గర్భస్రావం తర్వాత ప్రమాదరహిత ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవడానికి సింపుల్ టిప్స్

గర్భస్రావం జరిగాకా మీలో ఒక విధమైన భయం ఏర్పడిపోతుంది,ఒక్కోసారి వరుస గర్భస్రావాల వల్ల అసలు గర్భధారణకే మీరు మొగ్గుచూపకపోవచ్చు లేదా అసలు పిల్లలే వద్దనుకోవచ్చు.పీడకలలాంటి గర్భస్రావం తరువాత మానసికంగా మరియూ

Subscribe to Boldsky

గర్భస్రావం గర్భవతులకి ఒక పీడకల. ఇది వారి జీవితంలో అల్లకల్లోలాన్ని సృష్టిస్తుంది. దాదాపు 40% మంది స్త్రీలలో గర్భస్రావం అవుతుంది ఒక్కోసారి తాము గర్భం ధరించాము అని తెలుసుకునేలోపే గర్భస్రావం అయ్యే అవకాశం కూడా ఉంటుంది.

గర్భస్రావం జరిగాకా మీలో ఒక విధమైన భయం ఏర్పడిపోతుంది,ఒక్కోసారి వరుస గర్భస్రావాల వల్ల అసలు గర్భధారణకే మీరు మొగ్గుచూపకపోవచ్చు లేదా అసలు పిల్లలే వద్దనుకోవచ్చు.పీడకలలాంటి గర్భస్రావం తరువాత మానసికంగా మరియూ శారీరకంగా కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది.ఒకవేళ మీరు కనుక ఆ దశని నిబ్బరంగా, సహనంతో ఎదుర్కొని దాటివచ్చినవారయితే కనుక మీ ఓపిక అసమానమైనది.

ఆ బాధాకరమైన దశని దాటాకా మీరు కాస్త రిలాక్స్ అయ్యి సంతోషంగా ఉంటారు.అప్పుడే మరలా గర్భం ధరించాలనే ఆలోచనలు కూడా మీలో రూపుదిద్దుకుంటూ ఉండవచ్చు కూడా.గర్భస్రావం తరువాత మరల గర్భం ధరించాలని కనుక మీరు అనుకుంటే దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో క్రింద ఇచ్చాము చూడండి.

గర్భ ధారణకి ముందు పరీక్ష చేయించుకోండి:

మీకు కనుక రెండు ఎలదా అంతకు మించి గర్భస్రావాలయినట్లయితే మరలా గర్భం ధరించే ముందు మీ డాక్టరుతో ఒకసారి మాట్లాడండి.ఒక్కోసారి ఈ గర్భస్రావాలు జన్యుపరంగా సంక్రమించవచ్చు లేదా గర్భాశయం యొక్క గోడ నిర్మాణ శైలిలోని లోపాల వల్ల కూడా గర్భస్రావం జరుగవచ్చు.చాలా మంది స్త్రీలు ప్రొజెస్టీరోన్ థెరపీ ద్వారా గర్భస్రావాలని నిరోధించుకుంటున్నారు.

గర్భం ధరించినప్పుడు వచ్చే రిస్కు గురించి అవగాహన ఏర్పరచుకోండి:

ఒక వేళ మీ వయసు కనుక 35 సంవత్సరాలు దాటినా లేదా మీకు ధూమపానం అలవాటు ఉన్నా లేదా ఇతర ఆరోగ్య సమస్యలుంటే మీరు గర్భం ధరించే అవకాశం తక్కువ లేదా మీకు గర్భస్రావం అయ్యే అవకాశాలెక్కువ.

 

గర్భం ధరించినప్పుడు వచ్చే రిస్కు గురించి అవగాహన ఏర్పరచుకోండి:

ఒక వేళ మీ వయసు కనుక 35 సంవత్సరాలు దాటినా లేదా మీకు ధూమపానం అలవాటు ఉన్నా లేదా ఇతర ఆరోగ్య సమస్యలుంటే మీరు గర్భం ధరించే అవకాశం తక్కువ లేదా మీకు గర్భస్రావం అయ్యే అవకాశాలెక్కువ.

మీ భావోద్వేగాల గురించి తెలుసుకోండి:

ఒక వేళ మీకు ఇదివరకే రెండు లేదా అంతకుమించి గర్భస్రావాలయితే మీకు నెర్వస్‌గా ఉంటుంది లేదా మీరు అతి జాగ్రత్తతో ఉంటారు. ఇలాంటి స్థితిలో మరలా గర్భం ధరించాలనుకున్నప్పుడు మీలో మంచి మరియూ చెడు ఆలోచనలు రెండూ ఉండటంలో ఆశ్చర్యం లేదు.ఏది ఏమైనా మీ భావాలని మీ భర్తతో మరియూ డాక్టరుతో పంచుకోవడం మాత్రం ముఖ్యం.

మీ గురించి మీరు జాగ్రత్త తీసుకోవడం చాలా ముఖ్యం:


గర్భస్రావం తరువాత మీ గురించి మీరు జాగ్రత్త తీసుకుంటేనే ఆ తరువాత గర్భ ధారణ సుఖవంతమవుతుంది.మీకు కనుక దుఃఖంగా అనిపిస్తే మీ డాక్టరుతో పంచుకోండి.గర్భస్రావాన్ని తట్టుకోవాల్సొచ్చినప్పుడు ఇతరుల సహాయం తీసుకోవడంలో తప్పులేదు అని గుర్తు పెట్టుకోండి.

ఒక అధ్యయనం ప్రకారం గర్భస్రావమయ్యాకా సైకలాజికల్ కౌన్సెల్లింగుకి వెళ్ళిన స్త్రీలు కౌన్సెలింగుకి వెళ్ళని స్త్రీల కంటే ఆ తరువాత గర్భం దాల్చినప్పుడు గతానుభవాలని సులభంగానే ఎదుర్కోగలిగారు, దీని ఫలితంగా వారి గర్భధారణ సుఖవంతమయ్యింది.

 

ఆశ వదులుకోకండి:


అధ్యయనాల ప్రకారం ఒకటి లేదా అంత కంటే ఎక్కువ గర్భస్రావాలయినా కూడా చాలా మంది మరలా గర్భం ధరించి సఫలీకృతులయ్యారు.అందువల్ల మీరు గర్భస్రావం తరువాత మరలా గర్భాన్ని ప్లాన్ చేసుకునేటప్పుడు ఎప్పుడూ కూడా ఆశని వదులుకోవద్దు.

ఏ అంటువ్యాధులకైనా వైద్యం తీసుకోండి:

గర్భస్రావం తరువాత జరిగే గర్భధారణ ఫలవంతమవ్వాలంటే అనేక రకాల అంటు వ్యాధులైన లిస్టీరియా, వజైనల్ ఇన్ ఫెక్షన్,పర్వోవైరస్, ఎస్టీఐ తదితర వ్యాదులున్నాయేమో ఒకసారి పరీక్ష చేయించుకోవడం ముఖ్యం.ఇలా పరీక్షలు చేయించుకోవడం ద్వారా మీ గర్భధారణ ప్రమాదరహితంగా మరియూ ఆరోగ్యంగా ఉంటుంది.

సమతుల మరియూ పోషకాహారం తీసుకోండి:

గర్భస్రావం మరలా అవ్వకుండా నిరోధించాలనుకుంటే సమతుల మరియూ పోషకాహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం.పళ్ళు, కూరగాయలు, గింజలు,పాల ఉత్పత్తులు,ప్రొటీన్ అధికంగా ఉన్న ఆహారాన్ని తప్పక తీసుకోవాలి. ఇక ఆలశ్యమెందుకు, ధైర్యాన్ని ప్రోగు చేసుకుని పైన చెప్పిన జాగ్రత్తలు పాటించి మరలా గర్భం ధరిస్తే తప్పక సఫలీకృతులవుతారు.

English summary

How To Plan A Safe Pregnancy After A Miscarriage

How To Plan A Safe Pregnancy After A Miscarriage,Miscarriage is one of the most ugliest and traumatic episodes in pregnancy, which can create a mayhem in a would-be-mother’s life. About 40% of the women go through a miscarriage and, sometimes, it happens even before you understand that you are pregnant.
Story first published: Monday, November 28, 2016, 10:07 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter