For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మగవారికి కోసం సరికొత్త గర్భనిరోధక పద్దతులు: ఇవి పనిచేస్తాయా?

By Staff
|

ప్రేమలో ఉన్నపుడు కండోమ్స్ వాడడం ఇష్టంలేని పురుషుల కోసం ఒక మంచి కొత్త విషయం. గ్రౌండ్-బ్రేకింగ్ పరిశోధన అధ్యయనం వారు పురుషుల కోసం ఒక గర్భానిరోధకానికి సాధ్యమైన దానితో వచ్చారు!

ఇప్పుడు, గర్భనిరోధక మాత్రలు, పరికరాలు ప్రపంచం మొత్తంలో విచ్చల విడిగా అమ్ముడుపోతున్నాయి, ఇది నిజం.

ప్రపంచం మొత్తంలోని అనేక మంది జంటలు పిల్లలు పుట్టకుండా ఓరల్ పిల్స్, కండోమ్స్, గర్భాశయం లోపల పెట్టె వస్తువులు, వీర్యకణాలను నాశనం చేసే జెల్ వంటి వివిధ రకాల గర్భనిరోధక పద్ధతులను ఉపయోగిస్తున్నారు.

contraceptive

పురుష గర్భనిరోధక పద్ధతి

చాలామంది కెరీర్ లో ఎదుగుదలకు, కుటుంబాన్ని ప్రారంభించడానికి సరైన భాగస్వామి దొరక్క, పిల్లలని కనేవయసు ఇంకా రాలేదని మొదలైన కారణాలతో పిల్లలను ఆలస్యంగా కనాలి అనుకుంటారు.

ప్రత్యేకంగా, ఈరోజుల్లో చాలా అంటే చాలామంది, ప్రత్యేకంగా వయసులో ఉన్నవారు, సాధారణ శృంగారంలో పాల్గొనేవారు, ప్రధానంగా గర్భం వద్దు అనుకునేవారికి ఈ గర్భనిరోధక పద్ధతి చాలా అవసరం.

ఇప్పటి వరకు, గర్భనిరోధక పద్ధతులు ఎక్కువ శాతం స్త్రీలకూ మాత్రమే ఉపయోగపడుతున్నాయి, వాటి వలన కొన్ని ప్రతికూల ప్రభావాలు కూడా ఉన్నాయి.

అందువల్ల, పురుషుల కోసం తయారుచేసిన కొత్త గర్భనిరోధక పద్ధతుల గురించి చదవండి, శాస్త్రవేత్తలు వీటి అభివృద్ధి ప్రణాళికలో ఉన్నారు.

contraceptive

పురుష గర్భనిరోధక పద్ధతి

స్త్రీలకూ గర్భనిరోధక పద్ధతులు

గర్భం రాకుండా నిరోధించడానికి, శృంగారంలో పల్గోనేటపుడు కండోమ్స్ వాడాలి లేదా స్త్రీలు మాత్రమే గర్భాశయంలో పెట్టె వస్తువులు, హర్మోనల్ పిల్స్ వంటివి ఇతర పద్ధతులను అనుసరించాలి.

హర్మోనల్ పిల్స్, గర్భాశయంలో పెట్టె పరికరాలు రెండూ ఒత్తిడి, యక్నే, తలనొప్పి, ఇంటర్నల్ బ్లీడింగ్, తిమ్మిర్లు వంటి వాటితో స్త్రీల ఆరోగ్యంలో ప్రభావం చూపిస్తాయి.

అందువల్ల, కొంతమంది పరిశోధకులు దానికి బదులుగా పురుషులకు గర్భనిరోధక పద్ధతులను తీసుకు వచ్చారనే విషయాన్నీ గుర్తుంచుకోండి.

contraceptive

పురుష గర్భనిరోధక పద్ధతి

కొత్త పురుష గర్భనిరోధక పద్ధతి

ప్రస్తుతం, వాసెక్టమీ, కండోమ్స్ (శస్త్రచికిత్స పద్ధతి, శాశ్వతమైనది) ఈ రెండుమత్రమే పురుషులకు అందుబాటులో ఉన్న గర్భనిరోధక పద్ధతులు.

అయితే, వసల్జేల్ అనే కొత్త పద్ధతి పురుషులలో గర్భానిరోధకానికి అద్భుతంగా పనిచేసే వస్తువుని అభివృద్ది చేస్తున్నారు.

వసల్జేల్ అనేది ఒక జెల్, ఇది పురుషులలో ఇంజెక్ట్ చేసి, వీర్యంతోపాటు వీర్య కణాలు బైటికి రాకుండా అపుతాయి, దానివల్ల కండోమ్స్ వాడక పోయినా గర్భం రాదు.

contraceptive

పురుష గర్భనిరోధక పద్ధతి

వసల్జేల్ కోతులలో, కుందేల్లలో గర్భం రాకుండా చేయడానికి అద్భుతంగా పనిచేసినట్టు నిరూపించబడింది. అందువల్ల ఇది పురుషులలో కూడా బాగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు అభిప్రాయ పడ్డారు.

వసల్జేల్ ఇంకా మార్కెట్ లోకి రాలేదు, డానికి శాస్త్రవేత్తలు ఇంకా పరిశోధనలు చేస్తున్నారు, కానీ ఇది చాలా ఆశాజనితమైనది!

English summary

New Contraceptive Method For Men: Can It Work?

If you are a man who does not like using condoms while love making, there could be some good news for you. A ground-breaking research study has come up with a possible contraceptive method for men!
Desktop Bottom Promotion