For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అబార్షన్ తర్వాత ఆరోగ్యం త్వరగా రికవర్ అవ్వడానికి తీసుకోవల్సిన ఆహారాలు

|

అబార్షన్ తర్వాత మహిళ తన ఆరోగ్యం త్వరగా సాధారణ స్ధితికి చేరటానికిగాను ఆహారం పట్ల అతి జాగ్రత్త వహించాలి. అబార్షన్ కొరకు చేసిన ఆపరేషన్ చిన్నదే అయినప్పటికి శరీరంలో అధిక దుష్ఫ్రభావాలు చూపే అవకాశం వుంది. అబార్షన్ చేయించుకోవటమనేది మహిళ జీవితంలో ఒక దురదృష్టకర సంఘటన. సాధారణంగా వైద్యులు మరీ అత్యవసరమైతే తప్ప అబార్షన్ సూచించరు. నెలలు అధికమైన కొన్ని అబార్షన్లు మహిళను కూడా ప్రమాదంలో పడేస్తాయి.

నేటి రోజులలో అబార్షన్ చట్టబద్ధమైనప్పటికి పెద్ద ప్రాణానికి ఎపుడూ ముప్పుగానే భావిస్తూంటారు. రక్తస్రావం అధికమవుతుంది, శరీరంలో ఐరన్, విటమిన్ బి 12, బి9, బి2 లేదా రిబోఫ్లావిన్ స్ధాయిలు తగ్గుతాయి. ఆమె ఎంతో బలహీనపడుతుంది. తగిన విశ్రాంతి కూడా కావాలి. రక్తహీనత, ఎముకల అరుగుదల మొదలైనవి తగ్గటానికి తీసుకునే ఆహారంలో ఐరన్, బి బిటమిన్, కాల్షియం మొదలైనవి వుండటం అత్యవసరం. మహిళ తగిన పోషకాలు కలిగిన ఆహారం తీసుకుంటే, అబార్షన్ తర్వాత బలహీనతనుండి త్వరగా కోలుకోగలరు. అబార్షన్ అయిన తర్వాత మహిళ ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఒక సారి తెలుసుకుందాం...

పాలు :

పాలు :

తక్కువ కొవ్వు కల పాల ఉత్పత్తుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. పాల ఉత్పత్తులు ప్రొటీన్లను, విటమిన్లను ఎక్కువగా ఉంటాయి. అబార్షన్ తర్వాత శరీరానికి కావల్సిన విటమిన్స్ న్యూట్రీషియన్స ను అందిస్తుంది.

నెయ్యి:

నెయ్యి:

అబార్షన్ జరిగిన తర్వాత రెగ్యులర్ డైట్ లో నెయ్యి చేర్చుకోవాలి. ఎందుకంటే నెయ్యిలో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి అబార్షన్ సమయంలో కోల్పోయిన్ రక్తంను , టిష్యులను తిరిగి పొందేందుకు సహాయపడుతుంది.

పసుపు:

పసుపు:

పాలలో కొద్దిగా పసుపు మిక్స్ చేసి తీసుకోవడం వల్ల , అబార్షన్ తర్వాత వచ్చే ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది. ఎందుకంటే పసుపులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వాపులను, నొప్పిని తగ్గిస్తాయి.

అల్లం:

అల్లం:

అబార్షన్ జరిగిన తర్వాత శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. అంతర్గతంగా గాయం అవుతుంది. కాబట్టి, అంతర్గత గాయాలను మాన్పడానికి అల్లం గ్రేట్ గా సహాపడుతుంది. అల్లంలో నయం చేసే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది వ్యాధినిరోధకతను పెంచుతుంది. మరియు కొన్ని ఇన్ఫెక్షన్స్ ను నివారస్తుంది.

 కుంకుమ పువ్వు:

కుంకుమ పువ్వు:

కుంకుమ పువ్వును పాలలో మిక్స్ చేసి తాగడం వల్ల శరీరానికి పోషణను అందిస్తుంది. అలాగే శరీరం కోల్పోయిన కొన్ని రకాల విటమిన్స్ మరియు మినిరల్స్ ను రీస్టోర్ చేస్తుంది.

డేట్స్ :

డేట్స్ :

అబార్షన్ తర్వాత స్త్రీ రెగ్యులర్ డైట్ లో డేట్స్ చేర్చుకోవడం వల్ల, వీటిలో ఉండే ఐరన్ కంటెంట్ రెడ్ బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్ మెరుగుపరుస్తుంది. దాంతో కోల్పోయిన రక్తంను తిరిగి పొందుతారు.

ఫ్లాక్స్ సీడ్స్ :

ఫ్లాక్స్ సీడ్స్ :

అబార్షన్ జరిగిన తర్వాత తినాల్సిన హెల్తీ ఫుడ్స్ లో ఫ్లాక్స్ సీడ్స్ ఒకటి, ఇది హెల్తీ యూట్రస్ కు చాలా మేలు చేస్తుంది. ఇంకా ఇమ్యూనిటిని స్ట్రాంగ్ గా పెంచుతుంది.

English summary

Best Natural Foods For Recovery After An Abortion

If you are a woman who has had the devastating experience of going through an abortion or a miscarriage recently, then you must ensure that you recover well by consuming some of the best foods after an abortion.
Desktop Bottom Promotion