త్వరగా గర్భం పొందడానికి ఆయుర్వేదం సహాయపడుతుందా..?

ఆయుర్వేదం ప్రకారం, మానవ ఆరోగ్యానికి శరీర కణజాలాన్ని, బయోస్టాటిక్ శక్తులు, జీర్ణశక్తి, విసర్జక వ్యవస్థ మరియు భావాలను సంతులనం చేసే అనేక కారకాల సామరస్యం మీద ఆధారపడి ఉంటుంది. ఈ సామరస్యం ప్రతికూలంగా ఉండటం,

Subscribe to Boldsky

కొన్ని ఆరోగ్య కారణాల వలన గర్భం విఫలం అయిన జంటలు ఉన్నాయి. వారు వారి కలలను సాకారం చేసుకోవటానికి సాంప్రదాయ వైద్యం వైపుకు వెళ్ళుతున్నారు. అలాగే వంధ్యత్వం చికిత్స ద్వారా గర్భధారణ అవకాశాలు పెంచడానికి ఆయుర్వేదం సహాయపడుతుందని మరియు దుష్ప్రభావాలు తక్కువ ఉంటాయని నమ్ముతారు.

ఆయుర్వేద చికిత్సలో మానవ భావన విధానం అనేది ఉంది. ఒక విత్తనం రీతూ (సీజన్), క్షేత్రమని (సారవంతమైన భూమి), అంబు (నీళ్ళు మరియు పోషణ) మరియు బీజం (విత్తనాలు నాణ్యత) ద్వారా ఒక మొక్క ఎలా పెరుగుతుందో అదే విధంగా ఈ చికిత్స ఉంటుంది.

మానవుల విషయానికి వస్తే ఇది నాలుగు దశలలో ఉంటుంది. అవి ఋతు చక్రం, ఆరోగ్యకరమైన గర్భాశయం సరైన పోషకాహారం మరియు నాణ్యమైన స్పెర్మ్ మరియు అండం అని చెప్పవచ్చు.


Do You Know That Ayurveda Can Help You Get Pregnant Faster? Here Is How

ఆయుర్వేద చికిత్స యొక్క లక్ష్యం మహిళ లో అండోత్సర్గము, వ్యక్తిలో స్పెర్మ్ ప్రొడక్షన్ సరిగా ఉండేలా చేస్తుంది. రెండు లింగాల లో పునరుత్పత్తి అవయవాలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.


ఆయుర్వేద ఆరోగ్యం

ఆయుర్వేదం ప్రకారం, మానవ ఆరోగ్యానికి శరీర కణజాలాన్ని, బయోస్టాటిక్ శక్తులు, జీర్ణశక్తి, విసర్జక వ్యవస్థ మరియు భావాలను సంతులనం చేసే అనేక కారకాల సామరస్యం మీద ఆధారపడి ఉంటుంది. ఈ సామరస్యం ప్రతికూలంగా ఉండటం, అనారోగ్య మైన ఆహారం, జీవనశైలిలో మార్పుల కారణంగా ప్రభావం పునరుత్పత్తి మీద పడుతుంది.

ఒక జంట గర్భధారణకు ప్రణాళికను సిద్ధం చేసుకున్నప్పుడు ముందుగా వ్యర్ధాలను తొలగించటానికి ఆయుర్వేదం భావన దిశగా వెళ్ళవచ్చు.

ఆయుర్వేద కన్సెప్షన్

ఆయుర్వేదం ఒక మృదువైన భావన. అది వీర్యకణం అండము మరియు గర్భాశయం యొక్క ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది. పురుషులు మరియు మహిళల రిప్రొడక్టివ్ ఆరోగ్యం,పునరుత్పత్తి కణజాలం అనేది శరీరం యొక్క ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది.

పునరుత్పత్తి కణజాలం యొక్క ఆరోగ్యం అన్ని ఇతర కణజాలాలకు మరియు శరీరం యొక్క మృదువైన జీవక్రియ మీద ఆధారపడి ఉంటుంది.


గర్భం వైఫల్యం అనేది సరైన పోషణ లేకపోవటం , చెడు జీర్ణం మరియు శరీరంలో టాక్సిన్ల నిల్వ కారణంగా పునరుత్పత్తి అవయవాలు అనారోగ్యానికి గురి కావటం వంటి అనేక కారకాల మీద ఆధారపడి ఉంటుంది. మానసిక అనుబంధం, సరైన ఆహార అలవాట్లు లేకపోవటం, ఇన్ఫెక్షన్, లిబిడో తగ్గటం, భావన సమస్యలు లేకపోవటం, జన్మతః నపుంసకత్వం వంటివి కూడా కారణాలు కావచ్చు.


గర్భం తొందరగా రావటానికి ఆయుర్వేద చికిత్స

ఇక్కడ ఆరోగ్యం మెరుగుపరచటానికి మరియు గర్భధారణ తొందరగా రావటానికి కొన్ని చికిత్సలు ఉన్నాయి.

Do You Know That Ayurveda Can Help You Get Pregnant Faster? Here Is How

1. పంచకర్మ

ఇది శరీరంలో విషాన్ని బయటకు పంపటానికి సహాయపడుతుంది. శరీరంలో విషం బయటకు పొతే శరీర కణాలు తిరిగి సరైన పోషణ గ్రహించడం ప్రారంభమవుతుంది.అలాగే శరీరం యొక్క స్వయం నివారణ సామర్థ్యం మరియు రోగనిరోధక శక్తి పెంచటానికి సహాయపడుతుంది. పంచకర్మ చికిత్సలో సాధారణంగా ముందు ప్రక్రియ, సరైన ప్రక్రియ మరియు పోస్ట్ ప్రక్రియ అనే మూడు దశలలో జరుగుతుంది.

2. పొడిక్కిజహి

ఈ ప్రక్రియలో విషాన్ని బయటకు పంపించటం,టెన్షన్ తగ్గించటం, సర్క్యులేషన్ మెరుగుపర్చడం,కండరములు యొక్క కణజాలం బలపడటం వంటివి జరుగుతాయి.

3. స్నేహపానం

ఈ చికిత్సలో నెయ్యిని ఉపయోగించి జీర్ణశయాంతర సమస్యలను నయం చేసి జీర్ణ సమస్యను తొలగిస్తారు.

Do You Know That Ayurveda Can Help You Get Pregnant Faster? Here Is How

4. అభ్యంగ

ఈ చికిత్సలో మసాజ్ చేసి దోషాలను తొలగించి శక్తిని పునరుద్ధరణ చేస్తారు. మసాజ్ కోసం నిర్దిష్ట మూలికలతో తయారుచేసిన నూనెను ఉపయోగిస్తారు.

5. అవగాహం

ఈ వెచ్చని హెర్బ్ కషాయాలతో నిండిన అవగాహం టబ్ లో కూర్చుని స్నానం చేస్తారు. స్నానానికి ముందు శరీరం మీద మూలికా నూనెను పోస్తారు.


6.ఎలాకిజహి

ఔషధ మూలికలు మరియు ఆకులతో శరీరాన్ని రుద్ది ఆ తర్వాత ఔషధ తైలంతో మసాజ్ చేస్తారు. ఈ విధంగా చేయటం వలన కీళ్ళనొప్పులు, స్పాండిలైటిస్, వెన్నునొప్పి మరియు మృదువైన కణజాలం వాపు వంటివి తగ్గుతాయి.


అయితే ఈ చికిత్స ఫలితాలు ఒక వ్యక్తికి మరొక వ్యక్తికీ మారుతూ ఉంటాయని గమనించాలి.

English summary

Do You Know That Ayurveda Can Help You Get Pregnant Faster? Here Is How

There are couples who fail to conceive a baby because of health reasons. They go for conventional medicines to make their dream a reality, but not many know that taking Ayurveda can also increase the chances of conception by treating infertility with minimum side effects.
Please Wait while comments are loading...
Subscribe Newsletter