For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వీకెండ్ స్పెషల్ 10 వెరైటీ చికెన్ వంటలు

|

సహజంగా శాకాహారంలో ప్రతి రోజూ రకరకాల తాజా గ్రీన్ లీఫీ వెజిటెబుల్స్ తో వంటలు వండుకొని తింటారు. అదే మాంసాహారులలైతే....? వీరు మాత్రం ఎక్కువగా చికెన్, మటన్, ఫిష్ వంటివి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే మాంసాహారులు ఎప్పుడూ ఒక రకమైన వంటకాన్ని రుచి చూడం వల్ల కొంత బోరు అనిపించవచ్చు. అలా బోరు అనిపించే రుచులు కాకుండా, ఈ వీకెండ్ స్పెషల్ గా కొన్ని విభిన్నమైన రుచులకు మీ ముందుకు తీసుకొస్తోంది తెలుగు బోల్డ్ స్కై. కామ్.

ఆదివారం అనగానే కుటుంబ సభ్యులు అందరూ ఇంట్లో ఉంటారు. కాస్త స్పెషల్ వంటకాలు ఉండాలని అనుకుంటారు. మాంసాహారం తినేవాళ్లకైతే తప్పనిసరి ఆదివారం నాన్ వెజ్ ఉండాల్సిందే లేకపోతే వెలితిగా ఉంటుంది. మాంసంతో కూరలు వగైరా చేసుకోవడం తెలుసు కాని కాస్త వెరయిటీగా ఎలా తయారు చేయడమో చాలా మందికి తెలియదు. మాంసాహార ప్రియల్లో చాలా మందికి చికెన్ అంటే మహా ఇష్టం. చికెన్ కొవ్వుపదార్ధము తక్కువగా ఉండి పోషకాలు, మాంసకృత్తులు అధికంగా ఉంటాయి. తేలికగా జీర్ణము అవుతుంది. కోడిమాంసము వేడి చేస్తుందని అనుకోవడం సరైనది కాదు... ఇది మంచి పౌష్టికాహారము. కాబట్టి పూర్తి ప్రోటీనులను అంధించే చికెన్ వంటలను వీకెండ్ స్పెషల్ గా మీ ముందు ఉంచుతున్నాము...

<a href= లగాన్ కా ముర్గ్ : స్పైసీ చికెన్ రిసిపి" title=" లగాన్ కా ముర్గ్ : స్పైసీ చికెన్ రిసిపి" class="sliderImg image_listical" width="600" height="338" loading="lazy"/>

లగాన్ కా ముర్గ్ : స్పైసీ చికెన్ రిసిపి

లగాన్ కా ముర్గ్ స్పైసీ మరియు టేస్టీ చికెన్ కర్రీ రిసిపి. ఇది ఒక మోస్ట్ పాపులర్ హైదరాబాదీ రిసిపి. వివిధ రకాల ఇండియాన్ మసాలా దినుసులతో తయారుచేసే ఈ హైదరాబాదీ చికెన్ రిసిపి మంచి ఫ్లేవర్ తో పాటు, అద్భుతమైన రుచి కలిగి ఉంటుంది. మసాలాలను ముందుగా వేయించుకొని మ్యారినేట్ చేయడం వల్ల అంత అద్భుతమైన రుచి ఫ్లేవర్ కలిగి ఉంటుంది. ఈ టేస్టీ అండ్ స్పైసీ రిసిపి తయారుచేయడానికి కొంత సమయం పడుతుంది.

<a href=స్పైసీ చికెన్ మసాలా బర్త -వీకెండ్ స్పెషల్" title="స్పైసీ చికెన్ మసాలా బర్త -వీకెండ్ స్పెషల్" class="sliderImg image_listical" width="600" height="338" loading="lazy"/>

స్పైసీ చికెన్ మసాలా బర్త -వీకెండ్ స్పెషల్

చికెన్ బర్త ఒక పాపులర్ డిష్ . దీన్ని రోటీలు మరియు రైస్ తో సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ నాన్ వెజిటేరియన్ రిసిపిని చికెన్ మరియు ఇండియన్ మసాలా దినుసులతో తయారుచేస్తారు . ఇది చూడటానికి నార్మల్ బర్త్ లా గా ఉంటుంది . అయితే కొంచెం స్పైసీగా ఉంటుంది.

<a href=నోరూరించే మ్యాంగో చికెన్ కర్రీ సమ్మర్ స్పెషల్" title="నోరూరించే మ్యాంగో చికెన్ కర్రీ సమ్మర్ స్పెషల్" class="sliderImg image_listical" width="600" height="338" loading="lazy"/>

నోరూరించే మ్యాంగో చికెన్ కర్రీ సమ్మర్ స్పెషల్

ఈ కాలంలో అందరి కళ్లు మామిడి చెట్లమీదే. ఆకుల మధ్యన వేలాడే పచ్చి మామిడికాయలను చూడగానే ఎంతటివారికైనా నోట్లో నీళ్లు ఊరుతాయి. పుల్లటివైతే పప్పులో వేసుకుంటారు. కాస్త పులుపు తక్కువగా ఉంటే ప్లేట్లో ఉప్పు, కారం వేసుకుని లాగిచేస్తారు. కాయలు పళ్లయ్యేవరకూ ఆగడమంటే చాలా కష్టం. రెండు కాయలందుకుంటే గాని మనసు ఊరుకోదు. సి విటమిన్‌తో పాటు వేసవిలో ఒంటికి చలువ చేసే పచ్చిమామిడితో పప్పు, పులుసే కాకుండా బోలెడన్ని వెరైటీ వంటలు చేసుకోవచ్చు.

<a href=గార్లిక్ చికెన్ గ్రేవీ: డైటర్స్ స్పెషల్" title="గార్లిక్ చికెన్ గ్రేవీ: డైటర్స్ స్పెషల్" class="sliderImg image_listical" width="600" height="338" loading="lazy"/>

గార్లిక్ చికెన్ గ్రేవీ: డైటర్స్ స్పెషల్

గార్లిక్ మరియు చికెన్ కాంబినేషన్ ఒక కాంటినెంటల్ స్పెషల్ రిసిపి. గార్లిక్ ఫ్లేవర్ చికెన్ కు ఒక మంచి కాంబినేషన్. గార్లిక్ చికెన్ వివిధ రకాలుగా వండుతారు. గార్లిక్ చికెన్ రిసిపి చాలా సావరీగా ఉంటుంది. ప్రస్తుత రోజులు వెరైటీగా వంటలు తయారుచేసుకోవడానికి చాలా మంది ఎక్కువ సమయాన్ని గడపడం లేదు. కాబట్టి, చాలా త్వరగా తయారయ్యే వంటల్లోనే, ఆరోగ్యకరమైనవి మనకు చాలా అవసరం అవుతుంది. కాబట్టి, ఈ గార్లిక్ చికెన్ కర్రీ చాలా త్వరగా తయారవుతుంది.

టమాటా పెప్పర్ చికెన్ కర్రీ : వీకెండ్ స్పెషల్

టమాటా పెప్పర్ చికెన్ కర్రీ : వీకెండ్ స్పెషల్

చికెన్ తినడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు? చికెన్ ను ఏ స్టైల్లో అయినా తయారుచేయవచ్చు. చాలా మంది చికెన్ తో వివిధ వెరైటీలను తయారుచేస్తారు. చికెన్ హెల్తీ ఫుడ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే, ఇందులో ప్రోటీనులు అధికంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి మంచిది.

<a href=టేస్టీ అండ్ స్పైసీ చికెన్ రిసిపి(వీడియో)" title="టేస్టీ అండ్ స్పైసీ చికెన్ రిసిపి(వీడియో)" class="sliderImg image_listical" width="600" height="338" loading="lazy"/>

టేస్టీ అండ్ స్పైసీ చికెన్ రిసిపి(వీడియో)

సీజన్ తో సంబంధం లేకుండా మన ఇండియన్స్ హాట్ అండ్ స్పైసీ చికెన్ తినడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. బయట ఎంత ఎండలున్నా, వేడిఉన్నా స్పైసీ చికెన్ తినాలనే కోరిక ఎప్పుడూ మనల్ని టెప్ట్ చేస్తుంటాయి . చికెన్ ఫ్రైని ఎప్పుడూ వివిధ రకాలుగా తయారుచేస్తుంటారు.

<a href=ట్యాంగీ మ్యాంగో చికెన్ కర్రీ: సమ్మర్ స్పెషల్" title="ట్యాంగీ మ్యాంగో చికెన్ కర్రీ: సమ్మర్ స్పెషల్" class="sliderImg image_listical" width="600" height="338" loading="lazy"/>

ట్యాంగీ మ్యాంగో చికెన్ కర్రీ: సమ్మర్ స్పెషల్

వేసవి వచ్చిందంటే చాలు ఎక్కడ చూసిన మామిడి పండ్ల ఘుమఘములే. ఈ రుచికరమైన పండ్లను తినడానికి ప్రతి ఒక్కరూ సంవత్సరం అంతా వేచిఉంటారు. మామిడి పండ్లు, పండువైనా, పచ్చివైనా సరే తినడానికి చాలా మంది ఇష్టపడుతారు. ముఖంగా ఆవకాయ పెడుతుంటారు. దీన్ని సంవత్సరం పొడవును ఆవకాయతో ఎంజాయ్ చేస్తుంటారు. అందుకే ఈ మామిడి పండ్లను కింగ్ ఆఫ్ ఫ్రూట్ అంటుంటారు.

<a href=టేస్టీ చికెన్ మసాలా రైస్ రిసిపి" title="టేస్టీ చికెన్ మసాలా రైస్ రిసిపి" class="sliderImg image_listical" width="600" height="338" loading="lazy"/>

టేస్టీ చికెన్ మసాలా రైస్ రిసిపి

సాధారణంగా మనకు ఇష్టమైన వంటలు కొన్ని ప్రత్యేకంగా ఉంటాయి. వాటిని మళ్ళీ మళ్ళీ తయారు చేయడానికి విసుగు అనిపించదు. ఎందుకంటే వాటి రుచి అంత అద్భుతంగా ఉంటాయి కాబట్టి. అలాంటి వాటిలో కుటుంబ సభ్యులు, స్నేహితులు అమితంగా ఇష్టపడే వంట స్పైసీ చికెన్ మసాలా రైస్.

<a href= రుచికరమైన పాలక్ చికెన్ ఫ్రై" title=" రుచికరమైన పాలక్ చికెన్ ఫ్రై" class="sliderImg image_listical" width="600" height="338" loading="lazy"/>

రుచికరమైన పాలక్ చికెన్ ఫ్రై

పాలకూర మరియు చికెన్ ఈ రెండింటి క్లాసిక్ కాంబినేషన్ చాలా అద్భుతమైన రుచి కలిగి ఉంటుంది. పాలక్ -చికెన్ ఫ్రైని ఇండియన్ మసాలాలతో తయారుచేస్తారు. చాలా సింపుల్ గా త్వరగా తయారుచేసుకోవచ్చు.

<a href=చికెన్ ఆనియన్ పకోడ రిసిపి: ఈవెనింగ్ స్నాక్" title="చికెన్ ఆనియన్ పకోడ రిసిపి: ఈవెనింగ్ స్నాక్" class="sliderImg image_listical" width="600" height="338" loading="lazy"/>

చికెన్ ఆనియన్ పకోడ రిసిపి: ఈవెనింగ్ స్నాక్

చాలా మంది క్రిస్పీ మరియు ఫ్రైడ్ ఫుడ్స్ ను ఎక్కువగా ఇష్టపడుతారు. ఈవెనింగ్ అయ్యే సరికి ఒక కప్పు కాఫీతో పాటు, ఏదైనా వేడివేడి స్నాక్స్ తినాలని కోరుకుంటాం. అందులో క్రీస్పీగా ఉండేవి ఎక్కువగా ఇష్టపడుతారు. సాధారణంగా ఈవెనింగ్ స్నాక్స్ చాలా మంది ఇష్టపడుతారు. అందులో చికెన్ ఆనియన్ పకోడను మరింత ఎక్కువగా ఇష్టపడుతారు.

Read more about: indian cuisine non veg spices
English summary

10 Variety Chicken Recipes: Weekend Special

&#13; Indian cuisine is like a boon for the foodies. The variety of dishes, the use of exotic spices and fragrances in the Indian food makes India a foodie's haven. Every dish in India is cooked in a different style as you move from one region to another. Chicken is one such delightful food whose preparation differs in almost every region of India.
Story first published: Saturday, May 17, 2014, 12:27 [IST]
Desktop Bottom Promotion