For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రసవం తర్వాత మహిళ ఖచ్చితంగా తీసుకోవల్సిన జాగ్రత్తలు

ప్రసవం లేదా కాన్పు అనగా మనుషులలో పెరిగిన శిశువును తల్లి గర్భాశయం నుండి బాహ్యప్రపంచంలోనికి తీసుకొని రావడం. ఇది సామాన్యంగా గర్భావధి కాలం పూర్తయిన తర్వాత మొదలవుతుంది.

|

ప్రసవం లేదా కాన్పు అనగా మనుషులలో పెరిగిన శిశువును తల్లి గర్భాశయం నుండి బాహ్యప్రపంచంలోనికి తీసుకొని రావడం. ఇది సామాన్యంగా గర్భావధి కాలం పూర్తయిన తర్వాత మొదలవుతుంది. చాలామంది మహిళలు ప్రసవం తర్వాత తమ ఆరోగ్యం విషయంలో అంతగా శ్రద్ధ తీసుకోరు. గర్భవతిగా ఉన్నప్పుడు తీసుకున్న శ్రద్ధ, జాగ్రత్తలు కాన్పు జరిగిన తర్వాత వారు తీసుకోకపోవడంతో మహిళల్లో పలు రకాల ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి.

డెలివరీ తర్వాత స్ర్తీలలో ఇన్‌ఫెక్షన్‌, జ్వరం రావడం, యూరినరీ ప్రాబ్లమ్స్‌, బ్రెస్ట్‌ ప్రాబ్లమ్స్‌, నరాల్లో రక్తం గడ్డ కట్టడం వంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని డెలివరీ తర్వాత మహిళలు ప్రసవానంతర జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. మహిళల్లో కాన్పు తర్వాత ఏర్పడే ఇన్‌ఫెక్షన్‌లను పర్పురల్‌ ఇన్‌ఫెక్షన్స్‌ అంటారు.

ఈ ఇన్‌ఫెక్షన్‌లు ప్రసవం తర్వాత రక్తం లేనివాళ్లు, ప్రెగ్నెన్సీ సమయంలో బిపి ఉన్నవాళ్లు, బాగా నీరసంగా ఉన్నవాళ్లకి వస్తాయి. దీంతో డెలివరీ సమయంలో బాగా బ్లీడింగ్‌ కావడం, మాయ కిందికి ఉండడం, డెలివరీ తర్వాత మాయ ముక్కలు లోపలే ఉండిపోవడం వల్ల కూడా ఇన్‌ఫెక్షన్‌లు ఏర్పడతాయి. ఈ ఇన్‌ఫెక్షన్‌ల మూలంగా మహిళలకు ఒళ్లు నొప్పులు, నీరసం, కడుపు నొప్పి, వాసనలతో కూడిన వెజినల్‌ డిశ్చార్జ్‌ జరుగుతుంది. గర్భాశయం ఇన్‌ఫెక్షన్‌ వల్ల పొట్ట మొత్తం, శరీరంలో మొత్తం ఇన్‌ఫెక్షన్‌ వ్యాపిస్తుంది. కాబట్టి, ప్రసవం తర్వాత కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ తగ్గించుకోవడంతో పాటు, తీసుకోవల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకుందాం..

ఆహారం:

ఆహారం:

గర్భవతిగా ఉన్నప్పటికంటే కాన్పు తర్వాత ఎక్కువ బలమైన ఆహారం తీసుకోవాలి. అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు, పప్పులు, ధాన్యాలు, మాంసాహారం, పాలు, పండ్లు వంటి ఆహారం తీసుకోవాలి. నీరు ఎంత ఎక్కువగా తాగితే అంత మంచిది. దీనివల్ల మూత్రంలో ఇన్ఫెక్షన్స్, మలబద్దకం వంటివాటిని నివారించవచ్చు. కారం, పచ్చళ్లు, మసాలాలు తినకూడదు. మొదటి మూడు నెలలు ఐరన్, క్యాల్షియం మాత్రలు వాడటం వల్ల కాన్పు తర్వాత వచ్చే రక్తహీనత, నీరసం, నడుమునొప్పి చాలావరకు నివారించవచ్చు.

విశ్రాంతి:

విశ్రాంతి:

తల్లికి మానసిక ప్రశాంతత చాలా అవసరం. సరైన విశ్రాంతి తీసుకోవడం వల్ల, కాన్పు తర్వాత కలిగే అలసట తగ్గుతుంది. పాలు బాగా పడతాయి. సాధారణ కాన్పు తర్వాత వీలైనంత త్వరగా లేచి తిరగడాన్ని, ఆపరేషన్ అయితే డాక్టర్లు చెప్పిన సమయం తర్వాత తల్లి తనంతట తాను లేచి తిరగడాన్ని ప్రోత్సహించాలి. అలా చేయడం వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా, రక్తప్రసరణకు ఆటంకం లేకుండా ఉంటుంది.

వ్యక్తిగత పరిశుభ్రత:

వ్యక్తిగత పరిశుభ్రత:

పరిశుభ్రంగా ఉండటం వల్ల కుట్లు త్వరగా మానడం, చీము పట్టకుండా ఉండటం వంటి సౌలభ్యాలు చేకూరతాయి.

వ్యాయామాలు:

వ్యాయామాలు:

సాధారణ కాన్పు అయ్యాక నెల తర్వాత వ్యాయామాలు మొదలుపెట్టవచ్చు. ఒకవేళ ఆపరేషన్ అయితే తల్లి ఆరోగ్య పరిస్థితిని బట్టి 2-3 నెలల తర్వాత వ్యాయామాలు చేయడం, మంచిది. వ్యాయామం వల్ల పొట్ట కండరాలు, పెల్విక్ కండరాలు దృఢమవుతాయి. నడుమునొప్పి తగ్గుతుంది.

తల్లిపాలు:

తల్లిపాలు:

కాన్పు తర్వాత గంటలోగా బిడ్డకు తల్లి రొమ్మును శుభ్రం చేసి పట్టించాలి. బిడ్డ ఎంత త్వరగా రొమ్మును అందుకుంటే అంత త్వరగా పాలు ఉత్పత్తి అవుతాయి. ఆరు నెలలపాటు తల్లిపాలు ఇవ్వడం తల్లికీ, బిడ్డకూ మంచిది.

ఇన్‌ఫెక్షన్‌:

ఇన్‌ఫెక్షన్‌:

మహిళల్లో కాన్పు తర్వాత ఇన్‌ఫెక్షన్‌ల నివారణకు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి. గర్బం ధరించినప్పుడు రెగ్యులర్‌గా గైనకాలజిస్ట్‌లను సంప్రదించాల్సి ఉంటుంది. డాక్టర్లు రక్తం తక్కువగా ఉన్నవారికి, బిపి ఉన్న వారికి అవసరమైన చికిత్సలు చేస్తారు. ప్రసవానికి ముందు పళ్లలో, చిగుళ్లలో ఇన్‌ఫెక్షన్‌ ఉన్నా, ట్రాన్సిల్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉన్నా వెంటనే ట్రీట్‌మెంట్‌ తీసుకో వాలి. బిపి, షుగర్‌, టిబి, మలేరియా, యూరిన్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉంటే వెంటనే వైద్యం చేయించుకోవాలి. డెలివరీ సమయంలో వాటర్‌ లీక్‌ అవుతుందని తెలిస్తే డాక్టర్లు ముందే ట్రీట్‌మెంట్‌చేస్తారు.

గర్భం సమయంలో ఏవైనా గాయాలు ఏర్పడితే చాలా జాగ్రత్తగా వాటికి వైద్యం చేయించుకోవాలి

గర్భం సమయంలో ఏవైనా గాయాలు ఏర్పడితే చాలా జాగ్రత్తగా వాటికి వైద్యం చేయించుకోవాలి

గర్భం సమయంలో ఏవైనా గాయాలు ఏర్పడితే చాలా జాగ్రత్తగా వాటికి వైద్యం చేయించుకోవాలి. ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే మహిళలకు టెంపరేచర్‌, పల్స్‌ చెకప్‌, బిపి, లీవర్‌, లంగ్స్‌ చెకప్‌ చేస్తారు. గర్భం తర్వాత స్కిన్‌ ఇన్‌ఫెక్షన్‌, గర్భాశయం కరెక్ట్‌గా మూసుకున్నదా లేదా అని డాక్టర్లు చూస్తా రు. వెజినల్‌, సర్విక్స్‌ నుంచి యూరిన్‌, బ్లడ్‌ టోటల్‌ కౌంట్‌, డిఫరెన్షియల్‌ కౌంట్‌ను డాక్టర్లు పరీక్షిస్తారు. బ్లడ్‌ టెస్ట్‌తో పాటు ఎక్స్‌రే, మలేరియా టెస్ట్‌లను సైతం నిర్వహిస్తారు. డెలివరీ సమయంలో రక్తం తక్కువగా ఉన్నవారికి రక్తం ఎక్కిస్తారు. అవసరమైన వారికి యాంటీబ యాటిక్స్‌ను అందిస్తారు.

యూరినరీ సమస్యలు...:

యూరినరీ సమస్యలు...:

కాన్పు తర్వాత కొందరు మహిళలకు యూరినరీ ఇన్‌ఫెక్షన్స్‌ వస్తాయి. ఇటువంటి వారు వెంటనే డాక్టర్ల వద్ద వైద్యం చేయించుకోవాలి. ఈ మహిళలు మంచినీటిని బాగా తాగాలి. ఇటువంటి వారు మూత్ర విసర్జనను ఆపుకోకూడదు. వీరికి మూత్ర విసర్జన సమయంలో మంట, నొప్పి రావచ్చు. యూరిన్‌ బ్లాడర్‌లో వాపు కూడా రావచ్చు. యూరిన్‌ ఇన్‌ఫెక్షన్‌ రావడానికి ఓవర్‌ ఫ్లో, వెజినల్‌ డ్యామేజీ కారణం కావచ్చు. దగ్గినప్పుడు నొప్పి రావచ్చు. కొన్నిసార్లు యూరిన్‌ ఔట్‌పుట్‌ తక్కువగా ఉండవచ్చు.

బ్రెస్ట్‌ సమస్యలు...:

బ్రెస్ట్‌ సమస్యలు...:

ప్రసవం తర్వాత కొందరు మహిళ లకు బ్రెస్ట్‌ సమస్యలు ఎదురవుతాయి. వీరికి బ్రెస్ట్‌లో నొప్పులు ఏర్పడతాయి. ఇటువంటి వారు వెంటనే డాక్టర్‌ను సంప్రదించి వైద్యం చేయించుకోవాలి. బ్రెస్ట్‌లలో నొప్పి ఎక్కువగా ఉండే పెయిన్‌ కిల్లర్‌ మందులను వాడాల్సి ఉంటుంది. కొన్నిసార్లు బ్రెస్ట్‌ చుట్టూ అల్సర్లు ఏర్పడి నొప్పి రావచ్చు. దీనివల్ల శిశువుకు పాలిచ్చేటప్పుడు నొప్పి కలుగుతుంది. దీంతో కొన్నిసార్లు జ్వరం కూడా వస్తుంది. ఇటువంటివారికి బ్రెస్ట్‌ నొప్పి నివారణకు క్రీమ్‌ రాసుకోవడం, పెయిన్‌ కిల్లర్‌ మందులను వాడాల్సి ఉంటుంది. అల్సర్‌లు ఎక్కువగా రోజులు ఉంటే క్యాన్సర్‌ పరీక్షలు సైతం చేసుకోవాలి.

రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టుకోవడం...:

రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టుకోవడం...:

కాళ్ల నరాల్లో, పెల్విక్‌ నరాల్లో కొన్నిసార్లు రక్తం గడ్డకట్టుకుపోతుంది. నరాల నొప్పి, గుండె సంబంధిత వ్యాధులు, బిపి, షుగర్‌ ఉన్నవాళ్లకి ఈ సమస్య ఏర్పడుతుంది. వీరు యాంటిబయాటిక్స్‌ తీసుకుంటూ విశ్రాంతి తీసుకోవాలి. కొన్నిసార్లు కాళ్ల నరాల మీద వత్తిడి పడి నొప్పులు రావచ్చు. డెలివరీ తర్వాత బ్లీడింగ్‌ కావడం, షాక్‌కు గురవ్వడం, ఫిట్స్‌ రావడం, లంగ్స్‌లో సమస్యల వల్ల రక్త నాళాల్లో రక్తం గడ్డ కట్టుకుపోతుంది. ఇటువంటి వారు గైనకాలజిస్ట్‌ చేత వెంటనే వైద్యం చేయించుకోవాలి. వీరు రెగ్యులర్‌గా పోస్ట్‌నాటల్‌ ఎక్సర్‌సైజులు చేయా లి. బ్లీడింగ్‌ ఎక్కువగా ఉన్న ప్పుడు, డిశ్చార్జి అవుతు న్నప్పుడు వెంటనే చెకప్‌చే యించుకోవాలి.

English summary

The New Mother: Taking Care of Yourself After Birth

The first few weeks after childbirth are called the postpartum period. During this time your body goes through many changes. The following information can help you understand these changes and offers suggestions about how to take care of yourself.
Desktop Bottom Promotion