స్ లో ఒకటైన పచ్చి అరటికాయలో ఫైబర్, ప్రోటీన్స్, ఫోలిక్ యాసిడ్, మినిరల్స్, టిష్యు బిల్డింగ్ ఎలిమెంట్ అధికంగా ఉంటాయి. ఇవి హెల్తీ ప్రెగ్నెన్సీకి గ్రేట్ గా సహాయపడుతుంది. అయితే ప్రెగ్నెన్సీ ప్లాన్ లో ఉన్నప్పుడు ఎక్కువగా తినకూడదు. గర్భం పొందిన తర్వాత పచ్చి అరటిపండ్లును వంటల్లో జోడించడి, ఫ్రై చేసి, స్టీమ్ చేసి తినడం వల్ల పొందే ప్రయోజనాలు తెలుసుకుందాం..

స్టార్చ్ అధికంగా ఉంటుంది:

పచ్చి అరటిపండ్లలో స్ట్రార్చ్ అధికంగా ఉంటుంది. ఇది గర్భిణీలకు అసవరమయ్యే ఎనర్జీని పుష్కలంగా అందిస్తుంది.

మలబద్దకం నివారిస్తుంది:

పచ్చి అరటికాయలో ఉండే డైటరీ ఫైబర్ బౌల్ మూమెంట్ స్మూత్ గా జరిగేందుకు సహాయపడుతుంది, గర్భిణీల్లో మలబద్దక సమస్యలను నివారిస్తుంది. జీర్ణ సమస్యలను నివారించుకోవాలంటే రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి.

వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది:

ప్లాంటైన్ లో ఉండే విటమిన్ సి , ఎలు వివిధ రకాల హానికరమైన ఇన్ఫెక్షన్స్ మరియు ఫ్రీరాడికల్ యాక్టివిటీస్ నుండి రక్షణ కల్పిస్తుంది. విటమిన్ ఎ స్ట్రాంగ్ యాంటీఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. ఫ్రీరాడికల్స్ ను న్యూట్రలైజ్ చేస్తుంది. హెల్త్ సెల్స్ డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది.

కళ్ళు, చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది:

ప్లాంటిన్స్ లో ఉండే విటమిన్ ఎ కంటెంట్ కళ్ళ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. స్కిన్ కంప్లెక్షన్ ను మెరుగుపరుస్తుంది.

డ్యూరియాటిక్ గా పనిచేస్తుంది:

ప్లాంటిన్ డ్యూరియాటిక్ గా పనిచేస్తుంది. యూరిన్ ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది. కిడ్నీ, బ్లాడర్ సమస్యలను కూడా నివారిస్తుంది.

బి-కాంప్లెక్స్ విటమిన్స్ :

ప్లాంటిన్ లో ఉండే బి-కాంప్లెక్స్ విటమిన్స్ , ముఖ్యంగా విటమిన్ బి6 లేదా పెరిడాక్సి లు అనీమియా నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.

హెల్తీ ప్రెగ్నెన్సీ:

పచ్చి అరటిపండ్లులో ఫొల్లెట్ , థైమిన్, నియాసిన్, రిబోఫ్లెవిన్లు అధికంగా ఉంటాయి కాబట్టి, గర్భధారణ ఆరోగ్యకరంగా పూర్తి అవ్వడానికి సహాయపడుతుంది.

ఎముకలను స్ట్రాంగ్ గా ఉంచుతుంది:

ప్లాంటిన్స్ లో మినిరల్స్ అధికంగా ఉంటాయి, మెగ్నీషియం, ఫాస్పరస్, మరియు ఐరన్ లు ఎముకలు స్ట్రాంగ్ మార్చడానికి సహాయపడుతాయి,

హార్ట్ హెల్త్ :

పచ్చి అరటిపండ్లలో ఉండే పొటాషియం హార్ట్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది. మినిరల్స్, మెగ్నీషియ, ఫాస్పరస్ ఐరన్ లు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో గ్రేట్ గా సహాయపడుతాయి,

English summary

Are Plantains Safe During Pregnancy?

High nutritional content in plantains provides you lots of health benefits while expecting. Health benefits include:
Please Wait while comments are loading...
Subscribe Newsletter