For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డెలిషియస్ డిష్ బెంగాలీ స్టైల్ ఫిష్ బిర్యానీ రిసిపి

|

బెంగాలీ ఫిష్ బిర్యానీ..ఆహా ఏమి రుచి..నోట్లో నీరూరించాలంటే ఈ బెంగాలీ డిష్ ను వండాల్సిందే. ఈ డెలిషియస్ బిర్యానీ ఇతర బిర్యానీలతో పోల్చితే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ బిర్యానీలో మసాలాలు చాలా తక్కువగా ఉపయోగిస్తారు. అయితే రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది.

ఈ అద్భుతమైన రుచికరమైన బిర్యానీని రహు ఫిష్ తో తయారు చేస్తారు. ఇది మీరు తయారు చేసే విధానాన్ని బట్టి రుచి ఆధారపడి ఉంటుంది. ఇందులో బంగాళదుంపలను ఉపయోగించడం వల్ల పూర్తిగా డిఫరెంట్ ఫ్లేవర్ తో నోరూరిస్తుంటుంది. మరి మీకూ ఈ డిష్ తినాలనిపిస్తుంటే..తయారు చేసే విధానం మీద ఇక లుక్కేయండి....

Fish biryani in Bengali style

బాస్మతి బియ్యం: 2 ½cups
చేప ముక్కలు: 4- 5 ముక్కలు (ప్రాధాన్యంగా Rohu చేప)
ఉల్లిపాయలు: 2 (పెద్ద, ముక్కలుగా చేసుకోవాలి)
బంగాళ దుంపలు : 2 (పెద్దవి, నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి)
దాల్చిన చెక్క : చిన్న ముక్క
బ్లాక్ ఏలకులు: 1
గ్రీన్ ఏలకులు: 2
లవంగాలు: 3
బే ఆకులు: 3
జాజికాయ పొడి: ½tsp
జాపత్రి పొడి: ½tsp
పసుపు: ½tsp
కారం: 1tsp
జీలకర్ర పొడి: ½tsp
నిమ్మరసం: 2tbsp
పాలు: 1cup
కుంకుమ పువ్వు : ఒక చిటికెడు
చక్కెర: 1tsp
ఉప్పు : రుచికి సరిపడా
కెవ్రా(Kewra)వాటర్: 1tsp
నెయ్యి: 2tbsp
నూనె: 4tbsp
కొత్తిమీర: 2tbsp(గార్నిష్ కోసం సన్నగా తరిగి పెట్టుకోవాలి)
నీళ్ళు: 5 cups

తయారు చేయు విధానం:
1. ముందుగా చేపముక్కలను బాగా శుభ్రం చేసి, ఉప్పు, పసుపు వేసి రుద్ది నీళ్ళు పోసి కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక చెంచా నిమ్మరసం, పసుపు, కారం, జీలకర్రపొడి, ఉప్పు, వేసి బాగా మిక్స్ చేసి చేపలకు పట్టించి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి.

2. అంతలోపు బియ్యాన్ని క్లీన్ చేసి కడిగి పెట్టుకోవాలి.

3. తర్వాత డీప్ బాటమ్ పాన్ తీసుకొని అందులో నెయ్యి వేసి, కాగిన తర్వాత అందులో బిర్యాని ఆకు, చెక్క, యాలకులు, లవంగాలు మరియు బియ్యం ఒకదాని తర్వాత ఒకటి వేసి వేగించాలి.

4. తర్వాత అందులో నీళ్ళు కలుపుకోవాలి. తర్వాత పాన్ కు మూత పెట్టి పది నిముషాల పాటు తక్కువ మంట మీద 90%ఉడికించుకోవాలి.

5. ఇలా అన్నం తయారు చేసుకొన్న తర్వాత ఒక ప్లేట్ లోనికి తీసుకొని, అన్నాన్ని ప్లేట్ మొత్తం సర్ధి, చల్లారనివ్వాలి.

6. అన్నం చల్లారే లోపు పాలలో కుంకుమపువ్వు వేసి పక్కన పెట్టుకోవాలి.

7. తర్వాత బంగాల దుంపలను ఉడికించి పెట్టుకోవాలి.

8. తర్వాత పాన్ లో కొద్దిగా నూనె వేసి, ఉడికించిన బంగాళదుంపలను అందులో వేసి 5నిముషాల పాటు వేగించి, పక్కనతీసి పెట్టుకోవాలి.

9. తర్వాత పాన్ లో రెండు చెంచాల నూనె వేసి, అందులో చేప ముక్కలు వేసి, 5-10నిముషాలు, అతి తక్కువ మంట మీద చేపముక్కలు అన్నివైపులా బాగా కాలేవరకూ వేగించి పెట్టుకోవాలి.

10. మరో పాన్ లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి కాగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి మీడియం మంట మీదు వేగించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు గోల్డ్ బ్రౌన్ కలర్ లోని మారగానే ప్లేట్ లో తీసి పక్కన పట్టుకోవాలి.

11. ఇప్పుడు ఒక వెడల్పాటి, డీప్ బాటమ్ పాన్ తీసుకొని అందులో నెయ్యి వేసి కాగినివ్వాలి.

12. తర్వాత అన్నంను రెండు బాగాలుగా చేసుకోని, సగ భాగం అన్నంను వేడి నెయ్యి పాన్ లో స్ప్రెడ్ చేయాలి. తర్వాత దాని మీద పంచదార, జాజికాయ, జాపత్రి పొడి, ఉప్పు, కుంకుమపువ్వు నానబెట్టిన పాలు, సగ భాగం వేగించుకొన్ని బంగాళదుంపులు, వేగించుకొన్న ఉల్లిపాయ ముక్కలు అన్నింటిని ఒక దాని తర్వాత ఒకటి లేయర్స్ గా పరుచుకోవాలి.

13. తర్వాత రెండో సారి కూడా మిగిలి సగం బాగం అన్నింటిని ఇదేవింధంగా లేయర్స్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత చేపముక్కలను సర్దుకొని, దాని కెవర్ వాటర్ చిలకరించాలి.

14. తర్వాత ఇలా మొత్తం సర్దేసుకొన్న తర్వాత పాన్ మూత పెట్టి అతి తక్కువ మంట మీద 10-15నిముషాలు ఉడికించుకోవాలి.

15. తర్వాత స్టౌ ఆఫ్ చేసి మూత తీసి నిమ్మరసాన్ని చిలకరించాలి. తర్వాత కొత్తిమీర తరగుతో గార్నిష్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే నోరూరించే బెంగాలి స్టైల్ ఫిష్ బిర్యాని రెడీ. దీన్ని రైతా లేదా పాపాడ్ తో ఎంజాయ్ చేయాలి.

English summary

Bengali Style Fish Biryani Recipe

Fish biryani in Bengali style - Wow! Enough to make one's mouth water. There is an interesting story behind this Bengali delicacy. Biryani in Bengal evolved from the Lucknow style when the last Nawab of Awadh was exiled to Kolkata. The Nawab brought his royal chef along.
Story first published: Monday, June 10, 2013, 17:39 [IST]
Desktop Bottom Promotion