గర్భిణీల్లో న్యూట్రీషియన్స్ లోపం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ..!!

Subscribe to Boldsky

గర్భవతులుగా ఉన్నప్పుడు సరైన ఆహారాన్ని తీసుకోని తల్లులకి పుట్టిన పిల్లలలో గుండెకి త్వరగా వృద్ధాప్యం వాస్తుందని పరిశోధనలో నిరూపించబడింది.

గర్భవతులు తాము తీసుకునే ఆహారాన్ని కాస్త తాగించినా కానీ పుట్టే పిల్లల అవయవాలు వ్యాధులకి గురయ్యే ఆస్కారం ఉందని, వారిలో వృద్ధాప్యం కూడా త్వరగా వస్తుందనీ ఈ పరిశోధన తెలుపుతోంది.

గర్భవతులలో పోషకాహార లోపం వల్ల వచ్చే దుష్ప్రభావాలు!!

దీనివల్ల హృదయ సంబంధ అనారోగ్యం దరి చేరుతుంది, వ్యాయామం చెయ్యలేరు మరియూ హై బీపీ, మధుమేహం లాంటి ఇతర అనారోగ్యాలు కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది.ఈ రెండు వ్యాధులూ హార్ట్ స్ట్రోక్‌కి కారణం అవుతాయి.తల్లులలో పోషకాహర లోపం వల్ల పిల్లలలో వచ్చే ఈ సమస్యలు అర్ధమయితే ముందరే జాగ్రత్త పడే అవకాశం ఉందని అమెరికాలోని తెక్సాస్ రాష్ట్రంలో ఉన్న జెఫ్రీ క్లార్క్ యూనివర్సిటీ తెలియచేస్తోంది.

గర్భవతులలో పోషకాహార లోపం వల్ల వచ్చే దుష్ప్రభావాలు!!

ఈ పరిశొధనకోసం ఆడా మరియూ మగ బబూన్ల గుండెలని పరిశీలించారు.దీనికోసం ఎంచుకున్న బబూన్ల తల్లులు మామూలు బబూన్ల కంటే 30 శాతం తక్కువ ఆహారం తీసుకున్నాయి.

గర్భవతులలో పోషకాహార లోపం వల్ల వచ్చే దుష్ప్రభావాలు!!

తక్కువ ఆహారం తీసుకున్న తల్లులలకి పుట్టిన బబూన్లలో వయసు పెరిగే కొద్దీ గుండె పనితీరు తగ్గుతోందని గమనించారు.

బబూన్లకి ఐదేళ్ళు(మనుష్యుల 20 సంవత్సరాలకి సమానం)వచ్చేసరికి గుండె పనితీరు పూర్తిగా క్షీణించిపోయింది.

గర్భవతులలో పోషకాహార లోపం వల్ల వచ్చే దుష్ప్రభావాలు!!

ఆరోగ్యకరమైన పిల్లలు కావాలనుకుంటే గర్భవతిగా ఉన్నప్పుడు తల్లి తీసుకునే ఆహారం ముఖ్య భూమిక పోషిస్తుంది.గర్భం ధరించడానికి ముందూ గర్భవతులుగా ఉన్నప్పుడూ తల్లుల పోషకాహారం మీద సమాజం శ్రద్ధ పెడితే అవయవలోపం ఉన్న పిల్లలు పుట్టరని వ్యోమింగ్ యూనివర్సిటీ(అమెరికా)ప్రొఫెసర్ పీటర్ నాథనిఎల్జ్ చెప్పారు.

జర్నల్ ఆఫ్ ఫిజియాలజీ జర్నల్లో ఈ పరిశోధన ఫలితాలు ప్రచురించారు.

English summary

Effects Of Malnutrition During Pregnancy

Children born to mothers who were undernourished during pregnancy are more likely to suffer early ageing of the heart, a research has showed.The animal study found that moderately reducing a mother's food intake can make it more likely that the baby's organs will show increased disease susceptibility and early ageing.
Story first published: Monday, November 21, 2016, 11:28 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter