For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భంలో బిడ్డ ఆరోగ్యంగా ఉందో లేదో ఈజీగా తెలుసుకోవొచ్చు

గర్భంలో ఉన్న బిడ్డ సంరక్షణ, ఎదుగుదలకు ఎన్ని జాగ్రతలు పాటించినా కొన్నిసార్లు ఇబ్బందులు తలెత్తుంటాయి. అసలు కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉందో లేదో అనే విషయాన్ని ఈ 14 సూచనల ద్వారా గర్భిణీలు ఈజీగా తెలుసుకోవొచ్చ

By Y. Bharath Kumar Reddy
|

బిడ్డకు జన్మనివ్వడమంటే ఆడవాళ్లకు మరో జన్మ ఎత్తామనే భావన కలుగుతుంంది. బిడ్డ కడుపున పడిన నాటి నుంచి జన్మించేదాకా తల్లి పడే ఆరాటం అంతా ఇంతా కాదు. బిడ్డ ఆరోగ్యంగా ఎదగాలని, ఆరోగ్యంగా పుట్టాలని ప్రతి రోజూ పరితపిస్తూ ఉంటుంది. అయితే కేవలం జాగ్రత్తలు తీసుకుంటే చాలదు. బిడ్డ ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకుంటూ ఉండాలి. అందుకోసం అన్ని రకాల పరీక్షలు చేయించుకోవాలి.

గర్భంలో ఉన్న బిడ్డ సంరక్షణ, ఎదుగుదలకు ఎన్ని జాగ్రతలు పాటించినా కొన్నిసార్లు ఇబ్బందులు తలెత్తుంటాయి. అసలు కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉందో లేదో అనే విషయాన్ని ఈ 14 సూచనల ద్వారా గర్భిణీలు ఈజీగా తెలుసుకోవొచ్చు.

1. హృదయ స్పందన సరిగ్గా ఉండదు

1. హృదయ స్పందన సరిగ్గా ఉండదు

మహిళ గర్భందాల్చిన తర్వాత గర్భంలోని శిశువు గుండెకొట్టు కోవడం ఐదోవారంలో ప్రారంభమవుతుంది. అయితే దాన్ని పదో వారంలో గుర్తించొచ్చు. డాప్లర్ టెస్ట్ పరీక్ష ద్వారా ఈ విషయాన్ని గుర్తించొచ్చు. అయితే కొన్నిసార్లు, ఈ టెస్ట్ లలో కూడా గర్భస్త శిశువు హృదయ స్పందనను కనుక్కోలేకపోవొచ్చు. అయితే మళ్లీ టెస్ట్ చేయించిన కూడా ఇలాగే ఉంటే గర్భంలోని బిడ్డ కాస్త ఆందోళనకర వాతావరణంలో ఉన్నట్లు లెక్క. అందువల్ల వెంటనే డాక్టర్ల సూచనల మేరకు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి.

2. గర్భం ఉండే సైజ్

2. గర్భం ఉండే సైజ్

గర్భం ఉండే సైజ్ ను బట్టి కూడా బిడ్డ ఆరోగ్యంగా ఉందా.. అనారోగ్యంగా ఉందో తెలుసుకోవొచ్చు. యుటెరస్ కాస్త పెరిగినట్లయితే కడుపులోని పిండం కాస్త అనారోగ్యంగా ఉందని అర్థం. అయితే డాక్టర్లతో టెస్ట్ లు చేయించుకుంటే ఈ విషయం నిర్ధారణ అవుతుంది.

3. ఐయూజీఆర్ డయాగ్నోసిస్

3. ఐయూజీఆర్ డయాగ్నోసిస్

ఇంట్రాయుటేరియన్ గ్రోత్ రిస్ట్రిక్షన్ టెస్ట్ పాజిటివ్ గా వస్తే పిండం పెరుగుదల అంతగా లేదని అర్థం. దీనికి అనేక కారణాలుంటాయి. సాధారణంగా గర్భిణీలు

మూత్రపిండ సమస్యలు, లేదా మధుమేహం తదితర వాటితో బాధపడుతుంటే ఈ టెస్ట్ పాజిటివ్ గా వస్తుంది. అయితే బిడ్డ పుట్టిన వెంటనే పలు టెస్ట్ చేయించాల్సి ఉంటుంది. శ్వాసకు సంబంధించి, బ్లడ్ షుగర్, బాడీ టెంపరేచర్ తదితర టెస్ట్ లను చేయించాల్సి ఉంటుంది. డాక్టర్ల సూచనలను ఎప్పటికప్పుడు పాటిస్తూ ఉండాలి.

4. హెచ్ సీజీ లెవెల్స్ తక్కువగా ఉండండం

4. హెచ్ సీజీ లెవెల్స్ తక్కువగా ఉండండం

హ్యుమన్ క్రానికల్ గోనాడోట్రోపిన్ అనే హార్మోన్ అండం ఫలదీకరణ తర్వాత పిండాన్ని అభివృద్ధి చేయడానికి సహాయపడుతుంది. గర్భం వచ్చాక 8 నుంచి 11 వారాల మధ్యన హెచ్ సీజీ లెవెల్స్ ఎక్కువగా ఉండాలి. ఈ విషయంలో బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుస్తుంది. హెచ్ సీజీ లెవెల్స్ తక్కువగా ఉండడం వల్ల గర్భస్రావం, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనే సమస్యలు వస్తుంటాయి.

5. క్రాంపింగ్ ఎక్కువగా ఉండడం

5. క్రాంపింగ్ ఎక్కువగా ఉండడం

ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఋతుక్రమం సమయంలో ఎక్కువగా రక్తస్రావం అయ్యే అవకాశం ఉంటుంది. రక్తస్రావంతో పాటు క్రాంపిగ్ కూడా ఎక్కువగా ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఇలాగే మళ్లీ మళ్లీ జరుగుతుంటే గర్భంలోని బిడ్డ నెలలు నిండకముందే పుట్టే అవకాశం ఉందని అర్థం.

6. తీవ్ర రక్తస్రావం

6. తీవ్ర రక్తస్రావం

గర్భధారణ సమయంలో యోని నుంచి అధికంగా రక్తస్రావం కావడం కూడా ఆందోళన కలిగించే విషయమే. ఇందుకు చాలా కారణాలుంటాయి. హార్మోన్ల బ్లీడింగ్, ఇంప్లామెంటేషన్ బ్లీడింగ్ తదితర కారణాలుంటాయి. దీని వల్ల పిల్లలు నెలలు నిండకముందే జన్మించే ఛాన్స్ ఉంటుంది.

7. తీవ్రమైన వెన్నునొప్పి

7. తీవ్రమైన వెన్నునొప్పి

గర్భిణీగా ఉన్నప్పుడు వెన్ను నొప్పి అనేది వస్తూ ఉంటుంది. శిశువు పెరుగుతున్నప్పుడు శరీరంపై ఎక్కువ భారం పడుతుంది. దీంతో బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. అయితే నొప్పి ఎక్కువగా ఉండి తీవ్రంగా ఉంటే కాస్త అప్రమత్తం కావాలి. మూత్రపిండాలు, మూత్రాశయం ఇన్ ఫెక్షన్స్ ఇందుకు కారణం అవుతాయి. దీనివల్ల గర్భస్రావం అయ్యే అవకాశం ఉంది. అందువల్ల వెంటనే డాక్టర్లను సంప్రదించాలి.

8. వజీనల్ డిశ్చార్జెస్

8. వజీనల్ డిశ్చార్జెస్

గర్భంతో ఉన్నప్పుడు ఇలాంటి సమస్య వస్తుంటుంది. అయితే ఎక్కువగాదుర్వాసన రావడం , రక్తం రావడం, నొప్పి ఉండడం, తదితర లక్షణాలు కనిపించినట్లయితే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.

9. అల్ట్రాసౌండ్స్ లో తేడా

9. అల్ట్రాసౌండ్స్ లో తేడా

పిండం పెరుగుదలను అల్ట్రాసౌండ్ సహాయంతో తెలుసుకోవొచ్చు. సైజ్, బరువు, మూమెంట్స్, రక్త ప్రసరణ, హార్ట్ బీట్, అలాగే ఉమ్మనీరు ఎంత ఉంది తదితర విషయాలు మనకు అల్ట్రాసౌండ్స్ ద్వారా తెలుస్తాయి. అయితే అల్ట్రాసౌండ్స్ అసాధారణంగా ఉంటే మాత్రం కాస్త అప్రమత్తంకావాలి. వెంటనే డాక్టర్ని సంప్రదించి సూచనలు తీసుకోవాలి.

10. నెగెటివ్ ప్రెగ్నెన్సీ

10. నెగెటివ్ ప్రెగ్నెన్సీ

ప్రస్తుతం ఇంట్లోనే గర్భ నిర్ధారణ పరీక్షలు చేసుకోవడం చాలా ఎక్కువైంది. అయితే ప్రెగ్నెన్సీ అని నిర్ధారించుకున్న తర్వాత కూడా ఒక్కోసారి ఆందోళన కులుగుతుంది. ఇంతకు తాను ప్రెగ్నెన్నీనేనా అని మళ్లీ కొందరు టెస్ట్ చేసుకుంటారు.

అయితే ఒక్కోసారి నెగెటివ్ రిపోర్ట్ వస్తుంటుంది. ఇలాంటి సందర్భాల్లో వెంటనే డాక్టరిని సంప్రదించాలి. పరీక్షలు చేయించుకుని బిడ్డ ఆరోగ్యంగా ఉండేలా జాగ్రత్తలు తెలుసుకోవాలి.

11. పిండం కదలికలు సరిగ్గా లేకపోవడం

11. పిండం కదలికలు సరిగ్గా లేకపోవడం

గర్భంలో శిశువు కదలికలు ఎక్కువగా 18 వారాలప్పుడు లేదా 24 వారాలప్పుడు జరుగుతూ ఉంటుంది. శిశువు కడుపులో కాస్త తన్నుతుప్పుడు సాధారణంగా గర్భిణీకి ఆనందం కలుగుతుంది.

అయితే కడుపులో ఎలాంటి కదలికలు లేకుంటే మాత్రం కాస్త ఆందోళనకర విశయమే. కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉంటే రెండు గంట్లలో ఒక్కోసారి పది సార్లు తన్నే అవకాశం ఉంటుంది. అందువల్ల గర్భంలో బిడ్డ కదిలికలు సరిగ్గా లేకుంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.

12. ఉదయం పూట అనారోగ్యంగా ఉండడం

12. ఉదయం పూట అనారోగ్యంగా ఉండడం

సాధారణంగా గర్భిణీలు ఉదయం పూట కాస్త నిస్సత్తువుగా ఉంటారు. మొదటి త్రైమాసికంలో ఇలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అయితే కొందరిలో మాత్రం ఇది కాస్త ఎక్కువగా ఉంటుంది.

హెచ్ సీజీ లెవెల్స్ తక్కువగా ఉండడమే ఇందుకు కారణం. సాధారణంగా ఇలాంటి లక్షణాలు కనపడితే గర్భస్రావం అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వెంటనే డాక్టరిని సంప్రదించాలి.

13. జ్వరం ఎక్కువగా ఉండడం

13. జ్వరం ఎక్కువగా ఉండడం

గర్భధారణ సమయంలో జ్వరం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల గర్భంలోని బిడ్డ బ్యాక్టీరియా లేదా వైరల్ ఇన్ ఫెక్షన్ గురయ్యే అవకాశం ఉంది. అలాగే శిశువు పెరుగుదలపై కూడా ప్రభావం చూపుతుంది. అందువల్ల తరుచుగా జ్వరం వస్తూ ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.

14. రొమ్ము పరిమాణం తగ్గడం

14. రొమ్ము పరిమాణం తగ్గడం

గర్భిణీల్లో హార్మోన్ల ప్రభావం వల్ల రొమ్ము సైజ్ తగ్గిపోతూ ఉంటుంది. శరీరం పిండం పెరుగుదలకు సహకరించకపోయినట్లయితే ఇలా జరుగుతూ ఉంటుంది. గర్భిణీల్లో రొమ్ము పరిమాణం తగ్గిపోవడానికి కారణం కూడా ఇదే. ఇలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు కడుపులో బిడ్డ ఆరోగ్యం బాగాలేదని అర్థం చేసు్కోవాలి. వెంటనే వైద్యులను సంప్రదించాలి.

English summary

14 Signs Of An Unhealthy Baby

The body of a carrying woman indicates when the fetus is unhealthy. 14 such signs and what they imply are explained here.
Desktop Bottom Promotion