గర్భిణీలు మెటర్నిటి బెల్ట్ ఉపయోగించడం మంచిదేనా..? దీన్ని ఉపయోగించడానికి 6 రీజన్స్ !

Subscribe to Boldsky

ప్రసూతి బెల్ట్ అనేది గర్భధారణ సమయంలో పొట్ట మరియు నడుము భాగంనకు సపోర్ట్ ఇస్తుంది. ఉబ్బిన కండరాలు సాధారణ స్థితికి రావటానికి ప్రసవం అయ్యాక బెల్ట్ ని ధరించవచ్చు.

ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ఈ సరళమైన బ్యాండ్ రెండవ మరియు మూడవ త్రైమాసిక సమయంలో ఉపయోగకరంగా ఉంటుంది.

ఇక్కడ గర్భధారణ సమయంలో ప్రసూతి బెల్ట్ ఉపయోగించటానికి గల 6 కారణాలు ఉన్నాయి. గర్భధారణ సమయం మరియు డెలివరీ అయ్యిన తర్వాత కూడా బెల్ట్ ని ఉపయోగించవచ్చు.

గర్భధారణ సమయంలో మరియు తరువాత ప్రసూతి బెల్ట్ ని ఉపయోగిస్తే కలిగే విభిన్నమైన ప్రయోజనాలను చదవండి.

గర్భినీలు మెటర్నిటి బెల్ట్ వేసుకోవడానికి 6 రీజన్స్

1. నొప్పి తగ్గుతుంది
గర్భధారణ సమయంలో నడుము నొప్పి,జాయింట్ నొప్పుల కారణంగా రోజు రోజుకి తమ పనులను చేసుకోవటం కష్టం అయ్యిపోతుంది. ఈ బెల్ట్ ధరించటం వలన పొట్టకు,నడుముకు సపోర్ట్ లభిస్తుంది. తద్వారా నొప్పులు తగ్గుతాయి.

సాధారణంగా గర్భధారణ సమయంలో గుండ్రటి స్నాయువు నొప్పి ఉండవచ్చు. ఇది రెండవ త్రైమాసిక సమయంలో హిప్ ముందు మరియు బొడ్డు క్రింద వస్తుంది. ఈ నొప్పి కారణంగా పెరుగుతున్న గర్భాశయం యొక్క స్నాయువుల మీద అదనపు భారం పడుతుంది. ఈ బెల్ట్ జాయింట్ స్నాయువుల ఒత్తిడి తగ్గించడం మరియు బిడ్డ బరువు పంపిణీకి సహాయం చేస్తుంది.

గర్భధారణ సమయంలో రిలాక్సిన్ హార్మోన్ యొక్క పెరుగుదల మరియు హిప్ కీళ్ళను వదులుగా చేయటం వలన సక్రోఇలియాక్ కీళ్ళ నొప్పి వచ్చే అవకాశం ఉంది. కొన్ని సార్లు ఈ నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. బెల్ట్ ధరించటం వలన ఈ నొప్పి తగ్గటమే కాకుండా జాయింట్ కి సపోర్ట్ ఇస్తుంది.

గర్భినీలు మెటర్నిటి బెల్ట్ వేసుకోవడానికి 6 రీజన్స్

2. మంద్రస్థాయిలోకంప్రెషన్
మీరు మీ శిశువు సాధారణ కార్యకలాపాల సమయంలో ఒక సున్నితమైన కంప్రెషన్ ఇస్తే అది గర్భాశయం మద్దతు మరియు కదలికల సమయంలో అసౌకర్యంను తగ్గిస్తుంది. ఉదరం రక్త ప్రసరణ అంతరాయం కలిగించడానికి కంప్రెషన్ ని టైట్ గా పెట్టుకోకూడదు.

గర్భినీలు మెటర్నిటి బెల్ట్ వేసుకోవడానికి 6 రీజన్స్

3. మీరు మీ రోజువారీ కార్యక్రమాలలో పాల్గొనటానికి సహాయం చేస్తుంది
గర్భధారణ సమయంలో సాధారణ కదలికలు, రక్తపోటు, నిస్పృహ మరియు మధుమేహం వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. కానీ భౌతిక నొప్పి మరియు అసౌకర్యం వంటివి రోజువారీ కార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తాయి. ఈ బెల్ట్ ధరించటం వలన అసౌకర్యం తగ్గించి భౌతిక కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనటానికి సహాయం చేస్తుంది.

గర్భినీలు మెటర్నిటి బెల్ట్ వేసుకోవడానికి 6 రీజన్స్

4. హెర్నియా ఉన్నవారికి సహాయపడుతుంది
ఈ బెల్ట్ గర్భధారణ సమయంలో హెర్నియా కలిగిన మహిళలకు సహాయపడుతుంది.

గర్భినీలు మెటర్నిటి బెల్ట్ వేసుకోవడానికి 6 రీజన్స్

5.శరీరం యొక్క భంగిమకు సహాయపడుతుంది
ఈ బెల్ట్ ని సరిగ్గా ఉపయోగిస్తే నడుము మద్దతు ఇచ్చి శరీరం యొక్క భంగిమ సౌకర్యానికి సహాయపడుతుంది. అలాగే నడుము భాగంలో ఒత్తిడి పడకుండా ఉంటుంది. సాధారణంగా గర్భధారణ సమయంలో అదనపు బరువు వెన్నుముక మీద పడుతుంది. బెల్ట్ పెట్టుకోవటం వలన వెన్నెముక మద్దతు కండరాలు స్ట్రెచ్ అవుతాయి.

గర్భినీలు మెటర్నిటి బెల్ట్ వేసుకోవడానికి 6 రీజన్స్

6. డెలివరీ తర్వాత ప్రయోజనాలు
మీ శరీర కండరాలు మరియు స్నాయువులు డెలివరీ తర్వాత వదులుగా ఉంటాయి. అవి సెట్ కావటానికి సమయం పడుతుంది. అలాగే మీ శిశువును చూసుకోవలసిన భాద్యత ఉంది. ఈ దశలో ఒక బొడ్డు బ్యాండ్ ధరించటం వలన వారి ఉదర కండరాలు టైట్ గా ఉండి కొత్త తల్లులకు మరింత సౌకర్యవంతముగా ఉంటుంది.

ఈ బెల్ట్ గర్భధారణ సమయంలో మరియు ఆ తర్వాత బాహ్య సమస్యల కోసం మాత్రమే సహాయపడుతుంది. ఈ బెల్ట్ మీద ఎక్కువగా ఆధారపడటం కూడా మంచిది కాదు. గర్భం సమయంలో మరియు తర్వాత ప్రసూతి బెల్ట్ ధరించటతో పాటు చిన్న చిన్న వ్యాయామాలు కూడా చేయాలి. ప్రసూతి బెల్ట్ ధరించటానికి ముందు తప్పనిసరిగా ఒక వైద్యుడు/ ఫిజియోథెరపిస్ట్ ని సంప్రదించాలి.

English summary

Is Maternity Belt Good To Use During Pregnancy?

Here are six benefits that maternity belt offers for pregnant women. Hence, it is a must use product during and even after pregnancy. Read the different benefits of a maternity belt when used during and after pregnancy
Story first published: Friday, November 18, 2016, 10:50 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter