For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చికెన్ కర్రీ: టేస్టీ సౌత్ ఇందియన్ రిసిపి

|

సౌత్ ఇండియన్ చికెన్ కర్రీ చాలా టేస్ట్ గా ఉంటాయి. ముఖ్యంగా చికెన్ వంటలు స్పైసీగా నోరూరిస్తుంటాయి. ఈ మాంసాహారాల వంటలకు కొన్ని మసాలాలు జోడించి తయారుచేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది.

ఈ సింపుల్ చికెన్ కర్రీ రిసిపికి పచ్చిమిర్చి, కారం, టమోటోలు అదనపు టేస్ట్ ను అందిస్తాయి. అంతే కాదు, ఈ చికెన్ రిసిపి తయారుచేయడం చాలా సులభం. ఈ టేస్టీ చికెన్ కర్రీ రిసి చపాతీలు లేదా తందూరి రోటీలకు చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ టేస్టీ రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం...

20 Minute Chicken Curry Recipe

కావల్సిన పదార్థాలు:
చికెన్:- 500 gms
ఉల్లిపాయలు- 5 (సన్నగా కట్ చేసుకోవాలి)
టమోటోలు- 3 (సన్నగా కట్ చేసుకోవాలి)
పచ్చిమిర్చి - 1 (సన్నగా కట్ చేసుకోవాలి)

READ MORE: స్పైసి పెప్పర్ క్యాప్సికమ్ చికెన్ రిసిపి

బంగాళదుంపలు- 2 (తొక్కతీసి సన్నగా కట్ చేసుకోవాలి)
దాల్చిన చెక్క - 2
లవంగాలు - 2
అల్లం, వెల్లుల్లి పేస్ట్- 1 ½ tbsp
కారం - 1 tbsp
పసుపు - 1 tsp
ఉప్పు: రుచికి సరిపడా
నీళ్ళు - 1 cup
నూనె- 3 tbsp

తయారుచేయు విధానం:

1. ముందుగా రెండు చెంచాలా నూనెను ప్రెజర్ కుక్కర్లో వేసి వేడి అయ్యాక అందులో లవంగాలు మరియు దాల్చిన చెక్క వేసి ఒక నిముషం తక్కువ మంట మీద వేగించుకోవాలి.

2. ఇప్పుడు అందులో సన్నగా తరిగి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించాలి. కొద్దిసేపటి తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.

READ MORE: లో ఫ్యాట్ కర్డ్ చికెన్ కర్రీ రిసిపి

3. తర్వాత అందులో టమోటోలు మరియు పచ్చిమిర్చి వేసి మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.

4. ఇప్పుడు అందులో పసుపు, కారం మరియు ఉప్పు వేసి 5-10నిముషాలు వేగించుకోవాలి.

5. ఇప్పుడు కుక్కర్లో చికెన్ ముక్కలు మరియు ఒక గ్లాసు నీళ్ళు పోసి బాగా మిక్స్ చేసి ఉడికించుకోవాలి.

6. తర్వాత ప్రెజర్ కుక్కర్ మూత పెట్టి 15నిముషాలు (4-5)విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.

7. చికెన్ మెత్తగా ఉడికిన తర్వాత అందులో బంగాళదుంప ముక్కలు కొద్దిగా నీళ్ళు పోసి మిక్స్ చేసి, విజిల్ పెట్టకుండా మూత పెట్టి తక్కువ మంట మీద మరికొద్దిసేపు ఉడికించుకోవాలి.

English summary

20 Minute Chicken Curry Recipe/సౌత్ ఇండియన్ స్టైల్ చికెన్ కర్రీ రిసిపి/

In South India chicken curries have always been a treat on Sundays in every home. Chicken is a lean meat loved by dieters as well as the elderly. The soft tender meat is juicy in nature which is why when the spices are added the taste is enhanced to something that is truly out of the world.
Desktop Bottom Promotion