For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట్విన్ బేబీస్ పుట్టడానికి కొన్ని నేచురల్ టిప్స్ ..!

|

నేడు చాలామంది జంటలు ఒకేమారు ఇద్దరు పిల్లలను అంటే కవల పిల్లలను కనేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రకమైన కోర్కెలు వారిలో బాగా పెరిగిపోతున్నాయి.

దానికి కారణం నేడు మహిళలు చాలావరకు ఉద్యోగాలు చేస్తున్నారు. కనుక ఆ ఉద్యోగంలో మేటర్నీటీ లీవ్ అంటూ రెండు సార్లు సెలవు పెట్టటం మహిళ తన ఉద్యోగ భధ్రతకు, తన కెరీర్ కు ఆటంకంగా భావిస్తోంది. ఒకే సారి గర్భం ధరించి ఇద్దరు పిల్లలనను కనేయాలని భావిస్తోంది. ఆమె అవసరం అటువంటిది.

కనుక, ఒకే సారి ఇద్దరు పిల్లలను కనేందుకు తప్పక మార్గాలు కూడా వుంటాయి. కవల పిల్లలు పుడితే చాలా అదృష్టమే మరి. కవల పిల్లలు పుట్టించుకోవడం ఎలా అనే అంశంపై కొన్ని సైంటిఫిక్ వివరణలు పరిశీలించండి.

అండోత్సర్గం అతి చురుకుగా కొనసాగుతుందని సైన్స్ చెపుతోంది

అండోత్సర్గం అతి చురుకుగా కొనసాగుతుందని సైన్స్ చెపుతోంది

వయసు పెరిగే కొలది మీకు అవకాశాలు అధికం - ఎల్లపుడు బిజీగా వుంటూ పనులు చేసుకునే మహిళలకు ఒకే సారి కవలలు కలగటం నిజంగా మంచి అవకాశం. వారు కూడా ఉద్యోగాలలో వుంటూ సంతానం కొరకు ఆలస్యంగానే ప్రయత్నిస్తారు. మహిళకు మెనోపాజ్ ముందు అండోత్సర్గం అతి చురుకుగా కొనసాగుతుందని సైన్స్ చెపుతోంది. మీ అండాశయంనుండి 35 నుండి 45 రోజుల పిరీయడ్ లో ఒకటికంటే కూడా అధికంగా అండాలు రిలీజ్ చేయబడతాయి.

ఫలదీకరణ -

ఫలదీకరణ -

చాలామంది సెలిబ్రిటీలు ఫలదీకరణ చికిత్సలు చేయించుకున్నవారు. లేదా టెస్ట్ ట్యూబ్ బేబీలకు చికిత్స చేయించుకున్నవారు కవలలు పొందటం మీరు గమనించే వుంటారు. గర్భం దాల్చటం కష్టమైతే, మీరు కనుక ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ చేయించుకొనే వారైతే కవలలు పొందేందుకు మీకు మంచి అవకాశమే.

 కుటుంబ చరిత్ర -

కుటుంబ చరిత్ర -

మీ కుటుంబంలో మీ ఆంటీలు లేదా ఇతర బంధువులలో ఎవరికైనా కవల పిల్లలు కలిగినట్లయితే, మీకు కూడా ఇది తేలిక అవుతుంది. మీరు 30 సంవత్సరాల పైన కూడా గర్భం ధరించాల్సిన అవసరం లేదు. అది కనుక మీ జన్యువులలో వుంటే, సహజంగా కవలల కొరకు కూడా ప్రయత్నించవచ్చు.

 ఇప్పటికే ఒక బిడ్డకు పాలు ఇస్తూ వుంటే, మరో గర్భం కవల పిల్లలతో పొందేందుకు అనుకూలంగా వుంటుంది

ఇప్పటికే ఒక బిడ్డకు పాలు ఇస్తూ వుంటే, మరో గర్భం కవల పిల్లలతో పొందేందుకు అనుకూలంగా వుంటుంది

మీరు ఇప్పటికే ఒక బిడ్డకు పాలు ఇస్తూ వుంటే, మరో గర్భం కవల పిల్లలతో పొందేందుకు అనుకూలంగా వుంటుంది అని సైంటిస్టులు చెపుతారు. అది పూర్తిగా రుజువు కానప్పటికి కలిగే అవకాశాలుంటాయంటారు. కనుక తప్పక ఈ సమయంలో ప్రయత్నించండి.

డైరీ ప్రొడక్ట్స్ ఎక్కువగా తీసుకోవాలి:

డైరీ ప్రొడక్ట్స్ ఎక్కువగా తీసుకోవాలి:

ఆరోగ్యకరమైన పాల పదార్ధాలు: పాలతోపాటు వెన్న, చీజ్, ఇతర పాల పదార్ధాలను మీ ఆహారంలో తీసుకోవడం వల్ల కవలల గర్భధారణ పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆవులలో ఎదుగుదలకు అవసరమైన ఇన్సులిన్ ఉండడం వల్ల, పాల పదార్ధాలు తీసుకుంటే సహజంగా కవలలను గర్భం దాల్చడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి.

ఊబకాయం మరియు కవల పిల్లలు -

ఊబకాయం మరియు కవల పిల్లలు -

ఊబకాయం కలిగి అధిక బరువు వుంటే వారికి కొన్ని సార్లు సహజంగా కవల పిల్లలు కలిగే అవకాశాలుంటాయి. అయితే పుట్టే కవలలు ఇద్దరూ ఒకే రకంగా వుండకపోవచ్చు.

ఐవిఎఫ్ ట్రీట్మెంట్

ఐవిఎఫ్ ట్రీట్మెంట్

ఐవిఎఫ్(ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్)ట్రీట్మెంట్ తీసుకునే వారిలో కవల పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇటువంటి చికిత్సల్లో మహిళ గర్భంలోకి వీర్యకణాలను లేదా ప్రత్యుత్పత్తి జరిగినేఎగ్స్ ను ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు. అక్కడ కనుకు వీర్యకణం ప్రత్యుత్పత్తి జరిపి, పిండం ఏర్పడటం ప్రారంభిస్తే కవలలు పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

యామ్స్ తినే వారిలో

యామ్స్ తినే వారిలో

మహిళల్లో ఎవరైతే ఎక్కువగా యామ్స్ తింటారు వారిలో కవలలు పుట్టే అవకాశాలు ఎక్కువ . అయితే కవలలు పుట్టడానికి ఎంత యామ్స్ తినాలన్నది తెలుసుకోవాలి.

రుచికరమైన దుంపకూరలు;

రుచికరమైన దుంపకూరలు;

గిరిజన స్త్రీలు సహజంగా కవలలను పొందడానికి వారి ఆహారంలో ఎక్కువ మోతాదులో దుంప కూరలను తీసుకుంటారని ఒక అధ్యయనంలో తెలిసింది. ఈ విషయం ధ్రువీకరించబడనప్పటికీ, ఈ విధానంతో కూడిన ప్రయత్నం హాని చేస్తుంది.

గర్భం పొందడానికి ముందు నుండే కొన్ని రకాల విటమిన్స్ తీసుకోవాలి:

గర్భం పొందడానికి ముందు నుండే కొన్ని రకాల విటమిన్స్ తీసుకోవాలి:

ముందుగా తీసుకోవాల్సిన విటమిన్ లు: సహజంగా కవలలను గర్భం దాల్చాలంటే ఎక్కువ మోతాదులో విటమిన్లను తీసుకోవడం ఒక చిట్కా. గర్భవతికి అవసరాలకు సరిపోఎట్లుగా తయారుచేసిన ఈ నెలలోపు తీసుకునే విటమిన్లు చాలా మంచివి.

మంచి పోషకాహారం తీసుకోవాలి:

మంచి పోషకాహారం తీసుకోవాలి:

మంచి పోషణ: : ఈ చిట్కాలలో సమతుల్య ఆహరం అనేది సహజంగా కవలలను పొందడానికి మంచి ప్రాధాన్యతను కలిగి ఉంది. మీరు తక్కువ బరువుతో లేరని నిర్ధారించుకోండి, మీరు కవలల కోసం ప్రయత్నించే ముందు సరైన బరువు పొందదానికి వైద్యుడిని సంప్రదించండి.

 బర్త్ కంట్రోల్ పిల్స్ ను నివారించాలి:

బర్త్ కంట్రోల్ పిల్స్ ను నివారించాలి:

చాలామంది కుటుంబ నియంత్రణకు అనేక రకాల మందులు వాడుతుంటారు. మీరు కావల గర్భధారణను పొందాలి, పిల్లలు కావాలి అనుకుంటే ముందే అటువంటి మందులను మానేయండి.

వైద్యుని సలహాతీసుకోవడం:

వైద్యుని సలహాతీసుకోవడం:

మీరు సహజంగా కవలలను గర్భం దాల్చడానికి మీ వైద్యుని సహాయం కోసం సంప్రదించండి. ఒక సాధారణ గర్భందాల్చే స్త్రీకి కూడా కవలలను పొందే అవకాశాలు పెంపొందించే కొన్ని మందులను సూచిస్తారు. సహజ కవలల గర్భధారణకు కొంతమంది స్త్రీలకూ వైద్యం చాలా అవసరం. వయసుతో కూడిన నిబంధనల వల్ల ఒకసారి మాత్రమే ఆమె గర్భం పొందగలదు అనుకున్నపుడు రెండుసార్లు గర్భం దాల్చడం కంటే కవలలు ఉత్తమం. ఈ చిట్కాలను పాటించి మీ గర్భాన్ని రెట్టింపు సంతోషాలతో ఆనందించండి.

మీరు కనుక ఒకే సారి కవల పిల్లలను కనాలని అనుకుంటుంటే, ఈ చిట్కాలు బహుశ మీకు ఉపయోగించవచ్చు. కనుక ప్రయత్నం చేయండి. ఒకే సారి ఇద్దరు పిల్లలను కని ఆనందించండి.

English summary

How To Conceive Twins Naturally

Many couples dream of having twins. But statistics say that the probability of having twins is only 1%. Of course, there are certain ways to increase the chances.
Story first published: Wednesday, September 28, 2016, 11:28 [IST]
Desktop Bottom Promotion