డెలివరీ సమయంలో ఎదురయ్యే అనుకోని పరిణామాలు..!

చైల్డ్ బర్త్ అనేది.. మహిళలకు పునర్జన్మ లాంటిది. డెలివరీ ప్రాసెస్ ని హ్యాండిల్ చేయడం అంత తేలిక కాదు. మొత్తానికి ప్రెగ్నన్సీ అనేది ఒక ఛాలెంజ్ అయితే.. చైల్డ్ బర్త్ అనేది.. మరో పెద్ద ఛాలెంజ్.

Posted By:
Subscribe to Boldsky

చైల్డ్ బర్త్ అనేది.. మహిళలకు పునర్జన్మ లాంటిది. డెలివరీ ప్రాసెస్ ని హ్యాండిల్ చేయడం అంత తేలిక కాదు. మొత్తానికి ప్రెగ్నన్సీ అనేది ఒక ఛాలెంజ్ అయితే.. చైల్డ్ బర్త్ అనేది.. మరో పెద్ద ఛాలెంజ్. ఈ రెండింటినీ మహిళలు ఫేస్ చేయాల్సి ఉంటుంది.

Unexpected Things That Could Happen During Childbirth

అలాంటి ముఖ్యమైన సందర్భంలో కుటుంబ సభ్యులు, ఇష్టమైన వాళ్లు.. ఆమె చుట్టూ ఉండి ఆమెకు సపోర్ట్ అందించాలి. ఏ సమయంలోనైనా.. ఏదైనా ఊహించని పరిణామాలు ఎదురుకావచ్చు. డెలివరీ సమయంలో, డెలివరీకి ముందు.. ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలీదు.. కాబట్టి.. ప్రతిఒక్కరూ దగ్గరుండి చూసుకోవాలి.

ముఖ్యంగా భాగస్వామి తన పక్కనే ఉండి.. ఎలాంటి పరిస్థితి ఎదురైనా.. ధైర్యం చెప్పాలి. అయితే.. డెలివరీ సమయంలో.. ఊహించని విధంగా, ఎదురయ్యే అనుకోని పరిస్థితులేంటో చూద్దాం..

సంకోచాలు

కొంతమంది విషయంలో.. కాంట్రాక్షన్, సెన్సేషన్స్ ని జరగవచ్చు. కానీ.. అవి సంకోచాలు కాదు. అలాంటి సందర్భంలో వాస్తవంగా జరిగే సంకోచాల కోసం ఎదురుచూడాలి. కానీ గర్భిణీలు ఒత్తిడికి గురై.. తమ శరీరంలో జరిగే భయంకరమైన మార్పులు వాళ్లను ఆందోళనకు గురిచేయవచ్చు.

సిజేరియన్

అనుకోకుండా ఎదురయ్యే సందర్భాల్లో సిజేరియన్ ఒకటి. ప్రతి ఒక్క మహిళ నార్మల్ డెలివరీనే కోరుకోవచ్చు. కానీ.. చివరి నిమిషంలో కూడా పరిస్థితులు తారుమారు అయితే.. సిజేరియన్ చేయాల్సిన అవసరం రావచ్చు.

డెలివరీ తర్వాత కూడా

కొంతమంది మహిళలకు బిడ్డ పుట్టిన తర్వాత కూడా.. శరీరంలో సంకోచాలు కనిపించవచ్చు. దీనికి కారణం యూట్రస్ లో కొన్ని అడ్జస్ట్ మెంట్స్ జరుగుతుండటం వల్ల అయి ఉండవచ్చు. డెలివరీ తర్వాత శరీరం సాధారణ స్థితికి రావడానికి ఇలాంటి సంకోచాలు ఏర్పడవచ్చు.

త్వరగా డెలివరీ ప్రాసెస్

కొంతమంది మహిళల్లో ఊహించనిరీతిలో చాలా త్వరగా డెలివరీ ప్రాసెస్ పూర్తవుతుంది. ఎలాంటి ఎఫర్ట్స్ అవసరం లేకుండా.. ప్రసవం జరిగిపోతుంది. అది చాలా రిలీఫ్ ని అందిస్తుంది.

చేతులు, కాళ్లు

ఒకవేళ చేతులు, కాళ్లలో స్పర్శ కోల్పోయిన ఫీలింగ్ కలిగిందంటే.. వెంటనే డాక్టర్ ని పిలవాలి. ఇది చాలా ఊహించని విధంగా జరిగే పరిణామం. దీనికి వెంటనే చికిత్స అవసరం కాబట్టి.. వెంటనే డాక్టర్ ని సంప్రదించడం అవసరం.

English summary

Unexpected Things That Could Happen During Childbirth

Unexpected Things That Could Happen During Childbirth. Childbirth is almost like a rebirth to any woman. Pregnancy is one challenge and childbirth is another. Read on to know about some unexpected things that could happen during labour...
Please Wait while comments are loading...
Subscribe Newsletter