For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీ స్త్రీలలో హార్ట్ బర్న్ కు గురయ్యే ఆహారాలు...

By Super
|

ఛాతీలో మంట . ఈ సమస్యను సాధారణంగా ఉన్న వారు మాత్రమే కాదు, గర్భిణీలు ఎక్కువగా ఎదుర్కొనే సమస్య. ప్రెగ్నెన్సీ పీరియడ్ లో వీరు తరచూ ఎదుర్కొనే సమస్య . హార్ట్ బర్న్ ఆసిడ్ ఇన్ డైజషన్ అని కూడా అంటారు . పొట్టలో యాసిడ్ రిఫ్లెక్షన్ వల్ల చాతీలో మంటగా లేదా నొప్పిగా లేదా చీకాకు కలిగిస్తుంటుంది . గర్భధారణ సమయంలో ఎలాంటి హాని కలిగించని ఒక సాధారణ సమస్య.

గర్భాధారణ సమయంలో మహిళల్లో కలిగే హార్మోనుల మార్పుల వల్ల హార్ట్ బర్న్ కు కారణం అవుతుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు సరైన ఆహారం తీసుకోవాలి మరియు హార్ట్ బర్న్ కు కారణమయ్యే ఆహారాలకు దూరంగా ఉండాలి. గర్బధారణ సమయంలో గర్భినీ స్త్రీలలో ప్రొజెస్టరాన్ అనే హార్మోన్ రిలాక్సెన్ ను విడుతల చేస్తుంది , ఫలితంగా పొట్టలో ఆమ్లాలు పెరగుతాయి . దాంతో పొట్టలో ఎక్కువ గ్యాస్ట్రిక్ యాసిడ్స్ ఉత్పత్తి అవుతాయి . దాంతో అసౌకర్యమైన బర్నింగ్ సెన్షేషన్ కలుగుతుంది.

చాలా మంది మహిళల్లో ఈ హార్ట్ బర్నింగ్ సమస్యను వారి రెండవ త్రైమాసికంలో ఎదుర్కొంటుంటారు . ఈ సమస్య క్రమంగా ఇలా పెరుగు బేబీ పుట్టే వరకూ ఇబ్బంది కలిగిస్తూనే ఉంటుంది. తిన్న ఆహారం సరిగా జీర్ణమవ్వక , వాంతి వచ్చినట్లు చేస్తుంది . కాబట్టి చాతీ నొప్పికి గురి చేసే కొన్ని ఆహారాలకు దూరంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది . కాబట్టి గర్భధారణ సమయంలో గర్భిణీలు తీసుకోకూడని , హార్ట్ బర్న్ కు గురిచేసే కొన్ని ఆహారాల గురించి ఈ క్రింది విధంగా తెలుసుకుందాం...

Foods That Cause Heartburn In Pregnancy

కాఫీ మరియు టీ: కెఫిన్ అధికంగా ఉండే ద్రవాలను, కాఫీ మరియు టీలను తీసుకోవడం వల్ల గర్భధారణ సమయంలో హార్ట్ బర్న్ కు గురిచేస్తుంది . కాబట్టి, వీటికి దూరంగా ఉండటం మంచిది.
Foods That Cause Heartburn In Pregnancy

ఆల్కహాల్: గర్భధారణ సమయంలో ఆల్కహాల్ కు ఖచ్చితంగా నో చెప్పాలి. ఎందుకంటే దీని వల్ల హార్ట్ బర్న్ సమస్య మరింత తీవ్రమతుంది . ఇంకా పొట్టలో పెరిగే శివు ఆరోగ్యం మీద, ఎదుగుదల మీద తీవ్ర ప్రభావం చూపుతుంది .
Foods That Cause Heartburn In Pregnancy

ఫ్యాట్ అధికంగా ఉండే ఆహారాలు: ఫ్యాట్ ఎక్కువగా ఉండే బట్టర్, నెయ్యి, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్ మరియు జంక్ ఫుడ్స్ వంటి ఖచ్చితంగా నివారించడం మంచిది. ఫ్యాట్ ఎక్కువగా ఉన్న ఆహారాలను తినడం వల్ల హార్ట్ బర్న్ కు గురిచేస్తుంది.
Foods That Cause Heartburn In Pregnancy

చాక్లెట్: గర్భణీలలో హార్ట్ బర్న్ కు గురిచేసే మరో ఆహారం చాక్లెట్ . కాబట్టి దీన్ని ఖచ్చితంగా తినకపోవడం మంచిది . స్వీట్ తినాలనే కోరిక ఆరోగ్యానికి మంచిదే అయినా, తినాలనిపించిన మితంగా తీసుకోవడం మంచిది . డార్క్ చాక్లెట్ లో ఉండే షుగర్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
Foods That Cause Heartburn In Pregnancy

సోడా: గర్భాధారణ సమయంలో సోడాలకు ఖచ్చితంగా దూరంగా ఉండాలి . ఇది హార్ట్ బర్న్ కలిగించడం మాత్రమే కాదు, ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం . వీటికి బదులుగా పండ్ల రసాలను తాగడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది.

English summary

Foods That Cause Heartburn In Pregnancy

Heartburn is one of the most common health problems that women face during their pregnancy period. Heartburn, also known as acid indigestion, is an irritation or a burning sensation caused by the stomach content that reflux from the stomach back to the oesophagus. It is harmless and is quite common for everyone.
Desktop Bottom Promotion