For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బాంబే చికెన్ బిర్యానీ : నాన్ వెజ్ స్పెషల్

|

బాంబే బిర్యానీ క్లాసిక్ సౌత్ ఈస్ట్ ఆసియన్ డిష్. ఈ బిర్యాని రిసిపి చాలా సింపుల్ గా మరియు టేస్టీగా ఉంటుంది. ఈ బిర్యానీ డిష్ ను తయారుచేయడం కూడా చాలా సులభం. ఈ రుచికరమైన బాంబే బిర్యానీ స్పెషల్ గా పార్టీలు, ఫంక్షన్స్ మరియు చాలా స్పెషల్ గా వచ్చే అతిథులకోసం తయారుచేసుకోవచ్చు .

చాలా తక్కువ సమయంలో, ఎక్కువ రుచితో తయారచేసుకోగల ఈ బాంబే స్పెషల్ చికెన్ బిర్యానీని అద్భుతంగా ఏవిధంగా తయారుచేయాలో చూద్దాం...

Bombay Chicken Biryani Recipe

కావల్సిన పదార్థాలు:
చికెన్: 1kg(కావాల్సిన సైజ్ లో కట్ చేసుకోవాలి)
బియ్యం: 1/2kg
ఉప్పు: 1 tbps and 1 tsp
ఉల్లిపాయ ముక్కలు: (గోల్డ్ బ్రౌన్ కలర్ వేగించి పెట్టుకోవాలి)
నూనె: ¾ cup
అల్లం పేస్ట్: 3 tsp
వెల్లుల్లి పేస్ట్: 3 tsp
పెరుగు: 1 cup
మసాలా పొడులన్నీ కలిపి: 1 tsp
కారం: 2 tsp
జీలకర్ర పొడి: 2 tsp
పచ్చిమిర్చి: 8 (పేస్ట్ చేసుకోవాలి)
కొత్తిమీర: 1/2కట్ట
బంగాళదుంపలు: 3
మసాలాలు: 1tbsp
పచ్చిమిర్చి: 6
ఎల్లో ఫుడ్ కలర్ : చిటికెడు
కెవ్రా ఎసెన్స్: 1 tbps

తయారుచేయు విధానం:
1. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో చికెన్ ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం పేస్ట్, ఉప్పు, కారం, జీలకర్ర, అన్ని రకాల మసాలా పొడులు వేసి కనీసం ఒక గంట సేపు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి.
2. తర్వాత బియ్యం శుభ్రంగా కడిగి కొద్దిగా ఉప్పువేసి సంగం ఉడికేవరకూ ఉడికించి పెట్టుకోవాలి.
3. ఇప్పుడు బంగాళదుంపల యొక్క పొట్టు తొలగించి ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా కడిగి ఫ్రైయింగ్ పాల్ లో వేసి ఫ్రై చేసి పెట్టుకోవాలి.
4. తర్వాత ఒక బౌల్లో రెండు టేబుల్ స్పూన్ల నీళ్ళు పోసి అందులో ఎల్లో ఫుడ్ కలర్ వేయాలి.
7. ఇప్పుడు ఒక మందపాటి పాత్రలో ముందుగా సగం ఉడికించి పెట్టుకొన్న అన్నంవేసి పాత్రమొత్తం సర్ధాలి. తర్వాత దానికి మీద ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ వేసి సర్దాలి, తర్వాత బంగాళదుంపలు, అరకప్పు వేగించుకొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర మరియు పచ్చిమిర్చి తరుగు వేసి సమంగా సర్దుకోవాలి. ఇలా రెండు మూడు లేయర్స్ గా మొత్తం సర్దుకోవాలి.
8. తర్వాత పైన ఎల్లో ఫుడ్ కలర్ మిక్సర్ ను వేసి మూత పెట్టి, చాలా తక్కువ మంట మీద 15నిముషాలు ఆవిరి మీద మాత్రమే ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల సగం ఉడికిన అన్నం, పూర్తిగా ఉడుకుతుంది, మరియు చికెన్, బంగాళదుంపలు కూడా మెత్తగా ఉడుకుతాయి.
9. మొత్తం ఉడికించుకొన్న తర్వాత మూత తీసి అందులో కెవ్రా ఎసెన్స్ ను చిలకరించి, మూత పెట్టి మరో రెండు నిముషాలు ఉడికించుకోవాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి క్రిందికి దింపుకోవాలి. అంతే బాంబే బిర్యానీ రిసిపి రెడీ...

English summary

Bombay Chicken Biryani Recipe


 bombay Biryani is a classic South East Asian dish. Shireen Anwar has revealed a simple and delicious recipe of Bombay Biryani for young cooks that they can easily manage. This delicious Bombay Biryani can be served in parties, functions and to very special guests also.
Story first published: Monday, December 29, 2014, 12:52 [IST]
Desktop Bottom Promotion