For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చేపల పులుసు: ఆంధ్ర స్టైల్

|

చేపల పులుసు ఒక అద్భుతమైన రుచి కలిగి నటువంటి ఆంధ్ర ఫిష్ కర్రీ. చాలా రుచికరంగా డిఫరెంట్ టేస్ట్ కలిగి ఉంటుంది. ఫిష్ కర్రీ(చేపల పులుసు) సౌత్ ఇండియాలో చాలా పాపులర్ అయినటువంటి రిసిపి. ఈ వంటను ఎప్పుడూ, చింతపండు, కొన్ని డిఫరెంట్ మసాలా దినుసులతోటి తయారుచేస్తారు. ఈ ఫిష్ కర్రీ, రైస్, ఇడ్లీ మరియు దోసెలోకి చాలా టేస్టీగా ఉంటుంది. సాధారణంగా ఈ ఫిష్ కర్రీ వండిన రోజుకంటే, మరుసటి రోజున చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి, ఈ ఫిష్ కర్రీని ప్రిజ్ లో ఉంచి మరొసటి రోజు కూడా తినవచ్చు.

అలాగే చేపలతో తయారుచేసిన వంటలు రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా పాపులర్ అయినటువంటి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అని కూడా మీకు అందిరికీ తెలిసిన విషయమే . ఈ ప్రోటీన్ రిచ్ ఫుడ్ ను తినడం వల్ల గుండె మరియు మెదడును ఆరోగ్యంగా చురుకుగా ఉంచుకోవచ్చు. డిప్రెషన్ తగ్గిస్తుంది మరియు ఆర్థరైటిస్ ను నివారిస్తుంది. కాబట్టి రెగ్యులర్ డైట్ లో ఈ ప్రోటీన్ రిచ్ ఫుడ్ చేర్చుకోండి....

Andhra Chepala Pulusu

కావలసిన పదార్దాలు :

చేప ముక్కలు : 1/2kg
కారం : 1tbsp
పసుపు: 1/4tsp
జీలకర్రపొడి: 1/2tsp
మిరియాలపొడి: 1/2tsp
ఉప్పు: రుచికి తగినంత
అల్లం వెల్లుల్లి పేస్టు : 2tsp
నూనె : తగినంత
జీలకర : 1tsp
మెంతులు : 1tsp
ధనియాలపొడి : 11/2tbsp
ఉల్లిపాయలు: 3(సన్నగా కట్ చేసుకోవాలి)
కరివేపాకు : రెండు మూడు రెమ్మలు
చింతపండు గుజ్జు : కొద్దిగా
పచ్చి మిర్చి : 4(మద్యలోకి కట్ చేసుకోవాలి)

తయారుచేయు విధానం:
1. ముందుగా చేపముక్కలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత చేపముక్కల మీద తడి ఆరిన తర్వాత మసాలా పొడులన్ని సగం సగం వేసి, ఉప్పు వేసి చేప ముక్కలకు బాగా పట్టించి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి.
3. అంతలోపు, టమోటో, ఉల్లిపాయ, పచ్చిమర్చిని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
4. అరగంట తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి, నూనె వేసి, వేడయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు, మెంతులు కరివేపాకు వేసి ఒక నిముషం వేగనివ్వాలి.
5. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, టమోటో, ముక్కలు , అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకదానికి తర్వాత ఒకటి వేసి కొద్దిగా ఉప్పు చిలకరించి ఫ్రై చేసుకోవాలి.
6. పచ్చిమిర్చి ఉల్లిపాయ వేగి, టమోటో మెత్తబడే సమయంలో మిగిలిన సగం బాగం మసాలా పొడలన్నీ మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.
7. తర్వాత అందులో చింతపండు గుజ్జు మరియు కొద్దిగా నీళ్ళు పోసి బాగా మిక్స్ చేసి, మీడియం మంట మీద ఉడికించుకోవాలి.
8. గ్రేవీ చిక్కగా ఉడికేటప్పుడు, ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకొన్న చేపముక్కలు వేసి మీడియం మంట మీద కొద్దిసేపు ఉడికించుకోవాలి. అంతే ఆంధ్ర చేపల పులుసు రెడీ.

Story first published: Saturday, December 20, 2014, 17:27 [IST]
Desktop Bottom Promotion