For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీలు వెయిట్ కంట్రోల్లో ఉండటానికి 5 అమేజింగ్ టిప్స్..!

గర్భిణీలు వెయిట్ కంట్రోల్లో ఉండటానికి 5 అమేజింగ్ టిప్స్..!

By Lekhaka
|

గర్భం రాగానే శరీరంలో మార్పు చోటు చేసుకుంటాయి. ఈ మార్పులు ఎలా ఉండాలి. బరువు ఎంత వరుకూ ఉండవచ్చు. జరిగే మార్పులు ఎంతవరకూ శ్రేయష్కరం..? తింటే ఎంత తినాలి ఇలాంటి ప్రశ్నలు వారి మదిలో మెదులుతాయి. వాటికి సమాధానాలు ఏమిటో చూద్దాం రండీ.

సాధారణ మహిళకు రోజుకు 2100 కెలరీల శక్తి సరిపోతుంది. గర్భిణీలు అదనంగా మరో 300 కెలరీలు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే 2400 కెలరీల వరకూ తీసుకోవచ్చు. గర్భం ధరించనప్పుడు ఉన్న బరువు కంటే, గర్భం ధరించినప్పుడు ఉండే బరువు 8 నుంచి 12 కిలోలు అదనంగా ఉండవచ్చు. అంతకంటే మించితే మాత్రం ప్రమాదమే. బరువు పెరుగుతున్నామని తినకుండా పోయినా ప్రమాదమే. దీనిని అనుసరించి ఆహారం తీసుకోవాలి.

ఇందులో మ్యాజిక్ ఏం ఉండదు. బరువు కరెక్ట్ గా ఉన్నప్పుడు సుఖ ప్రసవం జరుగుతుంది. సుఖంగా ప్రసవం జరగాయాలంటే స్టామినా, ఓపిక, ఎనర్జీతో ఉండాలి. స్వీట్, షుగర్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి. ఫ్యూచర్ లో అధిక బరువు పెరగకుండా ఉండాలంటే ఉండలంటే కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే తల్లీ బిడ్డ క్షేమంగా ఉంటాయి. గర్భాధారణ సమయంలో అధిక బరువు పెరగకుండా 5 సింపుల్ టిప్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి

1. ఆకలి, ఆహారాల మీద కోరికలను కంట్రోల్ చేసుకోవాలి

1. ఆకలి, ఆహారాల మీద కోరికలను కంట్రోల్ చేసుకోవాలి

గర్భధారణ సమయంలో ఓవర్ వెయిట్ పెరగకుండా ఉండాలంటే ఆకలి కోరికలు తగ్గించుకోవాలి. అందుకోసం హెల్తీ ఫుడ్స్ మాత్రమే ఎంపిక చేసుకోవాలి. ఎక్కువ సేపు ఆకలి కాకుండా ఉండే హెల్తీ ఫైబర్ ఫుడ్స్ ను ఎంపిక చేసుకోవాలి. చాక్లెట్స్, స్వీట్స్, ఐస్ క్రీమ్స్ మీద ఉండే కోరికలను తాజా పండ్లు, పెరుగు, సీజనల్ జ్యూసెస్ మీద మళ్లించాలి.

2. ఫ్రీ టైమ్ లో వ్యాయామం చేయాలి

2. ఫ్రీ టైమ్ లో వ్యాయామం చేయాలి

గర్భం పొందిన తర్వాత వ్యాయామాన్ని పూర్తిగా మర్చిపోతుంటారు. అలా చేయకుండా ఫ్రీ సమయాల్లో చిన్న పాటి వ్యాయామాలు, యోగలు చేయడం మంచిది. యోగ చేయాలనుకునే వారు నిపుణుల పర్యవేక్షణలో చేస్తే మైండ్ , బాడీ రిలాక్స్ తో పాటు, బరువు కంట్రోల్లో ఉంటుంది.

3. మంచి నిద్ర

3. మంచి నిద్ర

బాడీ ఫిట్ గా ఉండాలంటే రోజూ 20 నిముషాల వ్యాయామం అవసరం. అలాగే విశ్రాంతితో పాటు నిద్రకూడా గర్భిణీలకు తప్పనిసరి. రోజూ సరిపడా నిద్రపొందడం వల్ల బరువు కంట్రోల్లో ఉంటుంది. ఎక్కువ నిద్ర లేదా నిద్రలేమి వల్ల ఇతర అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి, బాడీకి నిద్రతో మంచి విశ్రాంతి కలిగించడం చాలా అవసరం.

4. మామ్స్ గ్రూప్ లో జాయిన్ అవ్వడం

4. మామ్స్ గ్రూప్ లో జాయిన్ అవ్వడం

గర్భిణీల కోసం వారి ఆహారం, అలవాట్లు ఒత్తిడి తగ్గించే ప్రోగ్రామ్స్ ఈ మద్యకాలంలో ఎక్కువగా కనబడుతున్నాయి. కొన్ని ఫోరమ్స్, క్లబ్స్, పేజెస్, గ్రూప్స్ లో చేరడం వల్ల కొత్త పరిచయాలతో గర్భధారణ కాలంలో వచ్చే సమస్యలను గురించి వారితో షేర్ చేసుకోవచ్చు. గ్రూప్స్ ఉండే మహిళలలతో మీ సమస్యలు, లక్షాలు, ప్లాన్స్ ను పంచుకోవచ్చు.

5. స్ట్రెస్ తగ్గించుకోవాలి

5. స్ట్రెస్ తగ్గించుకోవాలి

అధిక బరువుకు కారణం స్ట్రెస్ కూడా ఒకటి. గర్భిణీలు బరువు పెరగకూడదనుకుంటే స్ట్రెస్ తగ్గించుకోవాలి. ఆందోళనులు ఏమాత్రం ఉండకూడదు. స్ట్రెస్ , ఆందోళన వంటివి తగ్గించుకోవడం వల్ల బరువు కంట్రోల్లో ఉంటుంది.

English summary

5 Tips to Help You Lose the Pregnancy Weight

Now that your new baby is here, you have a lot to think about: when to feed her, what to do if she cries -- and how to get rid of those extra pounds you packed on during your pregnancy.
Desktop Bottom Promotion