For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బెంగాలి స్టైల్ ట్రెడిషనల్ ఫిష్ కాలియా రిసిపి

|

సాధారణంగా చేపలు వంట్లో చాలా తక్కువ వెరైటీలు కలిగి ఉంటాయి. కాబట్టి, మనం వెరైటీ టేస్ట్ ను రుచి చూడాలంటే, మన పక్కన రాష్ట్రల వంటలను ప్రయత్నించవచ్చు . బెంగాలీ వంటలు ప్రత్యేక రుచిని కలిగి ఉంటాయి . తయారుచేయడానికి చాలా సింపుల్ గానే ఉండే వంటలు, రుచిలో మాత్రం గ్రేట్ గా ఉంటాయి . బెంగాలీ వంటల్లో ఫిష్ వంటలకు పత్యేక ప్రాధాన్యత ఉంది. స్పైసీ ఫిష్ వంటలో మస్టర్డ్ ఫిష్ కర్రీ చాలా ఫేమస్. దీన్నే బెంగాల్లో ఫిష్ కాలియా రిసిపి అంటారు. ఈ ఫిష్ కాలియా చాలా సింపుల్ గా ఉంటుంది.

అయితే మన స్టైల్లో ఈ ఫిష్ కర్రీని, కోకోనట్ మిల్క్ ఉపయోగించి ఎలా తయారుచేయాలో ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది. మచ్చర్ జాల్ ఫిష్ కర్రీకి చిన్న చేపలు, తెలాపియ, పబ్దా, టాగ్రా మొదలగు చేపలతో ఎక్కువగా వండుతారు. ఫిష్ కాలీయా రిసిపి మరి మీరు కూడా టేస్ట్ చేయాలంటే, ఎలా తయారుచేయాలో చూడండి..

Bengali Traditional Fish Kalia Recipe

కావల్సిన పదార్థాలు:

  • రఘుఫిష్ (కావాల్సిన సైజ్ లో కట్ చేసుకోవాలి) - 4 pieces
  • బంగాళదుంపలు - 2 medium sized (cut into quarters)
  • ఉల్లిపాయలు - 2 (finely chopped)
  • టమోటోలు - 1 (finely chopped)
  • నిమ్మరసం - 1 teaspoon
  • పెరుగు - 1 teaspoon
  • అల్లం పేస్ట్ - 2 teaspoon
  • వెల్లుల్లిపేస్ట్ - 2 teaspoon
  • పచ్చిమిర్చిపేస్ట్ - 2 teaspoon
  • ఆవనూనె - 4-5 teaspoon
  • టమోటో గుజ్జు - 1 teaspoon
  • పసుపు - 1/4 teaspoon
  • జీలకర్ర పొడి - 1 teaspoon
  • కారం - According to taste
  • ఉప్పు - According to taste
  • పంచదార - 1 teaspoon
  • గరం మసాలా - 1/2 teaspoon
  • బిర్యానీ ఆకు- 2
  • మసాలా దినుసులు - (దాల్చిన చెక్క: 1 small piece, లంగాలు: 2, యాలకలు: 2)
  • ఎండుమిర్చి - 1 (optional)
  • ఫ్లేవర్ కోసం (జీలకర్ర, సోంపు, మెంతి, కలోంజి, ఆవాలు) - 1/4 teaspoon
  • నెయ్యి - ½ TSP
  • నీళ్ళు
  • కొత్తిమీర గార్నిష్ కోసం

తయారుచేయు విధానం:

1. ముందుగా చేపముక్కలను బాగా కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి.
2. తడి ఆరిన తర్వాత వాటికి ఉప్పు, పసుపు, పెరుగు, మరియు నిమ్మరసం చేర్చి బాగా మిక్స్ చేసి 20 నిముషాలు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత పాన్ లో ఆవనూనె వేసి వేడి చేయాలి. నూనె వేడి అయ్యాక అందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకొన్న చేపముక్కలను వేసి 5నిముషాలు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి.
3.ఇప్పుడు బంగాళదుంపలను బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసి పెట్టుకోవాలి .
4. తర్వాత అదే పాన్ లో మరికొద్దిగా నూనె వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి. తర్వాత అందులోనే అల్లం, వెల్లుల్లి, మరియు పచ్చిమిర్చి పేస్ట్ వేయాలి.
5. ఇప్పుడు అందులోనే జీలకర్ర, సోంపు, మెంతి, కలోంజి, ఆవాలు, ఎండు మిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి.
6. ఇప్పుడు మరో బౌల్ తీసుకొని అందులో పసుపు, జీలకర్ర, మరియు కారం , సరిపడా నీళ్ళు సోయాలి. ఈ మిశ్రమాన్ని మీడియం మంట మీద బాయిల్ చేయాలి . తర్వాత అందులోనే టమోటో గుజ్జు కూడా వేసి ఉడికించుకోవాలి. దాంతో ఆయిల్ వేరుపడుతుంది.
7. ఈ మసాలాలతోనే బంగాళదుంప చేర్చి బాగా ఉడికించుకోవాలి . దాంతో మసాలన్నీ కూడా బంగాళదుంపలకు బాగా పడుతాయి . తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసి ఉడికించుకోవాలి.
8. బంగాళదుంప మెత్తగా ఉడికిన తర్వాత 1/2 వాటర్ వేసి ఉడికించుకోవాలి.
9. బంగాళదుంపలు మెత్తగా ఉడికిన తర్వాత అందులో చేపముక్కలు మరియు సన్నగా తరిగిన టమోటో ముక్కలు వేసి 5నిముషాలు ఉడికించుకోవాలి.
10.చేపముక్కలు మీడియంగా ఉడికినట్లు తెలియగానే స్టౌ ఆఫ్ చేయాలి . తర్వాత గరం మసాలా కొద్దిగా చిలకరించి బాగా మిక్స్ చేయాలి. చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే బెంగాలి ట్రెడిషినల్ ఫిష్ కాలీ రిసిపి రెడీ.

English summary

Bengali Traditional Fish Kalia Recipe

Do you know how to prepare Fish Kalia? 'Macher Kalia’is one of the most remarkable dishes of the Bengali cuisine and no occasion and festival can be complete without this preparation.
Story first published:Thursday, April 28, 2016, 18:07 [IST]
Desktop Bottom Promotion