For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గోంగూర మటన్ కర్రీ రిసిపి: ఆంధ్రా స్టైల్

|

అసలే చలికాలం.. ఆ పై చల్లగాలి.. ఈ శీతల వాతావరణంలో వేడి వేడి రుచులను ఆస్వాధిస్తుంటే భలే మజా అనిపిస్తుంది కదండి..!! 'గోంగూరు' ఈ రుచి తెలియని తెలుగు వారు ఉండరు.. ఆంధ్రా గోంగూర వంటకానికి పెట్టింది పేరు.. గోంగూరతో చేసే ప్రతి వంటకం ఘుమ, ఘుమలాడుతూ మంచి రుచిని కలిగి ఉంటుంది.గోంగూర పచ్చడి ఆంధ్రా స్టేట్ లో ఒక పాపులర్ సైడ్ డిష్ రిసిపి. ఒక్క ఆంధ్రాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా గోంగూపచ్చడికి అత్యంత ప్రియులు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఇష్టపడే గోంగూర పచ్చడి సౌత్ ఇండియన్ రిసిపిల్లో ప్రధానంగా ఉంటుంది. పుల్లపుల్లగా, కారంగా ఉండే ఈ గోంగూర పచ్చడి ఆంధ్రాలో తెలుగు వారు ఎక్కువగా రైస్ తో తింటారు.

గోంగూరకు వేట మాంసాన్ని జోడిస్తే ఆ రుచే వేరు.. మాంసాహార ప్రియులకు ఈ వంటంకం మరింత రుచిని పంచుతుంది. ఒక్క రుచి మాత్రమే కాదు, ఇందులో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా గోంగూర ఆకుల్లో క్యాల్షియం, ఇనుము, విటమిన్‌ ‘ఎ', ‘సి', రైబోఫ్లెవిన్‌, ఫోలిక్‌యాసిడ్‌ మరియు పీచు ఎక్కువగా ఉంటుంది,. ఇందులో ఐరన్‌ అధికంగా ఉండడం వల్ల, కొంచెం ఎక్కువ తింటే అరక్కపోవడం కద్దు. గోంగూర వేటమాంసం తయారీకి కావల్సిన పదార్థాలు, తయరు చేసే విధానాన్ని ఇప్పుడు చూద్దాం..

ఈ ఆంధ్ర స్టైల్ గోంగూర మటన్ కర్రీ, ఆంద్రాలో వండే నార్మల్ మటన్ కర్రీలాగే ఉంటుంది. ఈ గోంగూర మటన్ కర్రీకి ఎక్కువ మసాలాలు ఉపయోగించాల్సిన అవసరం లేదు. గోంగూర ఫ్లేవర్ తో ఈ వంటకు మంచి రుచి, వాసన ఉంటుంది. ఇంకా ఇది కాస్త పుల్లని, కమ్మని టేస్టును అందిస్తుంది..

కావల్సిన పదార్థాలు:
గోంగూర : 1 కట్ట(తరిగి పెట్టుకోవాలి)
మటన్ : 1/2 kg
ఉల్లిపాయలు: 2 (చిన్న ముక్కలుగా తరిగినవి)
పచ్చిమిర్చి: 2 (మద్యలోకి కట్ చేసుకోవాలి)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tbsp
పసుపు పొడి: 1tsp
కారం పొడి: 1tsp
ఉప్పు : రుచికి సరిపడా
గరం మసాల : 1tsp
జీలకర్ర: 1tsp
గ్రీన్ యాలకలు: 2-3
దాల్చిన చెక్క: 1
నూనె: 4tbsp
కొత్తిమీర : 2tbsp(గార్నిషింగ్ కోసం)

Serves: 3
Preparation time: 10 minutes
Cooking time: 30 minutes

తయారుచేయు విధానం:
1. ముందుగా గోంగూరను నీటిలో వేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత పాన్ లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడయ్యాక అందులో గోంగూర ఆకులు వేయాలి.
2. పాన్ కు మూత పెట్టి మీడియం మంట మీద 5నిముషాలు మెత్తగా ఉడికించుకొని, పక్కన తీసి పెట్టుకోవాలి.
3. తర్వాత స్టౌ మీద ప్రెజర్ కుక్కర్ పెట్టి అందులో నూనె వేసి వేడయ్యాక జీలకర్ర, లవంగాలు, యాలకలు, దాల్చిన చెక్క వేసి ఒకటి రెండు నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
4. తర్వాత అందులో ఉల్లిపాయలు మరియు పచ్చిమిర్చి వేసి మరో 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
5. ఇప్పుడు అందులోనే అల్లం, వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, మటన్ ముక్కలు వేసి మరో 5నిముషాలు మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.

6. తర్వాత అందులో ఉప్పు వేసి మిక్స్ చేసి మరో 5నిముషాలు ఉడికించుకోవాలి.
7. ఇప్పుడు మటన్ కు ఒక కప్పు నీళ్ళు జోడించి మిక్స్ చేసి మూత పెట్టి, లిడ్ కూడా అమర్చి, 4-5విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.
8. మటన్ ఉడికిన తర్వాత ఈ మొత్తం మిశ్రమాన్ని ఒక పాన్ లోకి మార్చుకొని, తక్కువ మంట మీద ఉడికించుకోవాలి.
9. ఇప్పుగు మాషర్ లేదా పప్పు కట్టింతో గోంగూరను మాష్ చేసుకోవాలి. లేదా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవచ్చు.

10. తర్వాత ఈ పేస్ట్ ను పాన్ లో ఉడుకుతున్న మటన్ గ్రేవీలో వేసి బాగా మిక్స్ చేయాలి.
11. గోంగూర, మటన్ మిక్స్ అయిన తర్వాత మూత పెట్టి 5నిముషాలు ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి గరం మసాలా పౌడర్ వేసి మిక్స్ చేసి స్టౌ ఆఫ్ చేయాలి.
12. చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి.
అంతే రుచికరమైన నోరూరించే ఆంధ్రస్టైల్ గోంగూర మటన్ కర్రీ రెడీ. ఈ స్పెషల్ గోంగూర మటన్ ను వేడి వేడి అన్నంతో సర్వ్ చేసి ఎంజాయ్ చేయవచ్చు.

న్యూట్రీషియన్ విలువలు:
గోంగూరలో విటమిన్ ఎ, బి మరియు సిలు పుష్కలంగా ఉన్నాయి. ఇంకా మినిరల్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే మటన్ లో కూడా మంచి ఫ్యాట్ మరియు క్యాల్షియం ఉండటం వల్ల ఎముకల బలానికి ఉపయోగపడుతుంది.

Andhra Style Gongura Mutton Curry Recipe

English summary

Andhra Style Gongura Mutton Curry Recipe

Gongura leaves or sorrel leaves are a specialty of Andhra Pradesh. These leaves are sour in taste and are of two varieties - ones with white stem and the other with red stem. The leaves with red stems are sourer than the one with white stems.
Story first published: Monday, December 8, 2014, 12:38 [IST]
Desktop Bottom Promotion