For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీలకు వాంతులను నివారించే జింజర్ రెమెడీస్ ...

By Super
|

గర్భవతులందరకు ఉమ్మడి సమస్య ఉదయంవేళ వాంతులు, వికారాలు. ఇవి 4వ వారంనుండి మొదలై షుమారుగా 14 నుండి 16వ వారం వరకు కొనసాగుతాయి. కొంతమందికి గర్భవతి దశ అంతా కూడా ఈ సమస్య వుంటుంది. వికారం, వాంతులు కొద్దిగా అవుతూంటాయి. వేవిళ్ళు ఎందుకు వస్తాయి? గర్భం ధరించినపుడు ఆమెలో వచ్చే హార్మోన్ల మార్పుల కారణంగా వస్తాయి. హెచ్ సిజి అనే హార్మోన్ ఈ వికారం కలిగిస్తుంది. దీనిని హ్యూమన్ గొనడోట్రోపిన్ హార్మోన్ అని పిలుస్తారు. ఇది రిలీజ్ అయితే వికారం కలుగుతుంది.

అండాశయం ఈస్ట్రోజన్ విడుదల చేస్తుంది. ప్రొజెస్టిరోన్ హార్మోన్ గర్భవతిలో గర్భాశయంలోని కండరాల సడలింపుకు సహకరిస్తుంది. ఇది బేబీ ఎదురుదల మరియు పుటుకలకు తేలికగా వుంటుంది. అదే సమయంలో ఆమె పొట్ట మరియు పేగులను కూడా రిలాక్స్ చేసి అధిక జీర్ణ ఆమ్ల రసాలను ఉత్పత్తి చేసి గుండె మంట వంటివి కలిగిస్తుంది. ప్లాసెంటా ద్వారా ఎనర్జీ పోయినపుడు లో బ్లడ్ షుగర్ స్ధాయి అంటే హైపోగ్లైసీమియా ఏర్పడుతుంది. ఇది కూడా ఆమెలో వికారం కలిగిస్తుంది.

How To Use Ginger For Morning Sickness In Pregnancy

గర్భిణీల్లో విడుదలయ్యే కొన్ని రకాల స్టొమక్ యాసిడ్స్ వల్ల జీర్ణవ్యవస్థలో మార్పులు చోటు చేసుకుంటాయి. దాని వల్ల వారిలో మార్నింగ్ సిక్ నెస్ కు దారితీస్తుంది. మరి దీన్ని నివారించడానికి కొన్ని నేచురల్ రెమెడీస్ గ్రేట్ గా సహాయపడుతాయి. వాటిలో అల్లం గ్రేట్ గా సహాయపడుతుంది. మరి అదెలా సహాయపడుతుందో చూద్దాం....

అల్లం, నిమ్మ, తేనె మరియు పుదీనా : ఈ నాలిగింటిని సమయంగా తీసుకొని మిక్స్ చేయాలి. అల్లం పౌడర్ తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని నీళ్ళలో మిక్స్ చేసి రోజుకు రెండు సార్లు త్రాగుతుంటే మార్నింగ్ సిక్ నెస్ ను మంచి రిలీఫ్ ఉంటుంది.

అల్లం టీ: : మార్నింగ్ సిక్ నెస్ కు చెక్ పెట్టడానికి అల్లం టీ గ్రేట్ గా సహాయపడుతుంది . ఈ టీలో ఉండే విటమిన్స్ వికారానికి విరుగుడుగా పనిచేస్తుంది. మార్నింగ్ సిక్ నెస్ నుండి ఉపశమనం కలిగిస్తుంది.

How To Use Ginger For Morning Sickness In Pregnancy

అల్లం టీ విత్ జింజర్ రూట్: అల్లం వేర్లతో తయారుచేసే టీలో యాంటీ ఆక్సిడెంట్స్ గ్రేట్ గా ఉంటాయి. ఇవి ఆందోలనను మరియు స్ట్రెస్ లెవల్స్ తగ్గిస్తాయి . జింజర్ రూట్ దంచి నీటిలో వేసి మిక్స్ చేసి మరిగించి అందులో తేనె నిమ్మరసం మిక్స్ చేసి త్రాగడం వల్ల మార్నింగ్ సిక్ నెస్ ను నివారించుకోవచ్చు.

అల్లం ఆకు: గ్యాస్ట్రో ఇన్ టెన్సినల్ ట్రాక్ ను నయం చేయడానికి , స్మూత్ చేయడానికి ఇది గ్రేట్ గా సహాయపడుతుంది మరియు ఇది మార్నింగ్ సిక్ నెస్ ను నివారిస్తుంది . అయితే దీన్ని ఎక్కువగా తీసుకోకూడదు. ఇందులో షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉంటాయి.

అల్లం క్యారెట్ సూప్: ఈ రెండింటి కాంబినేషన్ గ్రేట్ గా పనిచేస్తుంది. క్యారెట్ సూప్ కు కొద్దిగా అల్లం పౌడర్ మిక్స్ చేసి ప్రతి రోజూ ఉదయం త్రాగాలి . ఇది రెగ్యులర్ గా త్రాగడం వల్ల మార్నింగ్ సిక్ నెస్ తగ్గిస్తుంది.

English summary

How To Use Ginger For Morning Sickness In Pregnancy

Morning sickness or nausea is one of the most common symptoms that a woman faces in her pregnancy. It is most commonly seen in the first trimester of pregnancy. During pregnancy, the body produces a hormone known as HCG (human chorionic gonadotropin) that is responsible for inducing nausea-related feelings, which causes morning sickness.
Story first published: Friday, February 19, 2016, 13:19 [IST]
Desktop Bottom Promotion