For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రాన్ సలాడ్ : బ్యాంగ్ కాక్ స్పెషల్

|

ప్రాన్స్ కు మరియు సలాడ్స్ కు బ్యాంగ్ కాక్ చాలా ఫేమస్ . బ్యాంగ్ కాక్ ప్రాన్ రిసిపి చాలా టేస్ట్ గా మరియు మంచి రుచిని కలిగి ఉంటుంది. ఈ బ్యాంగ్ కాక్ స్పెషల్ ప్రాన్స్ సలాడ్ రిసిపిని టేస్ట్ చేసిన తర్వాత ప్రాన్స్ రెగ్యులర్ రుచిలను మరిచిపోతారు.

అంత అద్భుతమైన టేస్ట్ ను కలిగి ఉంటుంది . మరియు ఇంకెందుకు ఆలస్యం బ్యాంగ్ కాక్ సలాడ్ రిసిపి ఎలా తయారుచేయాలో తెలుసుకొని వెంటనే ప్రారంభించండి. ఈ సలాడ్ రిసిపి తయారుచేయడం చాలా సులభం మరియు పిల్లలు చాలా ఎక్కువగా ఇష్టపడుతారు. మరి దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం....

prawn salad

కావల్సిన పదార్థాలు:
ప్రాన్స్(రొయ్యలు): 1/2kg
వెల్లుల్లి రెబ్బలు: 6-7

సలాడ్ డ్రెస్సింగ్ కోసం:
చిల్లీ సాస్: 2 tbsp
ఫిష్ సాస్ : 5-6 tbsp
వైట్ వెనిగర్: 4 tbsp
గ్రీన్ చిల్లీస్: 7-8
నువ్వుల నూనె: 1 tsp
నూనె: అరకప్పు

సలాడ్ తయారికోసం:
ఉల్లికాడలు: 4-5
క్యారెట్స్ : ఒకటి పెద్దది
కొత్తిమీర: 1కట్ట
థాయ్ రెడ్ చిల్లీ: 4-5
ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా నీళ్ళలో ప్రాన్స్ మరియు కొద్దిగా ఉప్పు వేసి మరిగించాలి. తర్వాత అందులో వెల్లుల్లి వేయాలి.
2. సలాడ్ డ్రెస్సింగ్ తయారుచేయడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అంుదలో ఫిష్ సాస్, చిల్లీ సాస్, వైట్ వెనిగర్ మరియు సన్నగా తరిగిన పచ్చిమిర్చి, వెల్లుల్లి మరియు నువ్వుల నూనె వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. దీన్ని డ్రెస్సింగ్ కోసం ఉపయోగించుకోవచ్చు.
3. తర్వాత క్యారెట్ ను సన్నగా తరిగి అందులో గ్రీన్ కలర్ ఉల్లికాడలను , కొత్తిమీర తరుగు, మరియు థాయ్ రెడ్ చిల్లీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
4. ఇప్పుడు ముందుగా వేడినీళ్ళల్లో ఉడికించి పెట్టుకొన్న ప్రాన్స్ ఇందులో వేసి మిక్స్ చేయాలి.
5. చివరగా సలాడ్ డ్రెస్సింగ్ ను వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేసి సర్వ్ చేయాలి. అంతే ప్రాన్ సలాడ్ రిసిపి రెడీ.

English summary

Bangkok Prawn Salad Recipe: Telugu Vantalu

Bangkok is famous for its salads and prawns. Bangkok prawn recipe has a unique and an exotic taste. After having bangkok prawn recipe, you will forget to have prawns in a usual way.
Story first published: Wednesday, July 29, 2015, 17:30 [IST]
Desktop Bottom Promotion