గర్బిణీలు పచ్చి ఉల్లిపాయలు తినడం ఎంతవరకు సురక్షితం..?

పచ్చి ఉల్లిపాయను తినడం గర్భిణీ స్త్రీలకు సురక్షితమా? పచ్చి ఉల్లిపాయల్లో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, పుట్టబోయే బిడ్డకు సురక్షితమేనా అనేది చాలామంది ఉండే అనుమానం. ఐతే ఉల్లిపాయలో ఉండే హెల్త్ బెన్ఫిట

Posted By:
Subscribe to Boldsky

గర్భిణీలు హెల్తీ ఫుడ్ తీసుకోవాలని అందరికీ తెలుసు. అయితే కొన్ని కొన్ని ఆహారాలపై చాలా అపోహలు ఉంటాయి. కొందరు కొన్ని ఆహారాలను తినకూడని, కొందరు వీటిని మాత్రమే తినాలని సూచిస్తుంటారు. అయితే మనం రెగ్యులర్ గా ఉపయోగించే.. పచ్చి ఉల్లిపాయలను తినవచ్చా లేదా అనేది చాలామందికి ఉండే సందేహం. మరి వీటిని గర్భిణీలు తినవచ్చో లేదో తెలుసుకుందాం..

ఉల్లిపాయలలో విటమిన్ సి, బయోటిన్, మాంగనీస్, కాపర్, ఫాస్పరస్, పొటాషియం, విటమిన్ బి6, ఫొల్లెట్ ఉంటాయి. వీటన్నింటి వల్ల ఆరోగ్యానికి చాలామంచి జరుగుతుంది. అయితే చాలామంది బిర్యానీ, పులావ్, వంటివంటకాలకు సైడ్ డిష్ గా ఉల్లిపాయలను తీసుకుంటూ ఉంటారు.

ఇలా పచ్చి ఉల్లిపాయను తినడం గర్భిణీ స్త్రీలకు సురక్షితమా? పచ్చి ఉల్లిపాయల్లో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, పుట్టబోయే బిడ్డకు సురక్షితమేనా అనేది చాలామంది ఉండే అనుమానం. ఐతే ఉల్లిపాయలో ఉండే హెల్త్ బెన్ఫిట్స్ అందరికీ మాత్రమే కాదు గర్భిణీలు, కడుపులోని బిడ్డకూ ప్రయోజనకరమే అంటున్నారు నిపుణులు. మరి గర్భిణీల డైట్ లో పచ్చి ఉల్లిపాయలు చేర్చుకుంటే పొందే బెన్ఫిట్స్ ఏంటో చూద్దాం..

ఇమ్యునిటీ

ఉల్లిపాయల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అలాగే వివిధ పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటటం వల్ల గర్భిణీలలో వ్యాధినిరోధక శక్తి పెంచి.. కడుపులోని బిడ్డ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ఫైబర్

ఉల్లిపాయల్లో ఫైబర్ ఉంటుంది. ఇది బోలెవ్ మూమెంట్ సరిగా జరిగి.. కాన్ట్సిపేషన్ సమస్య దరిచేరకుండా అడ్డుకుంటుంది. కాబట్టి గర్భిణీలు పచ్చి ఉల్లిపాయలు తినడం మంచిది.

నిర్విశీకరణం

శరీరంలో మెటల్ ఎక్కువగా ఉండటం తల్లీ, బిడ్డ ఇద్దరికీ హానికరం. ఉల్లిపాయల్లో ఉండే ఎమినో యాసిడ్స్, సిస్టైన్, మెథినైన్ లు శరీరాన్ని నిర్విశీకరణం చేయడానికి సహాయపడతాయి.

బ్లడ్ ప్రెజర్

గర్భిణీల్లో చాలా తరచుగా ఇబ్బందిపెట్టే బ్లడ్ ప్రెజర్ ని కంట్రోల్ చేయడంలో పచ్చి ఉల్లిపాయలు సహాయపడతాయి. అలాగే నిద్రలేమి, హైపర్ టెన్షన్, ప్రీమెచ్యూర్ డెలివరీ సమస్యను కూడా కంట్రోల్ చేస్తాయి.

డయాబెటిస్


ఉల్లిపాయల్లో క్రోమియం ఉంటుంది. ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి గర్భిణీలకు సూపర్ ఫుడ్ అని చెప్పవచ్చు. కాబట్టి ఎలాంటి సందేహం లేకుండా.. గర్భిణీలు.. ఉల్లిపాయలు తీసుకోవచ్చు.

పంటినొప్పి నివారించుకోవడానికి

గర్భిణీల్లో వచ్చే హార్మోన్ల మార్పుల వల్ల దంత సమస్యలు వస్తాయి. పాచి పెరుగుతుంది. ఇన్ల్ఫేమేషన్, బ్లీడింగ్ సమస్యలు వస్తుంటాయి. దంత సమస్యలు, నివారించుకోవడానికి యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్న ఉల్లిపాయలు డైట్ లో చేర్చుకోవడం వల్ల పంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.

English summary

Health Benefits of Eating Raw Onions During Pregnancy

Health Benefits of Eating Raw Onions During Pregnancy. Pregnant women who are especially interested in well-balanced proper nutrition must not neglect the advantages which eating onions gives.
Story first published: Monday, November 28, 2016, 14:09 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter