For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుడ్డు -బంగాళదుంప కర్రీ: డిన్నర్ స్పెషల్

|

అండే ఆలూ కా సాలన్ రిసిపి నార్త్ ఇండియాలో బాగా పాపులర్ అయినటువంటి వంటకం. ఈ బంగాలదుంప మరియు గుడ్డు కర్రీని కొన్ని మసాలా దినుసులు జోడించి చాలా సింపుల్ గా తయారుచేస్తుంటారు. మీరు ఎగ్ లవర్స్ లేదా పొటాటో ఫ్యాన్స్ అయితే, ఖచ్చితంగా ఇటువంటి కాంబినేషన్ వంటను ప్రయత్నించాల్సిందే.

చాలా సింపుల్ గా టేస్టీగా ఉండే ఈ ఆలూ ఎగ్ కర్రీని డిన్నర్ స్పెషల్ గా చాలా తక్కువ సమయంలో రుచికరంగా తయారుచేసుకోవచ్చు. ఇది నార్త్ ఇండియాలో చాలా పాపులర్ అయింది. ఈ వంట ఒరిజినల్ గా పంజాబి డిష్ . మరి ఈ స్పెషల్ అండే ఆలూ కా సాలన్ ఎలా తయారుచేయాలో చూద్దాం...

Anday Aloo Ka Sallan Recipe For Dinner

కావల్సిన పదార్థాలు:
గుడ్లు: 3-4
బంగాళదుంపలు: 2(కావల్సిన సైజ్ లో కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయలు: 2(సన్నగా కట్ చేసుకోవాలి)
టమోటోలు: 2(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
పచ్చిమిర్చి: 3-4
అల్లం వెల్లుల్లి పేస్ట్: 3tbsp
కారం: 1tbsp
గరం మసాలా పౌడర్: 1tbsp
పసుపు: 1/4tsp
ధనియాలపొడి : 2tbsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: తగినంత

తయారుచేయు విధానం:
1. ముందుగా విడివిడా బంగాళదుంపలు మరియు గుడ్డును ఉడికించుకోవాలి.
2. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి , అందులో నూనె వేసి వేడయ్యాక అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మరియు అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి రెండు మూడు నిముషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.
3. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అందులో టమోటో ముక్కలు వేసి మరో 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
4. ఇప్పుడు, అందులోనే ముందుగా ఉడికించి పెట్టుకొన్న బంగాళదుంపలు మరియు గుడ్లు (పొట్టు తీసేసి)వేసి మిక్స్ చేయాలి. వీటితో పాటు, కారం, గరం మసాలా, పసుపు, ధనియాలపొడి కూడా వేసి మొత్త మిశ్రమాన్ని మిక్స్ చేస్తూ ఫ్రై చేయాలి.
5. ఇలా ఫ్రై చేసిన తర్వాత సరిపడా నీళ్ళు, రుచికి సరిపడా ఉప్పు వేసి, మూత పెట్టి 10నిముషాలు మీడియం మంట మీద ఉడికించుకోవాలి. గ్రేవీ చిక్కబడిన తర్వాత స్టౌవ్ ఆఫ్ చేయాలి. అంతే అండే -ఆలు కా సాలన్ రెడీ.

English summary

Anday Aloo Ka Sallan Recipe For Dinner

Anday aloo ka sallan recipe is quite popular in north India. This potato and egg curry recipe is made with fine spices mixed in potato and egg. If you are an egg lover or a potato fan, then you would definitely love to try this dish out for dinner today. Aloo egg curry recipe is very simple and can be made in no time!
Story first published: Tuesday, November 18, 2014, 17:38 [IST]
Desktop Bottom Promotion