For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రెగ్నెన్సీ : ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏమిటి..? ఎగ్ ఫ్రీజింగ్ కొరకు ఫర్ఫెక్ట్ ఏజ్ ఏది

ఒక్కసారి మహిళ గర్భానికి సిద్ధంగా ఉన్నప్పుడు, ఎగ్ తీసుకోని వార్మ్ చేసి ఆపై స్పెర్మ్ తో ఫలదీకరణ చేయవలసి ఉంటుంది.ఈ ప్రక్రియలో అనేక ప్రయోజనాలు మరియు అనేక ప్రతికూలతలు ఉన్నాయి. అయితే ఈ వ్యాసంలో సంతానోత

By Lekhaka
|

'ఎగ్ ఫ్రీజింగ్' అనేది ఈ రోజుల్లో అందుబాటులో ఉన్న సంతానోత్పత్తి సంరక్షణ పద్ధతుల్లో ఒకటి. ఎగ్ ఫ్రీజింగ్ చేస్తే సంతానోత్పత్తికి ప్రమాదం కలిగిన పరిస్థితులు వచ్చినప్పుడు ఉపయోగించవచ్చు. మహిళల వయస్సు పెరిగే కొద్దీ గర్భధారణ అవకాశాలు తగ్గుతాయి.

ఎగ్ ఫ్రీజింగ్ ద్వారా పిల్లలను కనే పద్దతి మహిళల ఆదరణ పొందింది. ఇది జీవ గడియారం చిన్న మరియు ఆరోగ్యకరమైన గుడ్లు పరిరక్షించే పునరుత్పత్తి ఎంపికలను విస్తరించేందుకు నిలిపివేసే ఒక ప్రక్రియ.

What's Meant By Egg Freezing?

ఎగ్ పరిరక్షణ విషయంలో ఈ టెక్నాలిజీ గతంలో విఫలం అయింది. సాంకేతికంగా గత ఐదు సంవత్సరాలుగా బాగా మార్పులు చెందింది. ఇప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ పద్దతి సంతానోత్పత్తి సంరక్షణలో ఒక విజయవంతమైన పద్ధతిగా మారింది.

ఈ ప్రక్రియలో, అండాశయము ఉద్దీపన మరియు బహుళ గుడ్లను ఉత్పత్తి చేసి సబ్ జీరో డిగ్రీ ఉష్ణోగ్రతలో ప్రయోగశాలలో నిల్వ చేస్తారు.

ఒక్కసారి మహిళ గర్భానికి సిద్ధంగా ఉన్నప్పుడు, ఎగ్ తీసుకోని వార్మ్ చేసి ఆపై స్పెర్మ్ తో ఫలదీకరణ చేయవలసి ఉంటుంది.

ఈ ప్రక్రియలో అనేక ప్రయోజనాలు మరియు అనేక ప్రతికూలతలు ఉన్నాయి. అయితే ఈ వ్యాసంలో సంతానోత్పత్తి టెక్నాలజీ గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.

అనేక ఎగ్స్

అనేక ఎగ్స్

ఎగ్ ఫ్రీజింగ్ లో వైద్యులు బాగా పరిశీలించి అండాశయ హార్మోన్లకు ఉద్దీపన కలిగిస్తారు. అనేక గుడ్లు ఉత్పత్తి అయితే ఫ్రీజింగ్ కోసం ప్రయోగశాలకు తీసుకుంటారు. గుడ్లు మరియు వాటి విధులు లేదా ఉత్పాదకత గురించి మరింతగా తెలుసుకోవాలి. వైద్యులు మీ ఉత్పత్తిని గమనించటం మరియు గ్రహించడానికి మీరు ఈ ప్రక్రియను మరింతగా అర్థం చేసుకోవాలి.

ఉద్దీపన కోసం ఇంజెక్షన్

ఉద్దీపన కోసం ఇంజెక్షన్

అనేక గుడ్లు ఉత్పత్తి కోసం అండాశయంలో హార్మోన్ల ఉద్దీపన చేయబడుతుంది. ఇది నొప్పి లేని ప్రక్రియ. ఎటువంటి ఆందోళన పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే వీటి ప్రభావాల గురించి వైద్యుడు లేదా నర్స్ వివరణ ఇస్తారు.

 ముందు పరిశోధన

ముందు పరిశోధన

సాంకేతికత అభివృద్ధి చెందటం వలన అనేక గుడ్ల ఉత్పత్తి సాధ్యమే. వైద్యులు అనేక గుడ్లను తీసుకున్న కొన్ని గుడ్లు మాత్రం సమర్ధవంతమైన ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉండదు.

సమయం అవసరం

సమయం అవసరం

ఎగ్ ఫ్రీజింగ్ సంతానోత్పత్తి పరిరక్షించే పద్దతిలో కొంత సమయం అవసరం. అనేక పరీక్షలు మరియు విశ్లేషణలు చేసిన తర్వాత మాత్రమే వైద్యులు ఈ పక్రియను ప్రారంభిస్తారు. మొదటి నెల మీ గుడ్లు సామర్థ్యం తనిఖీ మరియు అన్ని రకాల రక్త పరీక్షలు, ఆల్ట్రాసౌండ్ను స్కాన్లు చేస్తారు.

గుడ్డు ఫ్రీజింగ్ కోసం తగినంత మంచిగా ఉంటే కనుక తదుపరి ప్రక్రియ ప్రారంభం అవుతుంది. రెండవ నెల మీ గుడ్లు వృద్ధిని పరిశీలన చేస్తారు. కొన్ని మందులను ఇస్తారు. రక్త పరీక్షలు మరియు స్కానింగ్ పరిశీలన చేస్తారు. అండోత్సర్గము ఖచ్చితంగా ఉంటే గుడ్డు విడుదల జరుగుతుంది. సాధారణంగా ఫ్రీజింగ్ ప్రక్రియ కోసం 15 గుడ్లను తీసుకుంటారు.

 ఎగ్ ఫ్రీజింగ్ కొరకు అనువైన వయస్సు

ఎగ్ ఫ్రీజింగ్ కొరకు అనువైన వయస్సు

ఎగ్ ఫ్రీజింగ్ అనేది అండాశయము నుండి యువ మరియు ఉత్పాదక గుడ్లను తీసుకొనే ఒక ప్రక్రియ. కాబట్టి ఎగ్ ఫ్రీజింగ్ కొరకు అనువైన సమయం 20 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య ఉంటుంది. మహిళల్లో 35 సంవత్సరాలకు సంతానోత్పత్తి శక్తి తగ్గిపోతుంది. 20 నుంచి 30 సంవత్సరాల లోపు గుడ్లు అధిక ఉత్పాదకత మరియు మరింత ఆరోగ్యంగా ఉంటాయి.

ఖరీదైనది

ఖరీదైనది

అవును ఈ ప్రక్రియ ఖరీదైనది. అయితే ఈ ప్రక్రియ మొదలు పెట్టినప్పుడు మీ మనస్సుకు శాంతి లభిస్తుంది. అంతేకాక ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఒక నిర్దిష్ట వయస్సు తర్వాత ఇతర ఫలదీకరణ చికిత్సలతో పోల్చితే తక్కువ ఖరీదైనది.

ప్రమాదం

ప్రమాదం

ప్రతి శాస్త్రీయ పద్ధతిలో నష్టాలు అనేవి ఉంటాయి. అది మొత్తం ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేసిన తరువాత మాత్రమే నిర్ధారించబడుతుంది. ఇక్కడ కూడా అదే వర్తిస్తుంది. ఒక నమ్మకమైన ప్రణాళిక ఉంటుంది. కానీ ఈ ప్రక్రియలో గర్భధారణకు ఖచ్చితమైన హామీ లేదు. ఈ ప్రక్రియలో అనేక ప్రయోజనాలు మరియు అనేక ప్రతికూలతలు ఉన్నప్పటికీ, నేటి యువతలో ఎగ్ ఫ్రీజింగ్ అనే సంతానోత్పత్తి పరిరక్షణ పద్దతి ప్రసిద్ధ పద్ధతిగా మారింది.

English summary

What's Meant By Egg Freezing?

What's Meant By Egg Freezing?,Egg freezing is one of the fertility preservation methods available nowadays. Preserving method like egg freezing can be used in certain health conditions where fertility is at risk. As the age goes on, women find it difficult to conceive.
Desktop Bottom Promotion