For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీలో అకస్మాత్తుగా వచ్చే డయాబెటిస్ కు కారణాలు, నివారణ..

|

గర్భధారణ సమయంలో కొన్నిరకాల ఇన్‌ఫెక్షన్లూ, అధికరక్తపోటు వంటి సమస్యలు రావడం వేరు.. మధుమేహం రావడం వేరు! 'జస్టేషనల్‌ డయాబెటిస్‌' అని పిలిచే ఈ సమస్యకి కారణాలుచాలానే ఉన్నాయి. ఇది కేవలం గర్భధారణ సమయంలో మాత్రమే కనిపించినా.. సరైన చికిత్స తీసుకోకుంటే ప్రమాదకరంగానూ పరిణమిస్తుందని చెబుతున్నారు నిపుణులు..

మన దేశంలోని పట్టణాల్లో ఉండే ప్రతి ఏడుగురు గర్భిణుల్లో ఒకరికి మధుమేహం వస్తోందని అధ్యయనాలు చెబుతున్నాయి. జస్టేషనల్‌ డయాబెటిస్‌గా చెప్పుకునే ఈ పరిస్థితి సాధారణంగా గర్భధారణకు ముందు ఉండదు. ఆ తొమ్మిదినెలల కాలంలోనే వచ్చి ప్రసవం అయ్యాక చాలామందిలో తగ్గిపోతుంది. దశాబ్దం క్రితం ఈ పరిస్థితి ప్రతి పదిమందిలో ఒకరికి మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడా సంఖ్య పెరిగింది. గర్భం దాల్చాక జస్టేషనల్‌ డయాబెటిస్‌ ఉందని తేలితే కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ప్రమాదమే!

జస్టేషనల్ డయాబెటిస్ కు ముఖ్య కారణం లైఫ్ స్టైల్:
గర్భం ధరించాక ఈ సమస్య సాధారణంగా ఇరవై నాలుగో వారంలో వచ్చే అవకాశాలు ఎక్కువ. కానీ ఇప్పుడు మొదటి త్రైమాసికంలోనే వస్తోందని అధ్యయనాల్లో తేలింది. ఇందుకూ కారణాలున్నాయి. ఒకప్పటి జీవన విధానం ఓ పద్ధతి ప్రకారం ఉండేది. కానీ ఇప్పుడు... జంక్‌ఫుడ్‌, ప్రాసెస్‌ చేసిన పదార్థాలూ తినేవారి సంఖ్య బాగా పెరిగింది. నిద్రాహార నియమాలు పాటించకపోవడం, వ్యాయామం చేయకపోవడం వల్ల చాలామంది బరువు పెరుగుతున్నారు. కొందరికి గర్భం దాల్చక ముందు నుంచీ పీసీఓడీ ఉండటం కూడా ఈ సమస్యకు దారితీస్తోంది.

ప్రతి ఒక్కరిలో ఇన్సులిన్‌ రిసెప్టార్లు ఉంటాయి. ఇవి గ్లూ్లకోజ్‌ స్థాయుల్ని పర్యవేక్షిస్తుంటాయి. పీసీఓడీతో బాధపడే చాలామందిలో అవి సరిగ్గా పనిచేయవు. దాంతో వారికి ఎక్కువ ఇన్సులిన్‌ అవసరం అవుతుంది. ఆ పరిస్థితినే ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ అంటారు. ఇలాంటి వారు సరిగ్గా చికిత్స చేయించుకోకపోయినా, అధిక బరువున్నా, వ్యాయామం చేయకపోయినా వారికి భవిష్యత్తులో ముఖ్యంగా గర్భం దాల్చినప్పుడు మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

తల్లీబిడ్డలిద్దరిపైనా..

తల్లీబిడ్డలిద్దరిపైనా..

ఈ సమయంలో వచ్చే మధుమేహం సాధారణంగా ప్రసవం తరవాత తగ్గిపోతుంది. కానీ దాన్ని సరైన విధంగా అదుపులో ఉంచుకోకపోతే ఆ ప్రభావం తల్లీబిడ్డలిద్దరిపైనా ఉంటుంది. ముఖ్యంగా ఆ తల్లి భవిష్యత్‌లో రెండోసారి గర్భం దాల్చితే, మళ్లీ మధుమేహం వచ్చే అవకాశం యాభై శాతం ఉంటుంది. వీరికి గర్భధారణ సమయంలో అధికరక్తపోటు కూడా రావచ్చు. మూత్రనాళం, జననేంద్రియ ఇన్‌ఫెక్షన్లూ, అబార్షన్లు కావడం.. లాంటి సమస్యలూ ఎక్కువే. ఇలాంటి వారిలో ఉమ్మనీరు పెరుగుతుంది కాబట్టి నెలలు నిండకుండానే కాన్పు అవుతుంది. కొన్నిసార్లు బిడ్డ బరువును బట్టి వైద్యులే ముందుగా ప్రసవాన్ని అదీ సిజేరియన్‌ చేయాల్సి రావచ్చు. పాపాయికి సరైన గ్లూకోజ్‌ అందక చివరి నెలలో బిడ్డ దక్కకపోయే ప్రమాదం ఉంది. కానీ ఇది చాలా అరుదుగానే జరుగుతుంది.

బరువు పెరుగుతారు:

బరువు పెరుగుతారు:

మొదటి మూడు నెలల్లో తల్లికి మధుమేహం ఉండి దాన్ని గుర్తించకపోతే పాపాయి అవకరాలతో పుట్టే ప్రమాదం ఎక్కువ. గుండె సంబంధ సమస్యలూ ఉండొచ్చు. .తల్లి మాయద్వారా రక్తంలో పెరిగిన చక్కెర స్థాయులు బిడ్డకు చేరతాయి. క్రమంగా కొవ్వుగా మారి బిడ్డ అధిక బరువుతో పుడుతుంది. ఈ పరిస్థితికి వారికి చిన్న వయసులోనే మధుమేహం వచ్చేలా చేస్తుంది. మరికొందరు పిల్లలకు రక్తంలో చక్కెరస్థాయులు మరీ చాలా తక్కువగా ఉండి, శ్వాససంబంధ సమస్యలొచ్చే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు బిడ్డ గర్భసంచిలో సరైన చోట ఉండకపోవచ్చు.

నెలలు నిండకుండా ప్రసవించడం:

నెలలు నిండకుండా ప్రసవించడం:

డయాబెటిస్ ఉన్న గర్భిణీలో నెలలు నిండకముందే ప్రసవించే అవకాలు ఎక్కువ. యూట్రస్ లో అధిక బరువు పెరగడం వల్ల ఇలా జరగవచ్చు.

లో బ్లడ్ షుగర్ బర్త్:

లో బ్లడ్ షుగర్ బర్త్:

డయాబెటిస్ గర్భిణీలో భయపడాల్సిన మరో సమస్య, కాబట్టి, ప్రసవించడానికి ముందు బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. బ్లడ్ షుగర్స్ అధికంగా ఉండటం వల్ల శిశువులో బ్రెయిన్ డ్యామేజ్ వంటి కాంప్లికేషన్స్ ఉండవచ్చు. అందుకు తల్లి, మనస్సును ప్రశాతంగా ఉంచుకోవాలి. లేదంటే శిశువులో గ్లూకోజ్ లోపం ఏర్పడుతుంది.

ఎలా గుర్తించాలంటే..

ఎలా గుర్తించాలంటే..

సాధారణంగా మొదటి నెలలో, ఆరో నెలలో గ్లూకోజ్‌ ఛాలెంజ్‌ పరీక్షతో ఈ మధుమేహాన్ని పసిగట్టొచ్చు. పాతికేళ్లు దాటాక గర్భం దాల్చేవారిలో ఈ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బీఎంఐ ముప్ఫై కన్నా ఎక్కువగా ఉన్నవారిలోనూ మధుమేహం రావచ్చు. గతంలో గర్భందాల్చినప్పుడు మధుమేహం కనిపించినవారికి.. ప్రస్తుత గర్భధారణ సమయంలో వచ్చే అవకాశం 50శాతం ఉంటుంది. కారణం ఏదైనా మధుమేహం ఉందని తెలిశాక తొమ్మిదినెలలూ గ్లూకోజ్‌ ఛాలెంజ్‌ పరీక్ష చేయించుకుంటూనే ఉండాలి. గైనకాలజిస్టు మాత్రమే కాదు ఎండోక్రైనాలజిస్టు, డైటీషియన్‌ పర్యవేక్షణ తప్పనిసరి. ఈ మధుమేహం వచ్చిన రెండు నుంచి మూడుశాతం మందికి మాత్రమే ఇన్సులిన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. మిగతావాళ్లందరూ చిన్న మార్పులతోనే అధిగమించొచ్చు. అదెలాగంటే..

జస్టేషనల్ డయాబెటిస్ ను చిన్న మార్పులతోనే అధిగమించొచ్చు

జస్టేషనల్ డయాబెటిస్ ను చిన్న మార్పులతోనే అధిగమించొచ్చు

పోషకాహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. దానివల్ల రక్తంలో చక్కెరస్థాయులు అదుపులో ఉండటం మాత్రమే కాదు, బరువూ పెరగకుండా ఉంటారు. పండ్లూ, కూరగాయలూ, పొట్టుతీయని గింజలూ తీసుకునే ఆహారంలో ఉండాలి. వాటివల్ల శరీరానికి పీచు ఎక్కువగా అందుతుంది. కొవ్వూ, కెలొరీలూ తగ్గుతాయి. శుద్ధి చేసిన పిండిపదార్థాలూ, తీపి పదార్థాలూ మానేయాలి.

రోజూ శారీరక వ్యాయామం తప్పనిసరి.

రోజూ శారీరక వ్యాయామం తప్పనిసరి.

రోజూ శారీరక వ్యాయామం తప్పనిసరి. దానివల్ల రక్తంలో చక్కెరస్థాయులు అదుపులో ఉంటాయి. వ్యాయామం వల్ల అదొక్కటే కాదు.. గర్భధారణ సమయంలో వచ్చే వెన్నునొప్పీ, కండరాల నొప్పులూ, కాళ్లవాపూ, మలబద్ధకం లాంటి సమస్యలూ తగ్గుతాయి. ప్రసవం తరవాత తీరైన శరీరాకృతిని సొంతం చేసుకోవడం సులువవుతుంది. రోజూ రెండుపూటలా అరగంట చొప్పున నడవడం కూడా మంచిదే. ఒకవేళ అధిక బరువుంటే.. గర్భం దాల్చేందుకు మూడునాలుగు నెలల ముందే దాన్ని తగ్గించుకునేలా చూసుకోవాలి.

బరువు

బరువు

గర్భిణులకు పరగడుపున రక్తంలో చక్కెరస్థాయులు 90/ఎంజీడీఎల్‌, ఏదయినా తిన్నాక 120/ఎంజీడీఎల్‌ ఉండేలా చూసుకోవాలి. రోజులో ఎంత ఆహారం తీసుకున్నా సరే.. అది 2500 కెలొరీలు మించకుండా చూసుకోవాలి. గర్భిణులు పది నుంచి పన్నెండు కేజీల బరువు పెరగాలంటారు. కానీ మధుమేహం ఉన్నవారు ఏడెనిమిది కేజీలు పెరిగితే సరిపోతుంది.

 ఇన్సులిన్‌ని మానకుండా వాడాలి.

ఇన్సులిన్‌ని మానకుండా వాడాలి.

ఇన్సులిన్‌ని మానకుండా వాడాలి. ఒత్తిడి కూడా ఈ సమస్యకు దారితీయొచ్చు. కాబట్టి పాటలు వినడం, పుస్తకాలు చదవడం, సినిమాలు చూడటం.. ఇలా ఏదో ఒకటి చేయాలి. ముఖ్యంగా మధుమేహం వచ్చిందనే ఆందోళనకి దూరంగా ఉండాలి.

 ప్రసవం తర్వాత బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

ప్రసవం తర్వాత బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

ప్రసవం తర్వాత సాధారణంగా తల్లులు బరువు తగ్గుతారు. కొంత మంది మాత్రం మొదటి మూడునెలలు బరువు తగ్గి ఆ తర్వాత క్రమంగా బరువు పెరుగుతారు. ఇది ఆరోగ్యకరమైన లక్షణం కాదు. ప్రసవం తర్వాత బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

బిడ్డకు తప్పనిసరిగా తల్లిపాలు ఇవ్వాలి.

బిడ్డకు తప్పనిసరిగా తల్లిపాలు ఇవ్వాలి.

బిడ్డకు పాలివ్వని తల్లులు బరువు పెరుగుతారు. బిడ్డకు పాలివ్వడం అనేది తల్లిబిడ్డల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం. ఈ జాగ్రత్తలు తీసుకుంటే కాబోయే తల్లులలో హార్మోన్ల మార్పుల వల్ల వచ్చే డయాబెటిస్‌ గురించి భయపడాల్సిన అవసరం లేదు.

English summary

How Gestational Diabetes affect in Pregnant Women?

This factsheet is for women who have gestational diabetes (diabetes that develops in pregnancy), or for anyone who would like information about it. It doesn't provide information for women who already have diabetes and are pregnant or who would like to become pregnant.
Story first published: Monday, May 23, 2016, 17:44 [IST]
Desktop Bottom Promotion