For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీలు ఫ్లూ నివారణకు మెడిసిన్స్ తీసుకోవడం సురక్షితమేనా..!

ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్స్ ను నివారించుకోవడం కోసం కొన్ని రకాల స్ట్రాంగ్ మెడికేషన్స్ తీసుకోవడం వల్ల పుట్టబోయే బేబిలో నెగటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చాలా మంది ఆందోళన చెందుతుంటారు. కాబట్టి గర్భిణీలు మెడికేషన్స్

|

ప్రస్తుత కాలంలో మహిళ గర్భం పొందడం కష్టంగా మారుతోంది. అందుకు జీవనశైలి, స్ట్రెస్, ఓబేసిటి కారణాలు అవుతున్నాయి. అయితే కొంత మంది మహిళల్లో గర్భం పొందన తర్వాత సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందుకు కారణం సరైన అవగాహన లేకపోవడం. గర్భం పొందిన ప్రారంభ దశలో జాగ్రత్తలు తీసుకోకపోవడం. ఇది కేవల తల్లిలో మాత్రమే కాదు, పుట్టబోయే బిడ్డలో కూడా ప్రభావం చూపుతుంది.

గర్భధారణ సమయం చాలా సున్నితమైన అంశం. ఆహారం, అలవాట్లు, డైట్ , వ్యాయమం, ఆరోగ్యం ఇలా ప్రతి అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. అప్పుడే పొట్టలో పెరిగే మరో జీవికి రక్షణ కల్పించగలరు.

Is It Safe To Take Flu Medicines During Pregnancy?

పొట్టలో పెరిగే బేబి హెల్తీగా ఉండటం కోసం అదనపు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా గర్భం పొందిన తర్వాత ఇన్ఫెక్షన్స్ రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఇన్ఫెక్షన్స్ కు గురికాకుండా ఉండరు. గర్భిణీలతో సహా తరచూ జబ్బు పడుతుంటారు. అది వారి వారి జీవన శైలి మీద ఆధారపడి ఉంటుంది.

సాధారణ జలుబు, దగ్గును నివారించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్..!!

గర్భిణీలలో వ్యాధినిరోధకత తక్కువగా ఉండటం వల్ల తరచూ జబ్బు పడుతుంటారని నిపుణులు సూచిస్తున్నారు. హార్మోనుల్లో మార్పులు వచ్చినప్పుడు వ్యాధినిరోధక తగ్గడం వల్ల త్వరగా ఇన్ఫెక్షన్స్ గురి అవుతారు. ఫ్లూ, దగ్గు జలుబు వంటివి సహజంగా వస్తుంటాయి. అయితే ఇలా సహజంగా వచ్చే ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్స్ ను నివారించుకోవడం కోసం కొన్ని రకాల స్ట్రాంగ్ మెడికేషన్స్ తీసుకోవడం వల్ల పుట్టబోయే బేబిలో నెగటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చాలా మంది ఆందోళన చెందుతుంటారు. కాబట్టి గర్భిణీలు మెడికేషన్స్ తీసుకోవడం సురక్షితమా కాదా..తెలుసుకుందాం..

గర్భధారణ సమయంలో ఫ్లూ :

గర్భధారణ సమయంలో ఫ్లూ :

ఇన్ఫ్లూయాంజా, దీన్నే ఫ్లూ గా పిలుస్తుంటారు. చాలా తరచూగా చాలా మంది ఈ ఫ్లూకు గురి అవుతుంటారు. స్త్రీ, పురుషులు లింగబేధం లేకుండా ఫ్లూకు గురి అవుతుంటారు. అయితే పురుషులతో పోల్చితే మహిళల్లో ముఖ్యంగా గర్భిణీలు ఎక్కువ గురి అవుతారు.

ఫ్లూ వైరల్ డిసీజ్

ఫ్లూ వైరల్ డిసీజ్

ఫ్లూ వైరల్ డిసీజ్ ఇది ఎక్కువగా ఆహారాలు, నీళ్లు, గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది, ఇది ఇది మొత్తం శరీర వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది.

ఫ్లూ లక్షణాలు :

ఫ్లూ లక్షణాలు :

ఈ ఫ్లూకు కొన్ని సహజ లక్షణాలు కూడా ఉన్నాయి. ఫీవర్, దగ్గు, జలుబు,బాడీ పెయిన్, అలసట, దగ్గు మొదలగు లక్షణాలు కనబడుతాయి.

ఇంగ్లీష్ మెడిసెన్స్ తీసుకోవడం వల్ల

ఇంగ్లీష్ మెడిసెన్స్ తీసుకోవడం వల్ల

గర్భిణీ స్త్రీలు ఇటువంటి లక్షణాలకు గురైనప్పుడు, పుట్టబోయే బిడ్డ మీద కూడా ప్రభావం చూపుతుంది ! ఇటువంటి సమయంలో మందులు తీసుకోవడానికి భయపడుతుంటారు. కెమికల్స్ తో తయారుచేసిన ఇంగ్లీష్ మెడిసెన్స్ తీసుకోవడం వల్ల కడుపులో బిడ్డకు హాని జరుగుతుందని ఆలోచిస్తారు.

గుడ్ న్యూస్ ఏంటంటే..

గుడ్ న్యూస్ ఏంటంటే..

అయితే, ఒక గుడ్ న్యూస్ ఏంటంటే..రీసెంట్ గా జరిపిన పరిశోధనల ప్రకారం గర్భిణీలు ఫ్లూ నివారణకు తీసుకునే మందులు సురక్షితమే అంటున్నారు. స్కాండనేవియా మరియు ఫ్రాన్స్ జరిపిన పరిశోధనల్లో 6000 మంది గర్భిణీల మీద జరిపిన పరిశోధనల ప్రకారం , ఫ్లూ లక్షణాలున్న గర్భిణీలకు చాలా తక్కువ పరిమాణంలో మందులను అందివ్వడం వల్ల ఫ్లూ లక్షణాలు పూర్తిగా నివారించబడనట్లు కనుగొన్నారు.

తల్లికి కానీ, బిడ్డకు కానీ ఎలాంటి హాని జరగలేదని

తల్లికి కానీ, బిడ్డకు కానీ ఎలాంటి హాని జరగలేదని

ఈ పరిశోధనల ద్వారా ఫ్లూ మందులను గర్భిణీలకు అందివ్వడం ద్వారా తల్లికి కానీ, బిడ్డకు కానీ ఎలాంటి హాని జరగలేదని నిర్ధారించారు.

సూచన

సూచన

కాబట్టి, చివరిగా, గర్భిణీలు ఫ్లూ తో బాధపడే వారికి ఫ్లూ మెడికేషన్స్ అందించినా ఎలాంటి హాని జరగలేదని గుర్తించారు. అయితే డాక్టర్స్ సూచన ప్రకారంన డోసేజ్ ను తీసుకోవాల్సి ఉంటుంది.

English summary

Is It Safe To Take Flu Medicines During Pregnancy?

When a pregnant woman is affected with infectious diseases like flu, she may have to take certain strong medications to treat the diseases and these medications can have negative effects on her unborn.
Desktop Bottom Promotion