For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆకుకూరలను పరిశుభ్రంగా కడగడం ఎలా...?

|

ఆకుపచ్చని, ఆకు కూరలను చక్కగా, తేలిగ్గా "గ్రీన్స్" అంటాం. అంటే పాలకూర, క్యాబేజీ, బచ్చలి కూర లాంటివన్నమాట. దురదృష్టవశాత్తూ మీ శరీరంలోకి చేరకూడదని కోరుకునే క్రిమి సంహారకాలు, ఇతర రసాయనాలను ఇవి బాగా పట్టుకుంటాయి. అవి సేంద్రియమైనవి అయినప్పటికీ మట్టి ఉండవచ్చు, ఇంకా దాన్ని పట్టుకున్న వారి నుంచి ఇంకేమి అ౦టుకున్నాయో ఎవరికీ ఎరుక? అందుకని మీరు వాటిని శుభ్రం చేయాలి. వాటిని శుభ్రం చేయడానికి అన్నిటికన్నా తేలిక మార్గం షి౦క్ లో బోల్డన్ని నీటితో కడగడమే.

చర్యలు:

1. షింక్ ను లోపలా, అంచుల వెంటా బాగా కడగండి, ఎలాంటి సబ్బు నురగా మిగలలేదని నిర్ధారించుకోవాలి. అది క్రిమిరహితం కావక్కర్లేదు కానీ, నీటితో బాగా కడిగి ఆహార పదార్ధాల వ్యర్ధాలు, ఇతర కాలుష్య కారకాలు ఉండకుండా చూసుకోవాలి. షింక్ ఎంత పెద్దది అయితే అంత మంచిది.

2. షింక్ ను ఆపండి, కానీ ఇప్పుడే నీటి తో ని౦పకండి.

3. పాలకూర తల భాగాన్ని వేరు చేయడానికి తేలిక మార్గం తెలుసుకోండి - కాడ భాగం క్రిందికి ఉండేలా మీ చేతుల్లో దాన్ని గట్టిగా పట్టుకోండి (కానీ పిండవద్దు), ఇప్పుడు కాడ భాగాన్ని బల్ల మీద వుంచి కోయండి. ఒకటి రెండు సార్లు ఇలా చేయగానే ప్రధాన భాగం విదిపడుతుంది. అప్పుడు మీరు ఆకులను విడివిడిగా తీసి (ఇక ఆకుల మధ్య ఏమీ అతుక్కునేవి లేకుండా ఉండేలా) వాటిని షింక్ లో పడవేయండి. చిన్న ఆకుకూరలకు కాడను బొటన, చూపుడు వేళ్ళతో తుంచి వేయవచ్చు. ఆకుకూరల నుంచి గట్టి కాడలు వేరు చేయాలంటే, వాటిని కాడలతో సహా మధ్యకు మడిచి ఒక చేత్తో కాడలకు దగ్గరగా పట్టుకోండి. రెండో చేత్తో కాడను మొదలు నుంచి ఆకు చివరికి చింపి వేయండి. మధ్య భాగాన్ని వదలి వేయండి(దాంతో మీరు ఇంకేదైనా వండాలనుకుంటే తప్ప), అలానే గట్టి కాడలను కూడా.

How to Clean Greens

4. షింక్ ను చల్లటి నీటి తో నింపండి.

5. ఆకుకూరలను చేత్తో మెల్లిగా కదపండి - దాని వల్ల వాటిలో నీరు బాగా ప్రసరించాలి. ప్రతీ ఆకును ముంచి నీటిలో అటూ ఇటూ తిప్పండి.

6. ఆకులను కొద్ది సేపు నీటి లో ఉండనివ్వండి, దాని వల్ల మట్టి షింక్ అడుగు భాగానికి చేరుకుంటుంది.

7. ఒకటి రెండు ఆకులను ఒకసారి చొప్పున బయటకు తీసి, మీకు కావలసిన పరిమాణం లోకి చి౦పుకోండి లేదా తర్వాత వాడడానికి మొత్తాన్ని అలా వదిలేయండి. మీరు ఆకును బయటకు తీసాక కూడా అది మురికిగా అనిపిస్తే నీటిలో దాన్ని మెల్లిగా కదిలించండి లేదా మీకు రెండు షింక్ లు వుంటే రెండో షింక్ లో పంపు క్రింద వుంచి కడగండి. నీటి ని (మట్టిని)మరీ కలపకుండా చూసుకోండి.

8. ఆకులను ఒక చిల్లుల పాత్ర లో వుంచండి. మీరు ఈ పాత్రను షింక్ లో ఉంచేటట్లైతే షింక్ ను పూర్తిగా నీటి తో శుభ్రం చేసి అవశేషాలు పోయాయని నిర్ధారించుకోండి. ఆకుకూరల నుంచి అదనపు నీటిని తొలగించాలంటే, వాటిని ఒక పెద్ద కాటన్ గుడ్డ మధ్యలో వుంచండి. (36'x36'). ఈ గుడ్డ నాలుగు కొసలూ కలిపి గట్టిగా పట్టుకొండి. బయటకు వెళ్లి (లేదా షవర్ స్టాల్ లో) మీ చేతిని గుండ్రంగా ఊపండి. ఈ అపకేంద్ర చర్య వల్ల నీరు బయటకు వెళ్ళిపోతుంది.అప్పుడు మీ మిగతా వంట తయారయ్యే లోగా ఈ వస్త్రాన్ని తెరిచి వుంచి ఆకుకూరలను చల్లగా, పొడిగా వున్న చోట పెట్టి, వాటి మరి కాస్త పొడిబారనివ్వండి. మీరు సలాడ్ స్పిన్నర్ ను కూడా వాడవచ్చు కానీ, వస్త్రం తో ఐతే చేయడ౦ తేలిక, చౌక. ఎండిన ఆకుకూరలు సలాడ్ లు గా బాగా పనికి వస్తాయి. కడుగు నీటి తో సలాడ్ డ్రస్సింగ్ పల్చబడదు, సలాడ్ నిల్వ చేసినా ఆకులు కుళ్ళకుండా వుంటాయి.

చిట్కాలు:

మీ ఆకుకూరల మీద ఏవైనా పురుగుల్లాంటివి ఉంటె మీరు వాటిని మరికాసేపు ఎక్కువ నాననివ్వాలి. నీరు ఎంత వేడిగా వుంటే ఆ పురుగుల్ని వదిలించడం అంత తేలిక, ప్రత్యేకంగా మీరు కాలే లాంటి ఆకుకూరలను కడుగుతుంటే.

కొద్దిగా ఉప్పు చేర్చడం వల్ల కూడా పురుగులు చనిపోయి, అవి ఆకుకూరల నుంచి విడివడతాయి.అవసరమైతే విడతల వారీగా కడగండి.

షింక్ సౌకర్యం అందుబాటులో లేకపోతె సి గ్రీన్స్ ను కూడా పెద్ద పాత్రల్లో లేదా కుండలో కడగవచ్చు.

హెచ్చరికలు:

మీరు పాలకూర లాంటి ఆకుకూరలు వాడుతున్నప్పుడు సౌమ్యంగా, మెల్లిగా కడగకపొతే పాలకూర ముడుచుకుపోతుంది.

కొన్ని ఆకుకూరలను ముందే కడిగి అమ్ముతారు. అయినా వీటిని మీరు షింక్ లో చల్లటి నీటిలో కడగాల్సిందే ఎందుకంటే మూడు సార్లు కడిగిన సంచుల్లో కూడా మట్టి కనబడుతూనే వుంటుంది.

మీ వాషింగ్ మెషీన్ లో సబ్బు, బ్యాక్టీరియా లేకుండా ఉండాలంటే, మీ మెషిన్ ను ఉతకడానికి వాడే ముందు ఒకసారి రిన్స్ సైకిల్ లో తిప్పండి లేదా వేడి నీటి తో ఒక ఖాళీ లోడ్ నడపండి.

ముల్లంగి, ఆవాలు, కొల్లార్డ్ లాంటి ఆకుకూరలు లాంటి మట్టిలో మొలిచే ఆకుకూరల విషయంలో గుర్తుంచుకోవాల్సింది ఏమిట౦టే మీరు వాటిని ఎటూ ఉదాకపెడతారు కాబట్టి క్రిమిరహిత వాషర్ అక్కర్లేదు.

మీ ఇంట్లో పిల్లలు ఉంది, ప్రమాదాలు జరగడం సాధారణం ఐతే మీ ఆకుకూరలు కడిగే ముందు కొంచెం బ్లీచింగ్ పౌడర్ వేసి ఖాళీ లోడ్ తిప్పండి. ఆకుకూరలను బ్లీచ్ లో కడగకండి. సూక్ష్మ క్రిములను చంపడానికి కొంచెం బ్లీచింగ్ వేసి ఖాళీ లోడ్ (నీరు మాత్రం) తిప్పండి.

English summary

How to Clean Greens | ఆకుకూరలు కడగడం ఎలా?

"Greens" is just a nice, quick way of saying green, leafy vegetables. These are veggies like lettuce,cabbage, and spinach. Unfortunately, these leaves are great for catching pesticides and other chemicals that you may not want in your body.
Story first published: Wednesday, January 9, 2013, 18:11 [IST]
Desktop Bottom Promotion