For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బీఫ్ కట్ లెట్: స్పెషల్ రంజాన్ రిసిపి

|

తెలుగులో..అతిథి దేవుడితో సమానమైతే...ఉర్దూలో ‘మోహమాన్ నవాజీ'. భాష ఏదైనా భావం ఒక్కటే...ఉర్ధూలో ‘దస్తరే'...తెలుగులో విస్తరి. మతాలు వేరైనా దైవం ఒక్కడే. సంస్క్రుతి ఏదైనా సంప్రదాయం ఒక్కటే. దేవం ఎవరైనా ఆరాధన ఒక్కటే. మరి ఈ రంజాన్ వేళ దస్తర్(విస్తరి)రుచులు చూపించాలంటే కొంచెం వెరైటీగా ఏదైనా వండాల్సిందే...

రంజాన్ మాసం మొదలైందంటే చాలు... ఇఫ్తార్ విందుల ఘుమఘుమలు నోరూరిస్తాయి. అత్యంత భక్తిశ్రద్ధలతో రోజంతా ఉపవాసాలు పాటించే ముస్లింలు.. సాయంత్రం ఇఫ్తార్ ఆరగించేందుకు... బోలెడు రుచులు వాటిలో బీఫ్ కట్ లెట్ కూడా ఒకటి. దీన్ని తయారు చేయడం కూడా సులభం, రుచికరంగా కూడా ఉంటుంది. మరి దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం...

Beef Cutlet

కావల్సిన పదార్థాలు:
బీఫ్ ఖీమా : 250grms
మొక్కజొన్న పిండి: 2tbsp
ఉల్లిపాయలు: 1(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
అల్లం వెల్లుల్లి: 1tbsp
పచ్చిమిరపకాయలు:4 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
పెప్పర్ పౌడర్: 1tbsp
కారం: 1 tsp
వినెగార్: 1tsp
బ్రెడ్ ముక్కలు: కొద్దిగా
ఆయిల్: 5tbsp
ఉప్పు: రుచికి సరిపడా

తయారు చేయు విధానం:
1. ముందుగా బీఫ్ (గొడ్డమాంసంను)ఖీమాను కుక్కర్ లోవేసి రెండు మూడు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి. ఎందకంటే ఇది, మిగిలిన మాంసాహారల కంటే చాలా గట్టిగా ఉంటుంది. కాబట్టి ఫ్రై చేసుకోవడానికి ముందు ఉడికించుకోవడం మంచిది.
2. ఇప్పుడు ఉడికించుకొన్న బీఫ్ కీమాను ఒక బౌల్లోకి తీసుకొని, అందులో వెనిగర్ మరియు ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి.
3. తర్వాత అందులోనే ఉల్లిపాయ, పచ్చిమిర్చిముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి.
4. అందులోనే బ్లాక్ పెప్పర్ పౌడర్ మరియు కారం కూడా వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. చివరగా కార్న్ ఫ్లోర్ (మొక్కజొన్న పిండి )కూడా వేసి బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి.
5. కార్న్ ఫ్లోర్ మిక్స్ చేయడం వల్ల అది మిశ్రం చిక్కగా, మందంగా ఉండేలా చేస్తుంది. దాంతో కట్ లెట్ లా సులభంగా వత్తుకోవచ్చు. ఇందులో నుండి కొద్ది కొద్దిగా తీసుకొని, ముద్దలా చేసి అరచేతిలో పెట్టుకొని, కట్ లెట్ లా వత్తుకోవాలి.
6. తర్వాత డీప్ బాటమ్ పాన్ లో నూనె వేసి, కట్ లెట్ లా వత్తి పెట్టుకొన్న ఖామా ముద్దను కాగే నూనెలో వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించి పెట్టుకోవాలి.
7. తర్వాత ఒక టిష్యుపేపర్ మీద బ్రెడ్ పొడి వేసి, ఫ్రై చేయడానికి ముందు బ్రెడ్ పొడిలో కట్ లెట్ ను రెండు వైపులా అద్ది తర్వాత నూనెలో విడవాలి. దాంతో ఖీమా కట్ లెట్ క్రిస్పీగా ఉంటుంది. అంతే బీఫ్ కట్ లెట్ రెడీ.

English summary

Beef Cutlet: Special Ramadan Recipe!

Beef cutlets are easy and quick Ramadan recipes to cook. As the holy month of fasting is in progress this is a special Ramadan recipe with which you can make crispy cutlets to break your evening fast.
Story first published: Monday, July 15, 2013, 17:06 [IST]
Desktop Bottom Promotion