For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బెంగాలి ఫిష్ కర్రీ:ఉల్లిపాయలేకుండా

|

బెంగాలీ వంటలు చాలా రుచికరంగా ఉంటాయి. బెంగాలుకు ఇష్టమైన ఫిష్ కర్రీని వివిధ రకాలుగా తయారు చేస్తుంటారు. ఉల్లిపాయ ఫ్లేవర్ లేకుండా తయారు చేసే ఈ బెంగాల్ ఫిష్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది.

ఈ రుచికరమైన ఫిష్ కర్రీ తయారు చేయడం చాలా సులభం. మరియు త్వరగా కూడా తయారవుతుంది. మరియు ఉల్లిపాయ ఉపయోగించని ఈ ఫిష్ కర్రీ టేస్ట్ మీరూ చూడాలనుకుంటుంటే ఒక సారి దీని తయారీ విధానంను పరిశీలించండి.

Bengali Fish Curry

కావల్సినపదార్థాలు:
ఫిష్ (ప్రాధాన్యంగా Rohu లేదా హిల్సాచేపలు) : 4ముక్కలు(మీడియం సైజ్)
బంగాళాదుంప:1 (సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి)
అల్లం పేస్ట్: 1tsp
పచ్చిమిరపకాయలు: 3 (మద్యలోకి కట్ చేసినవి)
జీలకర్ర: 1tsp
పసుపు: 1tsp
కారం: 1tsp
జీలకర్ర పొడి: 1tsp
బియ్యం పిండి: 1tbsp
చక్కెర: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
ఆవాల నూనె: 4tbsp
నీళ్ళు: 1 ½ cups
కొత్తిమీర: 2tbsp(సన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)

తయారుచేయు విధానం:
1. ముందుగా చేప ముక్కలను బాగా శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి.
2. ఈ చేప ముక్కలకు పసుపు మరియు ఉప్పు పట్టించి పక్కనుంచాలి.
3. ఇప్పడు పాన్ లో కొద్ది మస్టర్డ్ ఆయిల్ వేసి వేడి చేయాలి.
4. పసుపులో మ్యారినేట్ చేసి పెట్టుకొన్న చేప ముక్కలు వేసి అన్ని వైపుగా కాలేవిధంగా మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.
5. ఒక్కసారి చేపముక్కలన్నీ వేగించుకొన్నాక ఒక ప్లేట్ తీసిపక్కన పెట్టుకొన్నాడు.
6. తర్వాత అదే పాన్ లో 2టేబుల్ స్పూన్ వేసి వేడి చేసి, అందులో జీలకర్ర వేసి వేగించాలి.
7. తర్వతా అందులో అల్లం పేస్ట్, పచ్చిమిర్చి, బంగాళదుంప ముక్కలు వేసి, మీడియం మంట మీద వేగించాలి.
8. తర్వాత ఒక గిన్నెలో చిటికెడు పసుపు, కారం, జీలకర్ర వేసి బాగా మిక్స్ చేసి అరకప్పు నీళ్ళు పోసి, బాగా మిక్స్ చేసి పాన్ లో పోయాలి.
9. తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా ఉడికించుకోవాలి.
10. ఉడికేటప్పుడు అందులో ఉప్పు, పంచదార మరియు మరో అరకప్పు నీళ్ళు పోసి, బాగా మిక్స్ చేసి ఉడికించాలి.
11. ఇప్పుడు అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకొన్న చేపముక్కలు వేసి, మంట పూర్తిగా తగ్గించి ఉడికించుకోవాలి .
12. ఒక చిన్న గిన్నెలో బియ్యం పిండి, అరకప్పు నీళ్ళు పోసి బాగా మిక్స్ చేసి, ఉడుకుతున్న చేపముక్కల గ్రేవీ పాన్ లో పోయాలి. బియ్యం పిండి ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేయాలి.
13. మరికొన్ని నిముషాలు సిమ్ లో పెట్టి, తర్వాత స్టౌ ఆఫ్ చేసేయాలి. అంతే కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి.

English summary

Bengali Fish Curry Without Onion

With the onion prices soaring sky high, it can hardly be used in our daily food as lavishly as before. So, does that mean we have to give up on eating good onion? Not necessarily as we Indians have a solution for everything.
Story first published: Saturday, August 24, 2013, 13:12 [IST]
Desktop Bottom Promotion