For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నార్మల్ డెలివరీ అవడానికి కంపల్సరీ ఫాలో అవ్వాల్సిన టిప్స్..!

By Swathi
|

ప్రెగ్నన్సీ అనేది.. చాలా విభిన్నమైన అనుభవాన్ని ఇస్తుంది. పెయిన్, గెయిన్ రెండింటితోనే డీల్ చేయగలగాలి. ఇప్పటికే గర్భం పొందిన మహిళలు.. లేబర్ పెయిన్ గురించి ఆలోచించడం కూడా చాలా కష్టమే. ముఖ్యంగా మొదటిసారి ప్రెగ్నంట్స్ అయిన మహిళలకు ఈ టెన్షన్ మరింత ఎక్కువగా ఉంటుంది.

ప్రస్తుత కాలంలో చాలా మంది మహిళలు.. సాధారణ డెలివరీ కంటే.. సిజేరియన్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. నార్మల్ డెలివరీ వల్ల వచ్చే నొప్పులను భరించలేక ఈ ప్రక్రియను ఎంచుకుంటున్నారు. అయితే నార్మల్ డెలివరీ అవుతుందా, సర్జరీనా అనేది ముందుగానే కనుక్కోవడానికి ఎలాంటి మార్గాలూ లేవు.

అయితే నార్మల్ డెలివరీ అవడం వల్ల ఫ్యూచర్ లో కూడా చాలా సమస్యలకు దూరంగా ఉండవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అందుకే పల్లెటూర్లలో ఇప్పటికీ నార్మల్ డెలివరీ చేయించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. నార్మల్ డెలివరీ అవ్వాలంటే.. ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటి.

ఒత్తిడికి దూరంగా

ఒత్తిడికి దూరంగా

నార్మల్ డెలివరీ అవ్వాలి అనుకునేవాళ్లు ఖచ్చితంగా ఒత్తిడికి దూరంగా ఉండాలి. ప్రెగ్నన్సీ అనేది ఫన్ గా ఎంజాయ్ చేయాలి. ఒత్తిడికి గురయ్యే గర్భిణీ స్త్రీలు తమ ఆరోగ్యంతోపాటు, కడుపులో బిడ్డ ఆరోగ్యానికి కూడా హాని చేస్తారు.

రెగ్యులర్ గా వ్యాయామం

రెగ్యులర్ గా వ్యాయామం

సున్నితమైన వ్యాయామాలను రెగ్యులర్ గా చేయడం వల్ల నార్మల్ డెలివరీకి ఎక్కువ అవకాశాలుంటాయి. వ్యాయామాలు చేయడం వల్ల.. శరీరంలో స్టామినా పెరిగి.. యాక్టివ్ గా ఉంటారు. లేబర్ పెయిన్ పై ఉండే ఒత్తిడిని కూడా వ్యాయామం తగ్గిస్తుంది.

డైట్

డైట్

ప్రెగ్నన్సీ టైంలో ఏం తింటున్నారు అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే.. అది బిడ్డ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. ఆరోగ్యకరమైన, పోషకాహారం తీసుకోవడం వల్ల లేబర్ పెయిన్ తట్టుకునే శక్తి పొందవచ్చు. అలాగే అది నార్మల్ డెలివరీ అవడానికి ప్రోత్సహిస్తుంది. కాబట్టి విటమిన్స్, ప్రొటీన్ ఫుడ్ తీసుకుంటూ.. శరీరాన్ని రోజంతా హైడ్రేట్ గా ఉంచుకోవాలి.

నీళ్లు

నీళ్లు

లేబర్ పెయిన్ తగ్గించి, నార్మల్ డెలివరీ అవడానికి నీళ్లు బాగా సహాయపడతాయి. టబ్ లో హాట్ వాటర్ ఫిల్ చేసి.. ఎంత వీలైతే.. అంతసేపు ఆ నీటిలో గడపాలి. హాట్ వాటర్ పెయిన్ ని తేలికగా తగ్గిస్తుంది.

బ్రీతింగ్ ఎక్సర్ సైజ్

బ్రీతింగ్ ఎక్సర్ సైజ్

బ్రీతింగ్ ఎక్సర్ సైజ్ చాలా ముఖ్యమైనది. ఇది.. పెయిన్ లేకుండా నార్మల్ డెలివరీ అవడానికి సహాయపడుతుంది. ఆక్సిజన్ సజావుగా సప్లై అయితేనే.. బేబీ హెల్తీగా పెరుగుతారు.

బర్త్ స్టోరీస్

బర్త్ స్టోరీస్

భయంకరమైన బర్త్ స్టోరీస్ కి గర్భిణీ స్త్రీలు దూరంగా ఉండాలి. నెగటివ్ ఆలోచనలు.. గర్భంపై తీవ్ర దుష్ర్పభావం చూపుతాయి. కాబట్టి నిద్రకు ముందు.. మంచి స్టోరీస్ చదవడం మంచిది.

ఫ్రెండ్స్ తో మాట్లాడటం

ఫ్రెండ్స్ తో మాట్లాడటం

మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, నెయిబర్స్ తో మాట్లాడుతూ బిజీగా గడపాలి. మాట్లాడుతూ ఉండటం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. నెగటివ్ ఆలోచనలు.. మీకు, మీ కడుపులోని బిడ్డ ఆరోగ్యానికి మంచిది కాదు.

ఆల్కహాల్, టీ

ఆల్కహాల్, టీ

ప్రెగ్నన్సీ స్టేజ్ లో ఉన్నప్పుడు కాఫీ, టీ, ఆల్కహాల్ కి సాధ్యమైనంతవరకు దూరంగా ఉండటమే మంచిది. కెఫీన్ ఎక్కువగా తీసుకుంటే.. లో బర్త్ వెయిట్, అబార్షన్ వంటి సమస్యలకు కారణమవుతుంది. ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవడం కూడా మంచిది కాదు.

పేరెంటల్ క్లాస్

పేరెంటల్ క్లాస్

పేరెంటల్ క్లాస్ లకు వెళ్లడం మంచిది. బిడ్డ పుట్టే సమయంలో.. ప్రెగ్నన్సీ చివరి నెలల్లో ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి, వాటిని ఎలా ఎదుర్కోవాలి అనేదానిపై సలహాలు ఇస్తారు.

వాకింగ్

వాకింగ్

ప్రెగ్నన్సీ టైంలో ప్రతిరోజూ నడుస్తూ ఉండాలి. దీనివల్ల హెల్తీ ప్రెగ్నన్సీ టైం పొందుతారు. అలసట కూడా దూరంగా ఉంటుంది. ప్రెగ్నన్సీ టైంలో నడవడం కష్టంగా ఉంటే.. కొన్ని నిమిషాలైనా.. కొంత దూరం నడవడానికి ప్రయత్నించాలి.

English summary

Useful Pregnancy Tips For Having Normal Delivery

Useful Pregnancy Tips For Having Normal Delivery. Pregnancy is the most exceptional stage of motherhood which deals with ample of pain and gain.
Story first published: Wednesday, September 21, 2016, 16:25 [IST]
Desktop Bottom Promotion