గర్భిణీలు స్ట్రాబెర్రీ ఫ్రూట్స్ తినడం వల్ల పొందే అద్భుత ప్రయోజనాలు ..!

స్ట్రాబెర్రీలు ఫ్రెష్ అయినా, ఫ్రోజోన్ అయినా గర్భిణీలు మాత్రం రోజుకు ఒకటి లేదా రెండు మాత్రమే తీసుకోవాలి. ఈ జ్యూసీ ఫ్రూట్ లో అనేక పోషకాలున్నాయి. ఇవి వివిధ రకాలుగా సహాయపడుతాయి. అదెలాగో తెలుసుకుందాం..

Posted By:
Subscribe to Boldsky

సాధారణంగా ప్రెగ్నెన్సీ సమయం ఆహారాల మీద ఎక్కువగా కోరికలు కలిగి ఉంటారు. ఒక్కోసారి ఇంతకు మునుపు ఇష్టం లేని ఆహారాల మీద కూడా కోరకలు కలగడం గర్భిణీల్లో సహజం. అలాంటి వారిలో మీరు కూడా ఒకరైతే, మీలో కూడా స్వీట్స్, షుగర్ ఫుడ్స్ తినాలనే కోరికలు ఎక్కువగా ఉన్నట్లైతే అలాంటి వారికోసం స్ట్రా బెర్రీస్ ఫ్రూట్ గ్రేట్ గా కోరికను తీర్చుతాయి. ఈ జ్యూస్ ఫ్రూట్ నోరూరిస్తూ మంచి ఫ్లేవర్ తో ఉండటమే కాదు, రుచి కూడా అద్భుతంగా ఉంటుంది.

అయితే గర్భిణీలు స్ట్రాబెర్రీలు తినొచ్చా లేదా అన్న అపోహ మాత్రం చాలా మందిలో ఉంటుంది. అలాటి వారికోసమే ఈ ప్రత్యేమైన కథనం. గర్భిణీలు స్ట్రాబెర్రీస్ ను నిరభ్యరంతరంగా తినవచ్చు. ఈ జ్యూసీ ఫ్రూట్ లో ఆరోగ్య ప్రయోజనాలు అధికంగా ఉన్నాయి. అంతే కాదు, గర్భిణీలకు కూడా తినడం వల్ల ప్రయోజనాలను పొందుతారని పరిశోధనల ద్వారా నిరూపింపబడినది.

గర్భిణీలు స్ట్రాబెర్రీలు తినడం వల్ల పుట్టబోయే బిడ్డకు, తల్లికి కూడా అవసరమయ్యే ఫోలిక్ యాసిడ్ అందుతుంది. ముఖ్యంగా బేబీకి రక్షణ కల్పించే నేచురల్ ట్యూబ్ డిఫెక్ట్స్ ను నివారించడంలో ఈ స్ట్రాబెర్రీలు గ్రేట్ గా సహాయపడుతాయి. ఫోలిక్ యాసిడ్ డైట్ ను తీసుకోవడం వల్ల ప్రీమెజ్యుర్ బర్త్ ను తగ్గిస్తుంది. ఇతర అనారోగ్య సమస్యలను నివారిస్తుంది. స్ట్రాబెర్రీలో ఫోలిక్ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి.

స్ట్రాబెర్రీలు ఫ్రెష్ అయినా, ఫ్రోజోన్ అయినా గర్భిణీలు మాత్రం రోజుకు ఒకటి లేదా రెండు మాత్రమే తీసుకోవాలి. ఈ జ్యూసీ ఫ్రూట్ లో అనేక పోషకాలున్నాయి. ఇవి వివిధ రకాలుగా సహాయపడుతాయి. అదెలాగో తెలుసుకుందాం..

ఏజింగ్ ప్రొసెస్ ను ఆలస్యం చేస్తాయి

స్ట్రాబెర్రీస్ లో విటిమన్ సి అత్యధికంగా ఉంటుంది. ఇది అద్భుతమైన యాంటీఆక్సిడెంట్ . ఇవి యాంటీ ఏజింగ్ గా పనిచేస్తాయి. వ్రుద్యాప్య లక్షణాలను దూరం చేస్తాయి. ఫ్రీరాడికల్స్ ను నివారిస్తాయి .

వ్యాధినిరోధక శక్తిని పెంచడానికి

స్ట్రాబెర్రీస్ లో ఉండే విటమిన్ సి కంటెంట్ వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతాయి. అలాగే అనేక ఆరోగ్య సమస్యలను నివారించడంలో కూడా సహాయపడుతుంది.

కళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

స్ట్రాబెర్రీలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల తల్లిలో మాత్రమే కాదు, బిడ్డకు కూడా కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పుట్టే బిడ్డలో కాంట్రాక్ట్స్ లోపాలు, ద్రుష్టిలోపం లేకుండా నివారిస్తుంది. స్ట్రాబెర్రీస్ లో ఉండే విటమిన్ సి కళ్ళలో కార్నియా, రెటీనాను స్ట్రాంగ్ గా మార్చుతుంది.

క్యాన్సర్ కు వ్యతిరేఖంగా పోరాడుతుంది

స్ట్రాబెర్రీస్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల క్యాన్సర్ కు వ్యతిరేఖంగా పోరాడుతుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ ఫ్రీరాడికల్స్ ను న్యూట్రలైజ్ చేస్తుంది.

జీర్ణశక్తిని పెంచుతుంది.

స్ట్రాబెర్రీలను ఫ్రూట్ సలాడ్ రూపంలో తీసుకోవడం వల్ల చాలా తేలికగా జీర్ణమవుతుంది . జీర్ణశక్తిని పెంచుతుంది.

ఇన్ స్టాంట్ ఎనర్జీ పొందుతారు.

హెల్తీ స్ట్రాబెర్రీ స్మూతీ, మిల్క్ షేక్స్ రూపంలో తీసుకోవడం వల్ల , సెరెల్స్ తో కలిపి బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోవడం వల్ల ఇన్ స్టాంట్ ఎనర్జీ పొందుతారు.

బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గిస్తుంది.

రెగ్యులర్ డైట్ లో స్ట్రాబెర్రీలు చేర్చుకోవడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గిస్తుంది. దాంతో హార్ట్ హెల్త్ మెరుగుపడుతుంది.

English summary

Is It Safe To Eat Strawberry During Pregnancy?

Is It Safe To Eat Strawberry During Pregnancy?,Whether fresh or frozen, strawberries are known to be having not just one or two, but lots of health benefits. These juicy fruits are packed with many nutrients that work in improving health in several ways.
Please Wait while comments are loading...
Subscribe Newsletter