గర్భధారణ సమయంలో గర్భిణీ బరువు పెరగడానికి గల కారణాలు..!

Subscribe to Boldsky

సాధరణంగా మహిళలు గర్భం పొందిన తర్వాత బరువు పెరుగుతారు. అందుకు కారణం కొన్ని నేచురల్ గా ఉంటే, మరికొన్ని మెడికల్ పరంగా బరువు పెరుగుతారు . అలాగే పొట్టలో పెరిగే బేబీ వల్ల కూడా బరువు పెరుగుతారు. బ్లడ్ వాల్యూమ్ పెరుగుతుంది, యూట్రస్ పెరుగుట వల్ల, ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ వల్ల (ఫీటస్ కు రక్షణ కల్పించే ద్రవం) బరువు పెరుగుతారు.

ఇవే కాకుండా నార్మల్ గా బరువు పెరగడానికి కొంత మంది మహిళలు గర్భం పొందిన తర్వాత బరువు పెరగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు.

గర్భధారణ సమయంలో బరువు పెరిగారనడానికి కొన్ని లక్షణాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి, మేము చెప్పే విధంగా జీవన శౌైలిలో మార్పులు చేసుకుంటే ఈ సమస్య నుండి భయటపడవచ్చు.

Signs Of Weight Gain During Pregnancy

1. ఓబేసిటి: గర్భం పొందడానికి ముందే ఊబకాయంతో ఉన్నట్లైతే నార్మల్ గా ఉన్నప్పటికన్నా మూడు రెట్లు బరువు పెరుగుతారు.మీరు కనుకు ఓబర్ వెయిట్ ఉన్నట్లైతే మీ బాడీ మాస్ ఇండెక్స్ 30 కంటే ఎక్కువ ఉంటుంది. దీన్ని మించి 5 నుండి 9 కిలోగ్రాములు పెరగడానికి వీలు లేదు , మీకు తెలియకుండానే బరువు పెరుగుతుంటే ప్రెగ్నెన్సీ సమయంలో మరిన్ని సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది.

Signs Of Weight Gain During Pregnancy

2. అవసరమైన దాని కంటే ఎక్కువ తినడం: మహిళలు గర్భం పొందిన తర్వాత ఎక్కువ ఆహారాలను తీసుకోవడం మొదలు పెడతారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులు కూడా తల్లి బిడ్డకు సరిపోయే ఆహరాలు తినాలని సూచిస్తుంటారు. ఇలా తినడం వల్ల కొన్ని నెలల తర్వాత ఊబకాయానికి దారితీస్తుంది. కాబట్టి, ఎప్పటికప్పుడు డాక్టర్ ను కలిసి, బరువును చెక్ చేసుకోవాలి. ఎక్స్ ట్రా క్యాలరీలు గురించి అడిగి తెలుసుకోవడం చాలా అవసరం.

Signs Of Weight Gain During Pregnancy

3.ఎక్కువగా పాలు, స్వీట్స్ డ్రింక్స్ మరియు సాల్ట్ ప్రొడక్ట్స్ ను తీసుకోవడం వల్ల : గర్భధారణ కాలంలో పాలు చాలా అవసరం. అయితే బాగా కాచీ,వెన్న తీసి పాలు, లో ఫ్యాట్ మిల్క్, ఫ్యాట్ ఫ్రీ చీజ్ తీసుకోవడం మంచిది స్వీట్ డ్రింక్స్ తాగడం మానేయాలి. సాల్ట్ ఫుడ్స్ పరిమితం చేయాలి. ఇలా చేస్తే శరీరం బరువెక్క కుండా ఉంటుంది.

Signs Of Weight Gain During Pregnancy

4. సరిగా నిద్రపోకపోవడం వల్ల: రాత్రుల్లో ఎక్కువ సమయం నిద్రపోకుండా ఉండటం , నిద్ర తక్కువ అవుతుంది. ఈ సమయంలో స్వీట్స్ మరియు ఫ్యాట్స్ ఫుడ్స్ మీద కోరికలు పెరడంతో , వాటిని తినడం వల్ల మెటబాలిజం మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి, 7 నుండి 8గంటలు నిద్ర చాలా అవసరం.

Signs Of Weight Gain During Pregnancy

5. ఒత్తిడికి లోనవ్వడం:గర్భధారణ సమయంలో ఎక్కువగా భయపడటం, ఆందోళన చెందడం , తరచూ అలసట, రెగ్యులర్ గా తిరుగుతున్నా, వెంటనే అలసిపోవడం, వంటి లక్షణాలన్నీ కూడా బరువు పెరగడానికి కారణమవుతాయి. అందువల్ల గర్భిణీలు స్ట్రెస్ ఫ్రీ లైప్ ను అలవాటు చేసుకోవాలి. స్ట్రెస్ లో విడుదలయ్యే కార్టిసోల్ మెటబాలిజం మీద ప్రభావం చూపుతుంది. ఫ్యాట్ గా మార్చుతుంది.

English summary

Signs Of Weight Gain During Pregnancy

Pregnant women of course gain weight because of natural and medical reasons. Along with the weight of the baby inside you, increased blood volume, growing uterus and amniotic fluid (which protects the foetus) can also make you gain a good amount of weight.
Story first published: Thursday, November 17, 2016, 13:42 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter