ప్రెగ్నన్సీ టైంలో హైబ్లడ్ ప్రెజర్ ని కంట్రోల్ చేసే సింపుల్ టిప్స్..!

ప్రెగ్నన్సీ టైంలో హైపర్ టెన్షన్ తో బాధపడుతున్నారంటే.. ఖచ్చితంగా మీ బ్లడ్ ప్రెజర్ లెవెల్స్ ను.. మానిటర్ చేయాలి. డెలివరీ అయ్యేంతవరకు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. బ్లడ్ ప్రెజర్ ని కంట్రోల్ చేయాలి

Posted By:
Subscribe to Boldsky

హైబ్లడ్ ప్రెజర్ మరియు ప్రెగ్నన్సీ అనేది డేంజరస్ కాంబినేషన్ అనాల్సిన అవసరం లేదు. కానీ ప్రెగ్నన్సీ టైంలో హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు.. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. అలాగే కన్సీవ్ అవడానికి ముందే.. ఒకసారి బ్లడ్ ప్రెజర్ చెక్ చేయించుకోవడం కూడా అవసరం.

high blood pressure

హైబ్లడ్ ప్రెజర్ ని హైపర్ టెన్షన్ అని మెడికల్ గా పిలుస్తారు. హైబ్లడ్ ప్రెజర్ అనేది ఎవరికైనా ప్రభావం చూపవచ్చు. గర్భిణీల్లో ఇది చాలా ఎక్కువ రీస్కీగా ఉంటుంది. గర్భధారణ సమయంలో మహిళలు.. గెస్టేషనల్ హైపర్ టెన్షన్ ను 20వారాల గర్భం తర్వాత ఫేస్ చేయవచ్చు. క్రోనిక్ హైపర్ టెన్షన్ ని.. 20వారాలలోపు ప్రెగ్నన్సీ టైంలో ఫేస్ చేయవచ్చు.

ప్రెగ్నన్సీ టైంలో హైపర్ టెన్షన్ తో బాధపడుతున్నారంటే.. ఖచ్చితంగా మీ బ్లడ్ ప్రెజర్ లెవెల్స్ ను.. మానిటర్ చేయాలి. డెలివరీ అయ్యేంతవరకు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. బ్లడ్ ప్రెజర్ ని కంట్రోల్ చేయడం వల్ల హెల్తీ ప్రెగ్నన్సీ, హెల్తీ బేబీని పొందుతారు. మరి ప్రెగ్నన్సీ టైంలో హైబ్లడ్ ప్రెజర్ కంట్రోల్ చేసే ఎఫెక్టివ్ హోం రెమిడీస్ తెలుసుకుందాం..

ఉప్పు

హైబ్లడ్ ప్రెజర్ ఉన్నప్పుడు ఉప్పును పూర్తీగా మానేయాలి. ఎక్కువ మోతాదులో ఉప్పు తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెజర్ తో పాటు, గుండె వ్యాధులు, స్ట్రోక్ సమస్యల ముప్పు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రెగ్నంట్స్ తినే ఆహారంలో ఉప్పు కలపకుండా.. కొన్ని స్పైసెస్ వాడితే టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్డ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, డ్రింక్స్ కి దూరంగా ఉండాలి.

బ్రీతింగ్

ఒత్తిడి తగ్గించుకోవడానికి బ్రీతింగ్ టెక్నిక్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. రిలాక్స్ గా ఉండటం వల్ల.. బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ అవుతుంది. రోజుకి 2లేదా3 సార్లు.. 10 నిమిషాల పాటు.. డీప్ బ్రీతింగ్ టెక్నిక్స్ ప్రాక్టీస్ చేయాలి.

వాకింగ్

యాక్టివ్ గా లేకపోతే.. ప్రెగ్నన్సీ టైంలో.. హైపర్ టెన్షన్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. వాకింగ్ వల్ల గర్భిణీల్లో గుండె సంబంధిత వ్యాధులు దూరంగా ఉంటాయి. హైబ్లడ్ ప్రెజర్ కంట్రోల్ అవుతుంది. 30 నుంచి 45 నిమిషాలు రోజుకి నడవాలి.

పొటాషియం తీసుకోవాలి

ప్రెగ్నన్సీ టైంలో పొటాషియం చాలా ముఖ్యమైనది. ఇది ఫ్లూయిడ్, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ చేయడానికి సహాయపడుతుంది. అలాగే పొటాషియం ఎక్కువగా తీసుకోవడం వల్ల గర్భధారణ సమయంలో హైబ్లడ్ ప్రెజర్ కంట్రోల్ అవుతుంది. కాబట్టి పొటాషియం ఎక్కువగా ఉండే.. బంగాళాదుంపలు, టమోటాలు, ఆరంజ్ జ్యూస్, అరటిపండ్లు, కిడ్నీ బీన్స్ వంటివి డైట్ లో చేర్చుకోవాలి.

మెగ్నీషియం ఫుడ్స్

మెగ్నీషియం ఎక్కువగా లభించే ఆహారాలు డైట్ లో చేర్చుకుంటే.. హైబ్లడ్ ప్రెజర్ కంట్రోల్ అవుతుంది. ఇవి బ్లడ్ ప్రెజర్ ని కంట్రోల్ చేయడమే కాకుండా.. ప్రీమెర్చూర్ అవకుండా కాపాడుతుంది. మెగ్నీషియం ఎక్కువగా లభించే ఆల్మండ్స్, అవకాడో, అరటిపండ్లు, బీన్స్, గుమ్మడి విత్తనాలు, సోయా పాలు, బంగాళాదుంపలు, ఆకుకూరలు తీసుకోవాలి.

బరువు

ప్రెగ్నన్సీ టైంలో బరువు సాధారణంగా ఉండేలా జాగ్రత్తపడాలి. అధిక బరువు ఉన్నారంటే హెచ్చరిక సంకేతంగా భావించాలి. గర్భధారణ మొదటిదశలోనే.. అధిక బరువు.. హైపర్ టెన్షన్ రిస్క్ పెంచుతుంది. అలాగే వెన్నునొప్పి, కాళ్ల నొప్పులు, కాన్ట్సిపేషన్, డయాబెటిస్ రిస్క్ లను పెంచుతుంది.

మ్యూజిక్ వినడం

రోజుకి రెండు మూడు సార్లు అరగంట పాటు మ్యూజిక్ వినడం వల్ల హైబ్లడ్ ప్రెజర్ ని తేలికగా తగ్గించవచ్చు. అలాగే ఒత్తిడి, ఆందోళనను కూడా తగ్గించుకోవచ్చు. ఇవన్నీ ప్రెగ్నన్సీ టైంలో తల్లి, కడుపులోని బిడ్డ ఇద్దరికీ.. మంచిది కాదు.

English summary

How to Lower Your High Blood Pressure During Pregnancy

How to Lower Your High Blood Pressure During Pregnancy. High blood pressure and pregnancy isn’t necessarily a dangerous combination.
Please Wait while comments are loading...
Subscribe Newsletter