గర్భిణీ మహిళలు పల్లీ తినడం వల్ల పొందే అద్భుత ప్రయోజనాలు..!!

Subscribe to Boldsky

పీనట్స్ నే వేరుశెనగలు, లేదా పల్లీలు అని పిలుస్తారు, వేరుశెగ విత్తనాలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చనే విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయితే కొంత మందిలో అలర్జీకి కారణమవుతుంది. సాధారణ వ్యక్తుల్లోనే కాదు, గర్భిణీల్లో కూడా అలర్జీ రియాక్షన్ ఇస్తుందనే అపోహ చాలా మందిలో ఉంది. అలాగనే మీకు ఇష్టమైన పీనట్స్ తినడం మానేస్తారా..?గర్భిణీలు పీనట్స్ తినడం సురక్షితమేనా ? తెలుసుకుందాం..

గర్భిణీల రెగ్యులర్ డైట్ లో పీనట్స్ చేర్చుకోవడానికి భయపడుతుంటే, మీ భయాన్ని పోగొట్టడానికి ఇదే మంచి సమయం, ఇది కేవలం అపోహ మాత్రమే. గర్భిణీలు పల్లీలు తినడం వల్ల ఎలాంటి హాని జరగదు, ఏదైనా సరే పరిమితంగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. గర్భిణీలు ఎలాంటి సమయంలో పల్లీలు తినొచ్చే, ఎలాంటి సమయంలో తినకూడదన్న విషయం కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం.

పల్లీలు అలర్జిక్ రియాక్షన్ కలిగిస్తాయా?

వెస్ట్ ,ముఖ్యంగా యూస్ కంట్రీస్ లో పీనట్స్ అలర్జీ కలిగించడం చాలా సహజం. ముఖ్యంగా అలర్జీకి మరియు ఫుడ్ ఇంటాలరెన్స్ కు మద్య వ్యత్యాసాన్ని కనుక్కోవాలి. గర్భిణీలకు పీనట్స్ తినడం వల్ల అలర్జీ కలుగుతుందన్నది అపోహ మాత్రమే. పీనట్ ఇంటోలర్స్ మాత్రమే కాబట్టి, దీనికి భయపడాల్సిన అవసరం లేదు. పల్లీలు తింటే కొన్ని సాధారణ లక్షణాలు చర్మం దురద, సన్నని వైట్ పింపుల్స్, చర్మ రెడ్ గా మారడం, డయోరియా, వికారం , వాంతులు లక్షణాలు సహజంగా కనబడుతాయి.

ఈ లక్షణాలు కాకుండా, పీనట్ ఇంటారెన్స్ వల్ల అజీర్తి చేస్తుంది, మోషన్ అవుతాయి. అయితే గర్భిణీల్లో కూడా ఇటువంటి అపోహాలు చాలా మందిలో ఉన్నాయి, ఎవరికైనా సరే పరిమితంగా తీసుకోవడం వల్ల ఎలాంటి హాని ఉండదు. గర్భిణీలు కూడా అంతే పీనట్స్ పరిమితంగా తింటే ఆరోగ్యానికి మంచిది, రీసెంట్ గా డ్యానిష్, నేషనల్ బర్త్ చారెట్ వారు జరిపిన పరిశోధనల్లో గర్భిణీలు పీనట్స్ తినడం వల్ల పుట్టబోయే బిడ్డలో ఎలాంటి అలర్జిక్ రియాక్షన్ ఉండదని నిర్ధారించారు. మరి అలర్జీ అనేది అపోహమాత్రమే అని తెలిసిపోయింది కాదా....గర్బిణీలు పల్లీలు తినడం వల్ల పొందే కొన్ని ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..

1.మలబద్దం నివారిస్తుంది:

గర్భిణీలు తరచూ మలబద్దకంతో బాధపడుతుంటారు, వీరు ఫైబర్ అధికంగా ఉండే పీనట్స్ ను రెగ్యులర్ డైట్ లో పరిమితంగా తీసుకోవడం వల్ల మలబద్దక లక్షణాలు కూడా కనబడవు.

2. అనీమియా నివారిస్తుంది:

పల్లీలతో అన్ని రకాల నట్స్ లో ఐరన్ కంటెంట్ అధికంగా ఉంటుంది.కాబట్టి, గర్బధారణ సమయంలో వీటిని తినడం ఆరోగ్యానికి మంచిది, అనీమియాను నివారిస్తుంది.

3. వెజిటేరియన్స్ కు ఫర్ఫెక్ట్ ఫుడ్:

పీనట్స్ లో ప్రోటీన్లు అత్యధికంగా ఉంటాయి. కాబట్టి, వెజిటేరియన్స్ కు ఫర్ఫెక్ట్ ఫుడ్ , మాంసాహారం, గుడ్డుకు ప్రత్యామ్నాయంగా హైప్రోటీన్ పీనట్స్ ను తీసుకోవడం మంచిది.

4. బోన్స్ స్ట్రాంగ్ గా ఉంచుతుంది:

పుట్టబోయే బిడ్డలో మరియు తల్లిలో కూడా ఎముకలు స్ట్రాంగ్ గా ఉంచుతుంది. పల్లీలలో ఉండే మెగ్నీషిం బోన్స్ స్ట్రాంగ్ గా , హెల్తీగా మార్చుతుంది.

5. ప్రీక్లామ్సియా నివారిస్తుంది:

గర్భిణీల్లో హైబ్లడ్ ప్రెజర్ సాధారణ సమస్య , ఈ సమస్యను నివారించుకోవడాని, పీనట్స్ గొప్పగా సహాయపడతాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ నట్స్ లో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. ఇది బ్లడ్ ప్రెజర్ ను అండర్ కంట్రోల్లో ఉంచుతుంది.

6. జెస్టేషనల్ డయాబెటిస్ ను కంట్రోల్లో ఉంచుతుంది:

పీనట్స్ ను మితంగా తీసుకోవడం వల్ల గర్భిణీల్లో జస్టేషనల్ డయాబెటిస్ వచ్చే అవకాశాలుండవు, పీనట్ బటర్ ను జస్టేషనల్ డయాబెటిస్ డైట్ లో చేర్చుకోవడం మంచిది.

7.బరువు పెంచుతుంది:

గర్భధారణ సమయంలో బరువు పెరగడం చాలా అవసరం, బరువు పెరగకపోతే, రోజూ 5,6 పల్లీలు తినడం వల్ల క్రమంగా బరుతు పెరుగుతారు. క్యాలరీలు అధికంగా ఉండటం వల్ల బరువు పెరగడానికి సహాయపడుతాయి.

English summary

Is It Safe To Eat Peanut During Pregnancy

As incidents of peanut allergy rise in the west, a number of myths are floating around. One such myth says that a pregnant woman should not eat peanuts, in any of its forms. Does that mean you have to fore go your favorite peanut butter sandwich?
Please Wait while comments are loading...
Subscribe Newsletter