‘ ఇంకా పిల్లల్లేరు..’ ! పిల్లలు కలగకపోవడానికి అసలు కారణాలేంటి..?

‘ ఇంకా పిల్లల్లేరు..' ప్రస్తుత రోజుల్లో చాలా జంటల నుంచీ తరచూ వినిపిస్తున్న మాట ఇది.ఒకప్పుడు ఇందుకు అనారోగ్యాలు మాత్రమే కారణమయ్యేవి. ఇప్పుడు అదనంగా జీవనశైలి సమస్యలూ వచ్చిచేరాయి.

Posted By:
Subscribe to Boldsky

' ఇంకా పిల్లల్లేరు..' ప్రస్తుత రోజుల్లో చాలా జంటల నుంచీ తరచూ వినిపిస్తున్న మాట ఇది.

ఒకప్పుడు ఇందుకు అనారోగ్యాలు మాత్రమే కారణమయ్యేవి. ఇప్పుడు అదనంగా జీవనశైలి సమస్యలూ వచ్చిచేరాయి. ఇక ఉండనే ఉంది.. పని ఒత్తిడి!! నేటితరంలో ఈ మూడూ సంతానలేమికి ఎలా కారణమవుతున్నాయి?

Why Modern Women Are Not Getting Pregnant?

ఈ రోజుల్లో చాలామంది మహిళలు ఉద్యోగాలు చేస్తూ సరైన జీవనవిధానాన్ని అనుసరించడంలేదు. వేళకు తినక, నిద్రపోక, శారీరక శ్రమలేక తోచినట్లు గడిపేస్తున్నారు. బరువు పెరుగుతున్నారు. గర్భం రాకపోవడానికి స్థూలకాయం కూడా ప్రధాన కారణమే.

పిల్లలు లేరని బాధపడుతున్నారా..? గర్భధారణకు సరైన సమయం ఏంటో తెలుసుకోండి..!?

ఇంకొందరు ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంటారు. ఎప్పుడూ సన్నగా ఉండిపోవాలనే ఉద్దేశంతో ఆహారం సరిగ్గా తీసుకోరు. విపరీతంగా బరువు తగ్గుతారు. ఇది కూడా సంతానలేమికి దారితీస్తోంది. అసలు వ్యాయామం చేయకపోవడం, అతిగా వ్యాయామం రెండూ అండం విడుదలలో సమస్యలు సృష్టిస్తాయి. వీటితో పాటు మరికొన్ని కారణాలు...

సంపూర్ణ శాకాహారులు! గా మారడం వల్ల

నేటితరం యువతులు కేవలం వెగాన్‌ (సంపూర్ణ శాకాహారులు!)గా మారుతున్నారు. వీళ్లు కనీసం పాలైనా తాగరు. ఇలాంటివారికి ఇనుము, ఫోలిక్‌యాసిడ్‌, జింక్‌, బి12 వంటి పోషకాలు అందవు. దాంతో సంతాన సాఫల్య సామర్థ్యం తగ్గే ప్రమాదం ఉంటుంది.

నేటి జీవితంలో రసాయనాల వాడకం ఎక్కువ.

నేటి జీవితంలో రసాయనాల వాడకం ఎక్కువ. ఇంట్లోవాడే క్రిమిసంహారకాలూ, లోహాల ప్రభావం కారణంగానూ అండం విడుదలలో ఇబ్బందులొస్తాయి.

పని ఒత్తిడి కూడా.. :

ఆఫీసులో ఎక్కువ సమయం గడపాల్సి రావడం, ఒత్తిడి కారణంగా నిద్ర తగ్గడం, మానసిక ఆందోళనలు, ఆహార నియమాలూ, వ్యాయామానికి ఆస్కారం లేకపోవడం, ఇవన్నీ స్త్రీ, పురుషులని లైంగిక చర్యకు దూరం చేస్తున్నాయి. ఇద్దరి ఏకాంతంపైనా ప్రభావం చూపిస్తున్నాయి.

పీసీఓఎస్‌

కొందరు మహిళలకు నెలనెలా అండం సరిగ్గా విడుదలకాదు.. కొందరికి అసలు విడుదల ప్రక్రియే ఉండదు. చాలామందిలో చిన్నతనంలోనే పీసీఓఎస్‌ (పాలిసిస్టిక్‌ ఒవేరియన్‌ సిండ్రోమ్‌) ఉంటుంది. దానివల్ల అండాల విడుదల ఓ పద్ధతి లేకుండా జరుగుతుంది. వీరిలో యాండ్రోజెన్‌ హార్మోను కూడా ఎక్కువగా విడుదలై సంతానప్రాప్తికి దూరం చేస్తుంది.

థైరాయిడ్‌ గ్రంథి పనితీరు ఎక్కువ లేదా తక్కువగా ఉండటం

థైరాయిడ్‌ గ్రంథి పనితీరు ఎక్కువ లేదా తక్కువగా ఉండటం, క్యాన్సర్‌ వంటి సమస్యలు కూడా సంతానలేమికి దారితీస్తాయి.

గర్భాశయంలో, ఫెలోపియన్‌ ట్యూబుల్లో సమస్యలు ఉండటం

గర్భాశయంలో, ఫెలోపియన్‌ ట్యూబుల్లో సమస్యలు ఉండటం ఓ కారణం. లైంగికంగా సంక్రమించే వ్యాధుల్లో క్లమీడియా ఫెలోపియన్‌ ట్యూబులపై ప్రభావం చూపిస్తుంది. అప్పుడు వాటిలో అడ్డంకులు ఏర్పడతాయి.

గర్భాశయ ముఖద్వారం చిన్నగా ఉండటం

గర్భాశయ ముఖద్వారం చిన్నగా ఉండటం, ఫైబ్రాయిడ్లు, ఎండోమెట్రియోసిస్‌ వంటివాటితోనూ త్వరగా గర్భం రాదు.

రేడియో, కీమో థెరపీ ప్రభావం వల్లా సంతానలేమి

కొన్నిరకాల మందులూ, రేడియో, కీమో థెరపీ ప్రభావం వల్లా సంతానలేమి ఏర్పడుతుంది.

ఇన్‌ఫెక్షన్లూ, మధుమేహం, అధికరక్తపోటూ

పురుషుల్లో అయితే కొన్నిరకాల ఇన్‌ఫెక్షన్లూ, మధుమేహం, అధికరక్తపోటూ వంటి కారణాల వల్ల వీర్యకణాల సంఖ్య తగ్గుతుంది.

English summary

Why Modern Women Are Not Getting Pregnant?

Why Modern Women Are Not Getting Pregnant?,Have you been trying with all your might to get pregnant and were not able to? Well, it could be due to a few medical reasons. If you are seeking medical attention, this problem will be resolved in time.
Story first published: Monday, February 27, 2017, 18:30 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter